శ్రీసాయి లీలా తరంగిణి – 17వ. భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

శ్రీసాయి లీలా తరంగిణి 

రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన :  తెలుగు.  తరువాత  ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)  అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు గారు.

నమ్మశక్యం గాని సాయి లీల

1986వ. సంవత్సరంలో మేము షిరిడీ వెళ్ళాము. మేము సాధారణంగా ఒక చిన్న శాండల్ ఉడ్ పెట్టెలో, దాన ధర్మాలకి, ఇంకా కొన్ని చిల్లర ఖర్చులకోసం వినియోగించడానికి అందులో కొంత డబ్బు విడిగా వేసి ఉంచుతూ ఉంటాము.

ఆపెట్టెను మాకూడా షిరిడీకి తీసుకుని వెళ్ళాము.  మేము షిరిడీలో నాలుగు రోజులున్నాము.  అయిదవ రోజున మా తిరుగు ప్రయాణం.  శాండల్ ఉడ్ పెట్టెలో మిగిలిన మొత్తాన్ని సమాధి మందిరంలో ఉన్న హుండీలో వేద్దామనుకున్నాము. కాని ఆపెట్టెను తీసుకునివెళ్ళడం మర్చిపోయాము. సమాధి మందిరానికి వెళ్ళిన తరువాత గుర్తుకు వచ్చింది పెట్టె తీసుకునిరాలేదని.

అంత చిన్న మొత్తం కోసం మళ్ళీ వెనక్కి రూముకు వెళ్ళి ఆపెట్టెని తీసుకురావడానికి బద్ధకించాము. ఆ పెట్టెలో మహా ఉంటే ఇరవై రూపాయలు ఉండవచ్చు దానికి రెట్టింపు అనగా నలభై రూపాయలు షిరిడీ సంస్థానంవారు జరిపే అన్నదాన కార్యక్రమం వినియోగం కోసం హుండీలో వేసేద్దామని నిర్ణయించుకున్నారు నాభర్త.

హైదరాబాదుకి తిరిగి వచ్చిన తరువాత ఆ శాండల్ ఉడ్ పెట్టిని మా పూజాగదిలో ఉంచాము. కొద్ది రోజుల తరువాత బాబా నాభర్తకి కలలో దర్శనమిచ్చి ఇలా అన్నారు “ఈరోజు గురువారం. నువ్వు ఆలస్యం చేస్తే ఈ రోజు నువ్వు అభిషేకం చేయలేవు”  బాబా మావారికి ఆవిధంగా చెప్పడంతో నాకు కాస్త భయం వేసింది. వెంటనే నేను మా అక్కచెల్లెళ్ళకి, ఇంకా సాయి భక్తులు శ్రీడి.శంకరయ్యగారికి, శ్రీ యూసఫ్ ఆలీ ఖాన్ గారికి అందరికీ మావారికి వచ్చిన కల గురించి ఫోన్ చేసి చెప్పాను.

నా భర్త హాలులో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నారు. పది నిమిషాల తరువాత శ్రీయూసఫ్ ఆలీ ఖాన్ గారు హాలులోకి వచ్చి చూసేటప్పటికి నాభర్త స్పృహలేకుండా ఉన్నారు.  యూసఫ్ గారు నా భర్తకన్నా శరీరాకృతిలో చాలా సన్నగా, చిన్నగా ఉంటారు.  అటువంటిది ఆయన నాభర్తను తన రెండు చేతులతో ఎత్తుకుని తన భుజాలమీద పెట్టుకున్నారు.

మా చెల్లెలు ఆయనని మంచంమీద పడుకోబెట్టండి అని ఎన్నిమార్లు చెప్పినా వినిపించుకోకుండా మా పూజా గదిలో నేల మీద పడుకోబెట్టారు.  యూసఫ్ గారు ఉద్రేకంతో వణుకుతూ నాభర్త ప్రక్కనే కూర్చున్నారు.  ఆయన బిగ్గరగా ఖురాన్ లోని పవిత్రమయిన శ్లోకాలని చదవసాగారు.

అంతకుముందు జరిగిన సంఘటనలు గుర్తుండటం వల్ల డాక్టర్స్ ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించమని చెప్పారు. వెంటనే మేము మాకు దగ్గరలోనే ఉన్న శ్రీరామ్ నగర్ కాలనీలోని నర్సింగ్ హోమ్ లో చేర్పించాము.  నర్సింగ్ హోమ్ కి మాబంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు.

ఆరోజు రాత్రి నర్శింగ్ హోమ్ లో నాభర్త నిద్రపోతూ ఉన్నారు.  బెంగుళూరు ఆల్ ఇండియా సాయి స్పిరిట్యువల్ సెంటర్ వ్యవస్థాపకులయిన శ్రీరాధాకృష్ణ స్వామీజీ నాభర్తకి కలలో కనిపించి “నువ్వు నన్ను గుర్తించావా” అని ప్రశ్నించారు.

అపుడు నాభర్త, “ఇంతకుముందు మిమ్మల్ని కలుసుకోలేదు. కాని మీఫొటో చూశాను. మీరు శ్రీరాధాకృష్ణ స్వామీజీ గారనే అని నా నమ్మకం” అన్నారు.

శ్రీస్వామీజీ గారు అవునన్నట్లుగా తల ఊపి, మరలా ఇలా అడిగారు. “షిరిడీలో బీదల అన్నదానానికి ఇద్దామని అట్టే పెట్టిన డబ్బును దానికోసం ఇవ్వకుండా తిరిగి ఇంటికి తీసుకుని వచ్చావెందుకు”

అపుడు నాభర్త, “షిరిడీలో డబ్బు ఉన్న శాండల్ ఉడ్ పెట్టెను తీసుకునివెళ్ళడం మర్చిపోయాను. అందుకనే దానికన్నా రెట్టింపు సొమ్ము ఇచ్చాను” అని సమాధానమిచ్చారు.

స్వామీజీ “అసలు పెట్టెలో డబ్బు ఎంత ఉందో లెక్కించకుండానే ఉన్నదానికన్నా రెట్టింపు డబ్బు ఇచ్చానని ఎలా అనుకుంటున్నావు?  నువ్వు బాబా సొమ్ము తీసుకుంటే దానికన్న పదిరెట్లు నువ్వు  ఆయనకి చెల్లింవలసి వచ్చేలాగ  చేస్తారు ఆయన” అన్నారు.

జరిగిన దానికి నాభర్త పశ్చాత్తాపపడుతుండగానే కల కరిగిపోయి మెలకువ వచ్చింది. మరునాడు నర్శింగ్ హోమ్ లో శ్రీసాయిబాబా నాభర్తకు దర్శనమిచ్చి, “ఇక నీకు కొన్ని జన్మలు మాత్రమే ఉన్నాయి” అని చెప్పారు.

మూడవ రోజున నర్శింగ్ హోమ్ నుంచి డిస్చార్జి అయ్యారు.  మా చెల్లెలు శ్రీమతి కుసుమ, నేను ఇద్దరం కలిసి శాండల్ ఉడ్ పెట్టెలో ఉన్న డబ్బు లెక్కిస్తే రూ.26-65 పైసలు ఉన్నాయి.  కాని సాయంత్రం శ్రీయూసఫ్ ఆలీఖాన్ గారు లెక్కిస్తే రూ.31-65 పైసలు ఉన్నాయి.

అయిదురూపాయలు తేడా ఎందుకు వచ్చిందో అర్ధం కాక ఆయన మళ్ళీ లెక్కపెట్టారు. ఈసారి లెక్క చూస్తే రూ.32-65 పైసలున్నాయి. శ్రీసాయిబాబావారి అనంతమయిన సంపదను ఎవరు లెక్కించగలరు అని. ఇదంతా బాబా చూపించిన అధ్భుతమయిన చమత్కారమని అప్పుడు మాకనిపించింది.

యూసఫ్ ఆలీ ఖాన్ గారు చాలా సన్నగా ఉంటారు.  పైగా బరువయిన పనులకు కూడా అలవాటుపడ్డ శరీరం కాదు ఆయనది.  అటువంటి ఆయన తన రెండు చేతులతో నాభర్తని ఎత్తుకుని వెళ్లడం మాకందరికీ చాలా ఆశ్చర్యం కలిగించిన సంఘటన.

ఆవిధంగా నాభర్తని తన రెండు చేతులతో ఎత్తుకున్నది బాబాయే అని నాకర్ధమయింది.  ప్రతి చిన్నచిన్న విషయాలకి కూడా బాబాని సహాయం కోరడం నాకు బాధనిపించింది.

(రేపటి సంచికలో ధ్యానంలో బాబా సందేశాలు)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles