Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
సుందరీబాయికి చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించింది. భర్త చనిపోయాడు. భర్తపోయిన స్త్రీని ఎంత చులకనగా చూస్తారో అందరికీ తెలిసిందే! తనని అంతా చులకనగా చూస్తుంటే తట్టుకోలేకపోయింది సుందరీబాయి.
ఏళ్ళకేళ్ళు ఏడుస్తూ కూర్చుంది.ఇక్కడీ అహ్మద్‌నగర్‌లో ఉంటే ఇంతే! ఏడుస్తూ బాధపడుతూ ఉండాల్సిందే! స్థల మార్పిడి జరగాలి. స్థలం మారితే స్వాంతన లభిస్తుందనుకుంది.
పండరీపురానికి ప్రయాణమయింది సుందరీబాయి. పాండురంగ విఠలుణ్ణి చూసిందక్కడ. పరవశించిపోయింది. ఆ క్షణం నుంచి ఆమె నోట ఒకటే మాట!రాధాకృష్ణ!విఠలుణ్ణి ‘రాధాకృష్ణ’ పేరిట పలవరించసాగిందామె. జపించసాగింది.
మేల్కొన్న దగ్గర్నుంచీ పడుకునే వరకూ అదే నామజపం. రాధాకృష్ణను జపిస్తూ రోజులు గడిపేస్తున్న ఆమెకు నానా చందోర్కర్ పరిచయ భాగ్యం కలిగింది. అతని నోట ‘బాబా’ మాట విన్నదామె. అలాగే అతను చెప్పగా బాబా మహిమలను తెలుసుకుంది.
‘‘నీ రాధాకృష్ణుడు షిరిడీలో ఉన్నాడు. కావాలంటే వెళ్ళి చూడు.’’ చెప్పాడు చందోర్కర్. చూస్తానంటూ బయల్దేరిందామె.
బాబాలో తను రాధాకృష్ణుణ్ణి చూడాలి. బాబాయే రాధాకృష్ణుడని తెలియాలి. తెలిస్తే ఇక అక్కడే ఉండిపోతుంది తను. వెను తిరిగి రాను అనుకుంది సుందరీబాయి.షిరిడీలో అడుగుపెట్టింది. ఒళ్ళంతా పరవసించిపోయింది.
ద్వారకామాయికి చేరుకుందామె. లోపలికి ప్రవేశించిందో లేదో.‘‘రాధాకృష్ణమాయి’’ అంటూ ఆప్యాయంగా పలకరించారు బాబా. తన పేరు సుందరీబాయి. రాధాకృష్ణమాయి కాదు, ఆ పేరుతో బాబా పిలుస్తున్నారేమిటి? అనుకుందామె.
ఆమె ఆంతర్యాన్ని గ్రహించినట్టుగా ఇలా అన్నారు బాబా.‘‘అహర్నిశలూ రాధాకృష్ణ నామ జపం చేస్తున్నావుగా, అందుకనే అలా పిలిచాను. ఇక నుంచి నీ పేరు రాధాకృష్ణమాయే!’’ నవ్వారు బాబా.పరిశీలనగా బాబాని చూడసాగిందామె‘‘
ఏంటలా చూస్తావు? నీ రాధాకృష్ణుణ్ణి నేనే! నేనే నిన్నిక్కడకి రమ్మన్నాను. సేవించుకుంటావో, సాధిస్తావో అంతా నీ ఇష్టం.’’ అన్నారు బాబా.
రాధాకృష్ణమాయికి అంతా అయోమయం అనిపించింది. ఏం మాట్లాడాలో కాస్సేపు తోచలేదు. తర్వాత తేరుకుందామె.
అడిగిందిలా.‘‘బాబా! నేనొకటి అడుగుతాను. మీరు నిజం చెప్పాలి.’’‘‘అడుగు’’‘‘మిమ్మల్ని నేను చూడడం, నన్ను మీరు చూడడం ఇదే మొదటిసారి, అవునా?’’‘‘అవునంటే?’’‘‘అవునంటే నేను రాధాకృష్ణ జపం చేస్తానని మీకెలా తెలుసు?’’ అడిగింది.
‘‘ఎలా తెలుసంటే…నువ్వనుకున్నట్టుగా నేను నిన్ను చూడడం మొదటిసారి కాదు. నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను అహర్నిశలూ స్మరించడం కూడా నాకు బాగా తెలుసు. క్షణక్షణం నీ పిలుపు, నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది.’’ అన్నారు బాబా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- గురుభక్తి…..సాయి@366 ఏప్రిల్ 17….Audio
- స్వామి శరణానంద్ నుండి దక్షిణ స్వీకరించి అతనికి ‘సన్యాసం’, ‘సద్గతి’ ప్రసాదించారు బాబా
- ” ఏమ్మా! ఏమైంది, ఇంకా ఎన్నాళ్ళు పడతావమ్మా ఈ కష్ఠాలు, నీ కష్ఠాలు చూడలేకపోతున్నాను. బాబా నీ నమ్ముకోమ్మా నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నీ బాధలన్నీ తీరిపోతాయి. ”
- బిక్కుబాయి
- ” బాబా ఈ పిల్ల చాలా బలహీనంగా ఉంది కానుపు ఎలా చేస్తావో నీ ఇష్టం, ఇంక దీని భాద్యత నీదే”–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments