Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన : తెలుగు. తరువాత ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా) అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు గారు.
‘సాయి ప్రేమ’ మరియు ‘సాయిప్రభ’ మాస పత్రికలకు సంబందించిన అనుభవాలు
సాయి ప్రేమ
‘సాయి ప్రేమ’ ఆధ్యాత్మిక మాస పత్రికకి శ్రీ టి.ఎ. రామ్ నాధన్ గారు ఎడిటర్. ఈ పత్రిక ద్వారా ఆయన సాయి తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ పత్రిక కలకత్తా నుండి ప్రచురింపబడుతోంది.
1987వ. సంవత్సరంలో మాకు ఒక నెల ఈ పత్రిక అందలేదు. నెలాఖరు కూడా వచ్చింది. పుస్తకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాము. మాకింకా పత్రిక అందలేదని నా భర్త రామనాధన్ గారికి ఉత్తరం రాద్దామనుకున్నారు.
మరుసటి రోజే మాకు రామనాధన్ గారి నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో మాకు మరొక పత్రిక అదనంగా పంపుతున్నట్లుగా రాసారు.
ఉమా మహేశ్వరరావు గారికి పత్రిక అందలేదుట. వారికి వెంటనే పంపించు అని బాబా ఆజ్ఞాపించారని కూడా ఆ ఉత్తరంలో వ్రాసారు. ఆ ఉత్తరం చదవగానే మా ఆనందానికి అంతులేదు. సాయిబాబాకి కోటికోటి ప్రణామాలు అర్పించుకున్నాము. మరునాడే మాకు పోస్టులో పత్రిక వచ్చింది.
బాబా మనలని ప్రతి విషయంలోను అది స్వల్పమైన విషయాలయినా సరే అనుక్షణం కనిపెట్టుకుని ఉంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
బాబా తన భక్తులఎడల అనంతమయిన ప్రేమను కనబరుస్తూ ఉంటారు.
సాయిప్రభ మాస పత్రిక – బాబా ఆదేశం
1985వ. సంవత్సరంలో నా భర్తకు బాబా కలలో దర్శనమిచ్చారు. సాయిబాబా బోధనలను, తత్వాన్ని ప్రచారం చేయడానికి ఒక పత్రికను ప్రారంభించమని ఆదేశించారు.
అదేరోజు రాత్రి సాయిబాబా శ్రీ యూసఫ్ ఆలీఖాన్ గారికి కూడా కలలో దర్శనమిచ్చారు. మాసపత్రికను ప్రారంభించడానికి ఉమా మహేశ్వరరావు గారికి కావలసిన సహాయం అందించమని పత్రికకు ‘సాయిప్రభ’ అని నామకరణం చేయమని చెప్పారు. పత్రికను గురుపూర్ణిమ రోజున విడుదల చేయమని చెప్పారు.
నా భర్తకి రచనా వ్యాసంగంలో బొత్తిగా అనుభవం లేదు. పత్రిక నడపడానికి అవసరమయిన డబ్బు సమకూర్చడం కూడా సాధ్యమయే విషయం కాదు.
ఇటువంటి సందేహాలు మనసులో మెదులుతూ ఉండగానే ఈ విషయం గురించి చర్చించడానికి సాయిబంధువులందరిని సమావేశపరిచాము. చాలా మంది పత్రిక నడపడమంటే సామాన్యమయిన విషయం కాదు, నిర్వహించడం చాలా కష్టమని చెప్పారు.
మొదట్లో నాభర్త కాస్త నిరుత్సాహం చెందినా పత్రిక ప్రారంభించమని బాబాయే ఆదేశించారు కాబట్టి పని మొదలుపెట్టడానికే నిర్ణయించుకున్నారు. అన్ని విషయాలలోను బాబాయే ముందుకు నడిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు. శ్రీయూసఫ్ ఆలీఖాన్ గారి సహాయంతో ‘సాయి ప్రభ’ మాసపత్రికను ప్రారంభించడానికి ఉద్యుక్తులయ్యారు.
గురుపూర్ణిమ రోజున ‘సాయిప్రభ’ మొదటి సంచిక విడుదలయింది. శ్రీ జి.విఆర్.నాయుడు సాయి సమాజ్ మందిర్, సికిందరాబాదులో డా.దివాకర్ల వెంకటావధానిగారు మొదటి సంచికను ఆవిష్కరించారు. 1985 వ.సంవత్సరం విజయదశమి రోజున ‘సాయిప్రభ’ ప్రత్యేక సంచిక విడుదలయింది. బాబా దయ వల్ల పత్రికకు మంచి ఆదరణ లభించింది.
ఏమయినప్పటికి పత్రికను నిర్వహించడం నాభర్తకు చాలా భారమయింది. అందువల్లనే బాబా శ్రీ వి.నారాయణరావు గారిని నా భర్తకు సహాయం చేయడానికి పంపించారని భావించాను. అప్పటి వరకు ఇద్దరికి ఒకరికొకరు పరిచయం లేదు. పత్రిక నడపడానికి ఆయన సహాయం చేశారు. నా భర్త ఎడిషనల్ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవీ విరమణ చేసారు. శ్రీ నారాయణరావు గారు పే అండ్ ఎక్కౌంట్స్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్.
ఇద్దరికీ పత్రికా నిర్వహణలో ఎటువంటి అనుభవం లేదు. కాని, బాబా దయవల్ల పత్రిక ప్రచురణ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతోంది. పత్రికను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలను రచిస్తూ తన శేషజీవితం సాయి సేవలో గడిచిపోతున్నందుకు తనెంతో అదృష్టవంతుడినని భావించారు నాభర్త.
(రేపటి సంచికలో ‘సాయిప్రభ’ మాస పత్రిక పాత సంచికలోని ఒక అనుభవం)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- శ్రీసాయి లీలా తరంగిణి – 8 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 1 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 2 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 5 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 6 వ. భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments