బిక్కుబాయి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

మరాఠీ కమ్యూనిటీకి చెందిన సాయి మహాభక్త బిక్కుబాయి షిర్డీలో నివశించేది. డిసెంబరు 2, 1936న శ్రీ సాయిబాబాతో ఆమె తన అనుభవాల గురించి తన సొంత మాటలలో శ్రీ శ్రీ.బి.వి.నారసింహస్వామికి కింది విధంగా వివరించారు:

నా పుట్టినిల్లు అహ్మద్ నగర్ లో ఉండేది. రాధాకృష్ణ మాయి నా స్నేహేతురాలు. ఆమె వద్ద సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆమె ద్వారానే నాకు సాయిబాబా గురించి తెలిసింది. ఆమె ఆరతి మరియు ఇతర ఆచారాలతో సాయిబాబాని భక్తిపూర్వకంగా పూజిస్తుండేది. ఆమెకు బాబా వద్దకు వెళ్ళాలని ఎంతో కోరిక ఉండేది. రాధాకృష్ణ మాయి యొక్క తాతగారైన బాబా సాహెబ్ గణేష్ గారు అహ్మద్ నగర్ లో ఒక న్యాయవాది. ఆమె షిర్డీలో తనతోనే ఉండిపోయింది.

నాకు సంగమనేరుకి చెందిన ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. కొంతకాలానికి అతను చిన్న వయస్సులోనే మరణించాడు. తరువాత నేను నా 14 ఏళ్ళ వయసులో షిర్డీలో ఉంటున్న నా స్నేహితురాలైన రాధాకృష్ణ మాయి వద్దకు వచ్చాను. ఆమె షిర్డీలో 1908 సంవత్సరం నుండి సాయిబాబాకు సేవ చేస్తున్నది.

షిర్డీలోని దీక్షిత్ వాడా దగ్గర ఉన్న చింతచెట్టు వద్ద వంజర్ గావ్ కి చెందిన గంగగిరి బాబా భారీ నామ-సప్తహమ్ చేశారు. ప్రతిరోజు భారీ సంఖ్యలో యాత్రిక బృందాలు ఆ సప్తహానికి హాజరు అయ్యేవారు. అందులో సంగమనేరు చెందినా భక్త బృందం కూడా ఉండేది. అలా వెళ్ళిన వారు సంగమనేరుకు తిరిగి వచ్చినప్పుడు నా స్నేహితురాలు రాధాకృష్ణ మాయి నాకు ఒక సాయిబాబా ఛాయాచిత్రం, బర్ఫీ ప్రసాదం పంపి, నన్ను కూడా షిర్డీ వచ్చి ఉండమని వారి ద్వారా నాకు ఆహ్వానం పంపించింది. నేను రాధాకృష్ణ మాయి యొక్క ఆహ్వానాన్ని మన్నించి, ఆమె కోరికపై నా ఆభరణాలను, ఆస్తిని వదిలేసి ఒట్టి చేతులతో షిర్డీకి వచ్చాను.

అప్పుడు నేను సాయిబాబా దర్శనం కోసం వెళ్ళాను. బాబా నన్ను రాధాకృష్ణ మాయితో కలిసి ఉంటూ, భక్తులకు సేవ చేసుకొంటూ ఉండమని చెప్పారు. యుద్ధంలో మరణించిన వ్యక్తీ యొక్క భార్యని అయినందున నాకు నెలకు 6 రూపాయల చొప్పున పించను వస్తూ ఉండేది.

1916 చివరిలో రాధకృష్ణ మాయ మరణించిన 1 లేదా 2 నెలల తర్వాత నేను నా పించను తీసుకొనే నిమిత్తం నగర్ కి వెళ్ళాను. నగర్ నుండి తిరిగి వస్తూ కోపరగావ్ వద్ద గోదావరి నది తీరానికి వచ్చాను. అక్కడే రాధాకృష్ణ మాయిని దహనం చేసిన విషయం గుర్తుకు వచ్చి నా మనస్సు వికలమైంది. సాయి నా స్నేహితురాలైన రాధాకృష్ణ మాయిని కాపాడలేదని సాయిని నిందించి, శోకించాను.

అక్కడి నుండి వస్తూ బాబా కోసం ఒక పూల దండగను తీసుకోని షిర్డీ చేరుకున్నాను. బాబాకు మాల వేయడానికి అయన దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, బాబా “అశాంత చిత్తంతో తెచ్చిన పూల మాల నాకక్కరలేదు!” (తహ హర్ మాలా నాకో) అంటూ పూల మాలను తిరష్కరించారు. అప్పుడు హరి సీతారామ్ దీక్షిత్ ‘ఆమె అహ్మద్ నగర్ నుండి ఎంతో గొప్ప కష్టంతో ఆ మాలని తీసుకోని వచ్చింది స్వీకరించండి బాబా’ అని ప్రార్ధించారు.

అప్పుడు నేను బాబా వద్దకు వెళ్లి ఆయన మెడలో మాల వేయడానికి నా రెండు చేతుల పైకి లేపాను. అప్పుడు చిత్రంగా మాల మూడు ముక్కలై, ఒక్కొక్క చేతిలో ఒక్కో ముక్క, ఉండిపోయి, మరొక ముక్క క్రింద నేలపై పడిపోయింది. ఆ నష్టం ఎలా జరిగిందో నాకు అస్సలు అర్థం కాలేదు. బాబా మాత్రం “ఇదంతా నాకు అక్కరలేదు” అని అన్నారు.

నేను ఆ పూలదండతోపాటు పుచ్చకాయ, కొన్ని పేడాలు తీసుకువచ్చాను. నేను పుచ్చకాయ కోసి ఆ ముక్కలను మరియు పేడాలను బాబా ముందు ఉంచాను. బాబా వాటిని తీసుకొని ఆ సమయంలో ద్వారకమాయిలో ఉన్న భక్తులకు పంపిణీ చేశారు. అప్పుడు నేను ఒక పుచ్చకాయ ముక్కను తీసుకొని తొక్కను తీసివేసి బాబాకు ఇచ్చి తినమని ప్రార్ధించాను. దీక్షిత్ కూడా తినమని ఆయనను అభ్యర్థించారు.

బాబా అప్పుడు “ఈమె గోదావరి వద్ద శోకంతో కన్నీరు కార్చింది. ఆమె అలాంటి హృదయవేదనతో వీటిని తెచ్చింది. అలా తెచ్చ్సినవి నేను స్వీకరించాను” అని అన్నారు.

నిజంగానే గోదావరి వద్ద నేను మానసికంగా బాధపడుతూ రాధాకృష్ణ మాయిని కాపాడలేదని, మరియు తమ భక్తురాలైన ఆమెను అంతటి హేయమైన చావు నుండి రక్షించాలేదని బాబాను నిందించాను. నా గుండెలోతులలో ఉన్న భావనలు బాబాకు తెలుసు, అందుకే నా సమర్పణలను అంగీకరించటానికి ఆయన నిరాకరించారు.

బాబా ప్రతిరోజూ మధ్యాహ్న భోజన వేళ నాకు ఒక పాత్ర నిండా ఆహారాన్ని ఇచ్చేవారు. నేను ఆ ఆహరాన్ని ఇంటికి తీసుకువెళ్ళేదాన్ని. బాబా యొక్క మహా సమాధి రోజున, నేను బాబా నన్ను విడిచిపెట్టిపోయారని నేనిక ఒంటరిదాన్ని అయ్యానని రాత్రి 10:00 గంటల వరకు విలపించాను. “బాబా, నేను నిన్ను ఇక చూడలేను” అని ఎంతగానో ఏడుస్తూ నేను ఇంటి లోపలి నుండి బయటకి వచ్చాను. 

ద్వారం వద్ద ఒక పామును చూశాను. బాబా ఆ రూపంలో వచ్చారని నేను భావించి, “ఈ సర్ప శరీరంలో నేను నిన్ను గుర్తించలేను, నీ సాయిబాబా రూపాన్ని మాత్రమే నాకు తెలుసు” అని అన్నాను. ఇది విని వెంటనే పాము కనిపించకుండా అదృశ్యమైపోయింది.

(Source: Devotees’ Experiences of Sri Sai Baba Part I, II and III by Sri.B.V.Narasimha Swamiji)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles