Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన : తెలుగు. తరువాత ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా) అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు గారు.
‘సాయిప్రభ’ మాస పత్రిక పాత సంచికలోని ఒక అనుభవం
‘సాయిప్రభ’ మాసపత్రిక పాత సంచికలోని విషయాలను సాయి భక్తులకి కూడా తెలియచేయాలనిపించింది. అది బాబా ప్రేరణ గానే భావిస్తున్నాను. ఈ సందర్భంగా ‘సాయిప్రభ’ 1987 నవంబరు సంచికలో ప్రచురింపబడ్డ బాబా లీలను యధాతధంగా ఇస్తున్నాను. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
ప్రాణదాత
రామానంద్
క్వార్టర్, 82, గంగాలేన్
స్వర్గాశ్రమ్, ఋషీకేశ్
తెలుగు సేత – వి. నా. రావు
ఈ సంఘటన 1984 నవంబరులోనో, డిసెంబరులోనో జరిగింది. ఒకనాటి రాత్రి భోజనం తర్వాత నా కడుపులో యేదో వికారం మొదలైంది. విపరీతమైన తలనొప్పి, పైత్యవికారము, కడుపులో త్రిప్పుట చెప్పసాధ్యంగాదు. ఏమి కారణమో తెలియలేదు. రాత్రి బాగా కమ్ముకుంటుంది. నాపరిస్థితి త్వరత్వరగా క్షీణిస్తోంది. పడక మీద నుండి లేవలేకుండా ఉన్నాను. ఏదైనా మందు తీసుకుందామన్నా, ఎవరికైనా తెలుపుదామన్నా లేవలేను.
లేస్తే పడిపోతానేమో అనే భయం. ఒంటరిగా రూములో ఉన్న నా పరిస్థితి ఇది. పడక మీదనే పరుండి నాకు తెలిసిన దేవతలను నన్ను రక్షించమని ప్రార్ధన చేయ మొదలెట్టాను. గాయత్రి, మహామృత్యుంజయ మంత్రము జపించాను. కాని లాభం లేకపోయింది. నేను సాయిబాబా భక్తుడనే గాని, ఆక్షణం వరకు ఆయన జ్ఞాపకమెందుకు రాలేదో తెలియదు.
ఎమైతేనేం బాబా జ్ఞాపకం రాగానే వారికి క్షమార్పణలు తెలుపుకుని నన్నీ మృత్యు ముఖం నుండి కాపాడమని హృదయపూర్వకంగా ప్రార్ధిస్తు దుఃఖించినాను. నా కళ్ళనే నేను నమ్మలేని సంఘటన? బాబా సశరీరంగా నామంచము ప్రక్కనే నుంచున్నారు. అంత బాధలో నేను వెక్కివెక్కి ఏడ్చాను కూడా. అలా బాధ పడుతున్న నాకు, యీ కళ్లతో బాబాను చూచే భాగ్యము కలిగింది.
వారి దివ్య హస్తమును నా తలపై ఉంచి, “నీవు తిన్న ఆహారంలో విషం కలిసి ఉంది. అది నీ రక్తంలో కలిసిపోయింది. నేనాశీర్వదిస్తున్నాను. నీకు బాగౌతుంది” అన్నారు. ఆ క్షణం నుండే నాలో బాధ తగ్గటం గమనించాను. బాబా యింకా ఇలా అన్నారు. “ రేపటినుండి ఒక వారం రోజులు అయిదు బిల్వపత్రాలు తిను. బాగౌతావు” అని బాబా గాలిలో ఎలా కనిపించారో అలాగే అదృశ్యమయ్యారు నాకళ్ళయెదుట.
తలుపులు, కిటికీలు వేసివున్న ఆ రూములో బాబా దర్శనం నిజంగా నాకు, మేఘునికి యిచ్చిన దర్శనాన్ని గుర్తుకు తెచ్చింది. “నాకు ప్రవేశించటానికి ద్వారమే అక్కరలేదు. తలుపులు, గోడలు నాకడ్డుగావు. సాయి!సాయి! అని ఎవరు మనసారా పిలుస్తారో నేను వారి వెంటనే ఉంటాను” అన్న మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తూంటాయి. వారు చెప్పిన ప్రకారం చేసి నేను ఆరోగ్యవంతుడనయ్యాను.
(రేపటి సంచికలో రావుగారికి బాబా కలిగించిన దివ్యానుభూతులు)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- శ్రీసాయి లీలా తరంగిణి – 4 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 6 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 2 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 1 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 7 వ. భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments