భక్త మహల్సాపతి 3వ బాగం..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబాతో మహాల్సాపతి సహజీవనము

భక్తులాయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక్క మహాల్సాపతి మాత్రమే బాబా కంఠానికి చందనమద్దేవారు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు. మరురోజు నుండి అతడు సాయి ని అలానే అలకరించ సాగారు. అతనిని వారించమని ముస్లింలు కోరినా సాయి అభ్యంతరం చెప్పలేదు. వారిలో కొందరు సంగమనేరు లోని ఖాజితో సంప్రాందించి, సాయి ముఖాన చందనమడ్డిన వారిని దండించదలచారు. మొహిద్దిన్ తంబులి ఆ విషయం మహాల్సపతికి చెప్పారు. మరురోజతడు మశిదు ముంగిట నుంచే సాయి ని పూజిస్తున్నాడు. సాయి అతనిని “లోపలికొచ్చి నా ముఖాన చందనమద్దు, ఎవరడ్దోస్తారో చూస్తాను!” అని గద్దించారు. ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు. నాటి నుండి మహాల్సాపతి యద్దేచ్చగా మశిదు కు వచ్చి   సాయి ని అరాధించసాగారు.

మహల్సాపతికి  ఎటువంటి సంపాధన లేక, తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో, విసుగు చెంది వున్నప్పుడు, ఖండోబా ఆయనకు రెండు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖండోబా ఉత్సవ విగ్రహాలను తన ఇంటికి తీసుకువెళ్ళి పూజలు జరిపించడం మరియు ఆయన కంసాలి వృత్తిని వదలమని చెప్పడం.

మహల్సాపతి సాయితో ఎంతో సన్నిహితంగా వుంటుండేవారు. బాబా మానవాతీత శక్తులను, ప్రేమను స్వయంగా చూసి అనుభవించిన మహల్సాపతి తరువాత నుంచి ప్రాపంచిక విషయాలను పూర్తిగా వదలి ఆయనకు అంకితమయిపోయారు.  

బాబా మసీదులో నివసించడానికి ప్రవేశించినప్పటి నుండి, మహల్సాపతి, తాత్యాపాటిల్ యిద్దరూ ఆయనతో కలిసి నిదురించేవారు. మసీదులో బాబాతో కలసి నిదురించే అదృష్టం వీరిద్దరికే దక్కింది.  అప్పటికి రాత్రి 9.30 గంటలు అయ్యేది. కొంతసేపటికి మహాల్సాపతి లేచి, ప్రమిదలలో నూనె నింపి, వత్తులు సవరించి, బాబా రొట్టెలు పెట్టుకొనే కుండ మీద మూత పెట్టి, ధునిలో కట్టెలు వేసేవారు.

ముగ్గురూ వారి తలలు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు పెట్టుకొని, మశిదు మద్యలో పాదాలు కలిసేలా పడుకొని, ఎంతోసేపు మాట్లాడుకునేవారు. వారిలో ఎవరికి నిద్ర తూగిన రెండవ వారితో కలసి సాయి అతనిని అటూ ఇటు వూపి, అతని తల, వీపు, కాళ్ళు నొక్కి నిద్ర లేపేవారు.

మహాల్సాపతి  బాబా  పాదాలు ఒత్తేవారు. అతడికి నిద్ర తూగితే బాబా తట్టిలేపేవారు. అతనిని రాత్రి లఘుశంకకు గూడా బయటకు పోనివ్వక, “మశిదు నుండి దిగితే చచ్చిపోతావు, జాగ్రత్త!” అనేవారు.  చావడి సిధ్ధమయిన తరువాత బాబా ఒకరోజు మసీదు మరొక రోజు చావడిలోను నిదురించేవారు. 

మహల్సాపతి  సంప్రదాయంగా వస్తున్న తన వృత్తిని వదలి సన్యాసిలా కుటుంబంతో కూడా ఎక్కువ కాలం గడిపేవారు కారు.   భోజనానికి మాత్రమే యింటికి వెళ్ళేవారు.  ఇతర సమయాలలో ఆయన బాబాకు సేవ చేస్తూ ఉండిపోయేవారు.  రాత్రులందు బాబాతో మసీదులో నిద్రపోయేవారు. ఇలా పూర్తి  వైరాగ్యంతో, బాబాతో ఒక రోజు చావడిలో మరొక రోజు ద్వారకామాయిలో నిద్రించడం జరిగింది. 

అనేక సందర్భాలలో మహల్సాపతి బాబాతో కలిసి మసీదులో ఏకాంతంగా అనేక రాత్రులు గడిపాడు.  అర్ధరాత్రి వరకూ వారిద్దరూ సంభాషించుకొనేవారు.  మశీదులో ఆ యిద్దరే వున్నప్పుడు బాబా, మహల్సాపతి కాళ్ళు పిసికి, అతడు వారిస్తే, “ఫర్వాలేదులే, మనిద్దరమొక్కటే! అందరూ నన్ను గొప్పవాడనుకుంటారు గాని, అది నిజంగాదు. నేనూ నీలాంటివాడినే!” అనేవారు.

బాబాకు మహల్సాపతికి మధ్యనున్న సంబంధం చాలా వింతగాను ఆసక్తికరంగాను ఉండేది.  ఈ కారణం చేతనే వారిద్దరి మధ్య అద్భుతమయిన చర్చలు ఏకాంతంగా జరిగేవని తెలుస్తుంది.  చిలుం పీలుస్తూ అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ సాగే వారి చర్చలు చాలా ఆసక్తిదాయకంగా జరుగుతూ ఉండేవి.

మహల్సాపతి తన సమయమంతా బాబా సేవలోనే గడిపేవాడు. మహల్సాపతి తన దగ్గర ఉన్న ఒక దుప్పటిని  పరిచేవాడు. ఒక ప్రక్క మహల్సాపతి ఇంకో పక్క బాబా నిద్రించేవారు. మహల్సాపతికి చాలా కష్టమైన భాద్యత అప్పగించడం జరిగింది.   బాబా  “నువ్వు కూర్చుని నిద్రపోకుండా, నా గుండెపై చేతిని ఉంచవలెను, నేను భగవంతుని నామస్మరణలో ఉంటాను, అది నీకు నా గుండె చప్పుడు ద్వారా తెలుస్తుంది. మామూలు నిద్ర కనుక వస్తే, నా గుండె చప్పుడు మారుతుంది. అప్పుడు నన్ను లేపే బాధ్యత నీది” అని చెప్పారు.  కానీ నామస్మరణ ఎప్పుడూ ఆగనేలేదు.

ఈ విధంగా బాబా మరియు మహల్సాపతి ఇద్దరూ నిద్రించేవారు కాదు.  బాబా భక్తులను రక్షించే ప్రక్రియలో యోగనిద్రలో ఉండేవారు.  వారు లోక కళ్యాణం కోసం రాత్రంతా భగవధ్యానంలో ఉండటం జరిగేది. బాబా హృదయంలో నిరంతరం జరిగే నామస్మరణను గమనిస్తూ గడిపే అవకాశము అదృష్టము ఒక్క మహల్సాపతికే దక్కాయి.  

రేపు తరువాయి బాగం…..

ఓం శ్రీ సాయి రామ్ !

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “భక్త మహల్సాపతి 3వ బాగం..

సాయినాథుని ప్రణతి

So nice sai. నేను అపట్లొ గురువుగారివి శ్రీసాయి భక్త విజయం లో మహల్సపతి ,తాత్యాకోతే పాటిల్,ఇంక కోంత మందివి చదివాను చాలా ఆనందించాను మలి ఇపుడు మిరు మాకు మహల్సపతి గురించి చదివి ఆనందించే అవ్వకాశం ఇచారు.బాబా సజివంగా వునపుడు వారితో కలి వున వారి గురించి చదువుతుంటె మనస్సుకు ఆనందం కలుగుతుంది. మనం బాబా వునపుడు వారితో లేకపోయిన ఈ అనుభవాలు చదువుతుంటే బాబాతో మనం కూడ వుండి వుంటే ఎంత ఆనందించె వాలమో అలాంటి అనుభుతి కలుగుతుంది.మహల్సపతి గురించి చదివి మనస్సుకు ఆనందంగా వుంది .సాయిలీలాస్ బృందంవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

Sai Suresh

thank you sai

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles