శ్రీసాయి లీలా తరంగిణి – 15వ. భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

శ్రీసాయి లీలా తరంగిణి 

రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన :  తెలుగు.  తరువాత  ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)  అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు గారు.

బాబా ఇచ్చిన ఆదేశం – ఆంతర్యం

1985వ. సంవత్సరం శ్రీరామనవమినాడు తెల్లవారుఝామున నా భర్త శ్రీ భారం ఉమామహేశ్వరరావు గారికి కలలో సాయిబాబా దర్శనమిచ్చారు.  ఆ కలలో బాబా నా భర్తని హైదరాబాద్ లో ఉన్న ఇంట్ర్నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగంలో చేరమని ఆదేశించారు. ఉదయం లేవగానే తనకు అటువంటి కల ఎందుకని వచ్చిందో ఆశ్చర్యపోయారు.

అప్పటికే పదవీ విరమణ చేసి ఉన్నాను కదా, మరలా బాబా నన్ను మళ్ళీ ఉద్యోగంలో చేరమనటానికి కారణం ఆర్ధికంగా సహాయం చేద్దామనా?  లేక మరేదయినా కారణం ఉందా అని ఆలోచించారు నా భర్త.  సరే బాబా చెప్పిన ఆ సర్వీసెస్ ఏజెన్సీ ఎక్కడ ఉందో తెలుసుకుందామని గ్లోబ్ డిటెక్టివ్ ఏజెన్సీకి వెళ్ళారు. అక్కడివాళ్ళని ఇంటర్నేషనల్ సెక్యురిటీ సర్వీసెస్ ఎక్కడ ఉందో వివరాలన్నీ అడిగారు.  వాళ్ళు, ఆ సంస్థ సికిందరాబాద్ లో మినర్వా టాకీస్ ప్రాంతంలో ఉందని చెప్పారు.

నా భర్త, బాబా కలలో సూచించిన ఏజెన్సీకి వెళ్ళారు.  అక్కడ తనను తాను రిటైర్డ్ ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పరిచయం చేసుకున్నారు.  వారు నాభర్తకి ఇండస్త్ట్రియల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉద్యోగం ఇస్తామని చెప్పారు.  కాని వారు ఇస్తామన్న జీతం నాభర్తకి తృప్తికరంగా లేకపోవడం వల్ల తరువాత ఏవిషయం ఆలోచించి చెబుతానని చెప్పి వచ్చేశారు.

మాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం.  అందరికీ వివాహాలయిపోయాయి.  ఇంక మాకు బాధ్యతలేమీ లేవు.  పిల్లలంతా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ జీవితంలో బాగా స్థిరపడ్డారు.  మేమిద్దరం ఇంట్లో సాయిపూజ చేసుకుంటూ కాలం గడుపుతున్నాము.  ఈ వయసులో మళ్ళీ ఉద్యోగంలో చేరి అనవసరంగా శ్రమపడవద్దని నాభర్తకు సలహా ఇచ్చాను. మేము సాయినాధుని ప్రార్ధించుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఇంకా సాయికి సంబంధించిన సేవలన్నిటిలోను సమయం గడిపేస్తున్నాము.

నా భర్తకి కూడా మరలా ఉద్యోగంలో చేరడం ఇష్టం లేదు.  అందుకనే మళ్ళి సెక్యూరిటీ సంస్థవారి దగ్గరకు వెళ్ళలేదు.  సాయిబాబా ఆజ్ఞాపించినా కూడా మళ్ళీ ఉద్యోగంలో చేరనందుకు బాబా ఆజ్ఞని ధిక్కరించానా అని నా భర్త చాలా బాధపడ్డారు.

ఆతరువాత మా అదృష్టం కొద్దీ రామచంద్రపురంలో ఉన్న మాతాజీ కృష్ణప్రియగారిని దర్శించుకున్నాము. ఆవిడది గొప్ప వ్యక్తిత్వం. ఆవిడలో నిరాడంబరత, చిత్తశుధ్ధి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

నాభర్త ఆవిడకి బాబావారు తనకు కలలో ఇచ్చిన ఆదేశాన్ని గురించి వివరించారు. బాబా చెప్పినట్లుగా తాను మరలా ఉద్యోగంలో చేరకపోవడం ఆయన ఆజ్ఞను ఉల్లంఘించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. ఆయన అడిగిన ప్రశ్నకి మాతాజీ నవ్వి రెండు వేళ్ళు చూపించారు.

నువ్వు ధనసంపాదన వైపు మొగ్గు చూపుతావో, లేక ఆధ్యాత్మిక ధన సంపాదనవైపు మొగ్గు చూపుతావో బాబా గారు నీకు పరీక్ష పెట్టారని మాతాజీ వివరించారు. నాభర్త ధన సంపాదన యందు దృష్టి పెట్టకుండా ఆధ్యాత్మిక సంపాదననే కోరుకున్నారు. అందువల్ల తన నిర్ణయం సరైనదేననీ, బాబా అజ్ఞను జవదాటలేదని ఎంతో సంతోషించారు.  బాబా ఇచ్చిన ఆదేశాన్ని పాటించలేకపోయానే అనే బాధనుంచి విముక్తి కలిగింది.

నాభర్త ఆధ్యాత్మిక శ్రేయస్సునే కోరుకుంటున్నారని బాబా నా భర్తను పరీక్షించిన తరువాత, ‘సాయిప్రభ’ మాసపత్రికను ప్రారంభించమని బాబా నాభర్తను ఆదేశించారు.  శ్రీసాయిబాబా సూచనల ప్రకారం, బాబా అనుగ్రహంతో నాభర్త ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించారు.  సాయి భక్తులందరి ప్రోత్సాహంతో ఆమాసపత్రిక ఎంతో ఆదరణ పొందింది.  ఇదంతా శ్రీసాయిబాబా ఆశీర్వాదం వల్లనే సాధ్యమయింది.

ఇంగ్లీష్ లో మాతాజి కృష్ణప్రియగారి గురించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకు లో చదవండి.

https://sites.google.com/site/mathajikrishnapriya/home/biography

(రేపటి సంచికలో బాబా చేసిన వైద్యం)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles