శ్రీసాయి లీలా తరంగిణి – 2 వ. భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

శ్రీసాయి లీలా తరంగిణి 

రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన :  తెలుగు.  తరువాత  ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)  అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు గారు.

ముందు మాట – నిన్నటి కొనసాగింపు

బాబా హృదయమంతా తన భక్తులఎడల కరుణతో నిండి ఉంటుంది కాబట్టే తన భక్తులందరినీ ప్రతిక్షణం కాపాడుతూ ఉన్నారు. ఆయన మీద మనకున్న అచంచలమయిన విశ్వాసం వల్లనే మనం జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతున్నాము. ఆయన అడుగు జాడలలో నడవడమే మనందరి జీవితాశయం కావాలి.

త్రికరణశుధ్ధిగా ఆయననే నమ్ముకుని ఆయన సేవ చేస్తూ, సర్వశ్య శరణాగతి వేడుకోవాలి. ఆవిధంగా మనం చేయగలిగితే ఆయన ఎల్లప్పుడు తన దయను మనమీద కురిపిస్తునే ఉంటారు. మన భారమంతా ఆయనే మోస్తారు. ఆవిధంగా మన సమస్యలన్నిటినీ దూరం చేసి, మనలని దుఃఖాలనుండి తప్పించి మనకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఆయన అనుగ్రహం వల్ల మనం ఈప్రాపంచిక కష్టాల నుండి విముక్తులమవుతాము.  మనలని చుట్టపెట్టుకుని ఉన్న ఈ కష్టాలు తొలగిపోగానే, మనలో సాయిబాబాకు మరింతగా చేరువకావాలనే కోరిక ఇంకా ఎక్కువవుతుంది.  ఆవిధంగా ఆయనపై మన భక్తి కూడా ఇనుమడిస్తుంది.

బాబా మన అజ్ఞానపు చీకటిని తొలగించి, ఆధ్యాత్మిక మార్గంలో పయనింప చేస్తారు. మనమంతా సామాన్య మానవులం. మనం మన జీవితాలలో కష్టాలను, వేదనలను సుఖాలను అధిగమించలేము.  మన సమస్యలకు బాబా ప్రతిస్పందిస్తారుమన సమస్యలన్నిటిని దూరం చేసి తన మార్గంలోకి మనలని నడిపిస్తారు.

సముద్రంలోని ముత్యాలవలె ప్రపంచం నలుమూలలో సాయి మహిమలు వ్యక్తమవుతూ ఉన్నాయి.  ఆయన చూపే మహిమలన్నిటిని ఏర్చి కూర్చి ఒక పూలదండలాగ తయారు చేయడమంటే ఎవరికయినా కష్ట సాధ్యమే. మా కుటుంబానికి బాబా వారు ప్రసాదించిన అనుభవాలను, అద్భుతాలతో సహా, నాకు కూడా బాబా వారు ఇచ్చిన అనుభవాలను వివరిస్తాను.

సూర్యుని కిరణాలు ప్రకృతిలోని చీకట్లను పారద్రోలి మనలను మేల్కొలుపుతాయి.  అదే విధంగా సాయిభక్తులు బాబా లీలలు చదివినా, శ్రవణం చేసినా, దాని ఫలితంగా వారి హృదయాలలో సాయిబాబా మీద భక్తివిశ్వాసాలు మరింతగా వృధ్ధి చెందుతాయి. సాయి భక్తులందరిని బాబా లీలలు జాగృతం చేస్తాయి. వారిలో జ్ఞానాన్ని పెంచుతాయి.

నా భర్త శ్రీ భారం ఉమా మహేశ్వరరావు గారికి సాయిబాబా వారు ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలను, బోధనలను, లీలలను ప్రసాదించారు.  వాటినన్నిటిని మేఘాల నుండి కురిసే వర్షపు జల్లులలాగ నలుదిశలా వ్యాప్తిలోకి తీసుకుని రమ్మని బాబా  ఆదేశించారు.

స్వర్ణము కన్న శ్రేష్ఠమయిన ఈ అనుభవాలన్నిటిని ‘సాయిలీలలు’గా మీముందుంచుతున్నాను.  బాబా నుండి మేము ఎటువంటి అనుభూతులను, అనుభవాలను పొందినా అది మా గొప్పతనం కాదు.  అది ఆయనయందు మాకు గల భక్తి.  ఆయన మాపై కురిపిస్తున్న దయ, నిరంతర పర్యవేక్షణ వల్ల మాత్రమే.

ఇందులో ఉదహరించిన పేర్లు, నామ మాత్రమే.  బాబా చేతిలో మనమంతా ఆటబొమ్మలం. బాబాయే మన జీవితం, ఆయనే మన సర్వస్వం.  మన ఆధ్యాత్మిక జీవితానికి ఆయన చుక్కాని, మార్గదర్శి. ఈ సాయిలీల పుస్తకానికి గ్రంధకర్త శ్రీసాయిబాబాయే.  ఈ పుస్తకం సాయిభక్తులందరికీ చేరువలోకి రావడానికి కారణమైన దివ్యశక్తి బాబాయే.

శ్రీసాయిబాబా వారి అనుగ్రహంతో ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలను సేకరించి, ‘సాయి లీలా తరంగిణి, ‘శ్రీసాయి లీలా స్రవంతి’  కావ్య రూపంలో ‘శ్రీసాయి లలితా గీతా విభావరి’ అనే పుస్తకాలని  తెలుగులో ప్రచురింపగలిగాను. సాయి భక్తులందరూ ఈపుస్తకాలను చదివి ఎంతగానో అభినందించారు.  బాబా దయవల్ల ఈ పుస్తకం ఆంగ్లంలో కూడా ప్రచురింపబడింది.

ఈ పుస్తక ప్రచురణకు తమ సహాయ సహకారాలు అందించిన వారందరికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పుస్తకాన్ని ప్రచురించిన శ్రీ ఎమ్.వి.శ్రీనివాస్, పూర్ణకళా ఆఫ్ సెట్ ప్రింటర్స్, నారాయణగూడ, హైదరాబాదు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.  ఈ పుస్తకాన్ని ప్రచురింపచేసిన కుమారి బొండాడ శిరీషకు, తెలుగు అధ్యాయాలను ఆంగ్లంలోకి అనువదించిన శ్రీమతి పింగళ జానకి జ్యోతిగారికి నేనెంతో ఋణపడి ఉన్నాను.

ఈ పుస్తకంలోని బాబా లీలలను చదివిన భక్తులందరు బాబాకు మరింత దగ్గరగా చేరువవుతారని నా ప్రగాఢ విశ్వాసం. శ్రీసాయిబాబా ఆశీర్వాద, అనుగ్రహ బలం వల్ల సేకరించిన బాబా మహిమలు, లీలలు అనే ముత్యాల మణిహారాన్ని బాబామెడలో అలంకరిస్తున్నాను. వినమ్రతతోను, భక్తితోను, శ్రీసాయి చరణ కమలాలకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నాను.

శ్రీసాయిబాబా సేవలో

భారం మణి ఉమామహేశ్వరరావు.

(రేపటినుండి బాబా లీలలు ప్రారంభం)

(రేపటి సంచికలో శ్రీ సాయిబాబా వైద్యులకే వైద్యుడు)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీసాయి లీలా తరంగిణి – 2 వ. భాగం

Maruthi

saibaba…saibaba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles