Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన : తెలుగు. తరువాత ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా) అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు గారు.
శ్రీసాయిబాబా వైద్యులకే వైద్యుడు
శ్రీ సాయిబాబా మానవాళినంతటిని అనుగ్రహించడానికి అవతరించిన దైవాంశ సంభూతుడు. ఐహిక పరమయిన, ఆధ్యాత్మికపరమయిన విషయాలే కాక ఇంకా ఏదో ఒక మిషతో ఆయన తన వైపుకు మనలని ఆకర్షించుకుంటారు.
తన వద్దకు చతుర్విధ భక్తులు వస్తారని చెప్పారు. 1) మానసిక శారీరిక సంతాపములకు గురియైన ఆర్తులు 2) ఐహికపరమయిన కోరికలతో అనగా సుఖసంపదలను కోరుకొనువారు 3)ఐహికపరమయిన విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వ జ్ఞానమును పొందుటకు ఇఛ్చ గలవారు జిజ్ఞాసువులు 4)పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానులు.
బాధలు కలిగినప్పుడు ఎన్నో ఆలోచనలు, సందేహాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనసుకు ఓదార్పు అవసరం. స్వాంతన కోసం మనసు సాయిబాబా చెంతకు చేరుతుంది. బాబా షిరిడీలో ప్రవేశించిన మొదటిరోజులలో షిరిడీలోని వారందరూ ఆయనను ఒక పిచ్చిఫకీరుగా భావించారు.
బాబాయొక్క మంచితనం ఆయనపై నమ్మకాన్ని కలుగచేసింది. బాబా కుష్టువారికి, క్షయ రోగగ్రస్తులకి చేసిన వైద్యం విచిత్రమయినదే కాక సమర్ధవంతమయినది. ఆయన ఎల్లప్పుడు ‘అల్లా మాలిక్’ అని స్మరిస్తూ ఉండేవారు. ఆయనకి త్వరలోనే సాక్షాత్కారమ్ లభించింది. (ఆయన స్వయంగా హెచ్.ఎస్.దీక్షిత్ తో చెప్పిన విషయం).
ఒకసారి బాబా “నేనిక్కడ చెబుతాను. అది అక్కడ జరుగుతుంది” అని అన్నారు. సాయిభక్తులకి ఇది ప్రతిరోజు అనుభవపూర్వకమే. మనం తలుచుకున్న మరుక్షణమే బాబా మనకు సహాయం చేయడానికి వస్తారు. అందుచేతనే మనం బాబాను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాము. బాబాకు సర్వశ్య శరణాగతి చేసినవానికి వివేకం కలిగి అంతటా సాయే కనిపిస్తారు. బ్రహ్మానందంలో మునిగి తేలతారు.
తన వద్దకు వచ్చే వారి కోసం, తనను ప్రార్ధించే వారి కోసం, తనను అనుక్షణం గుర్తుచేసుకుంటూ ఉండేవారి కోసం, సాయి పగలూ రాత్రి నిర్విరామంగా అహర్నిశలూ శ్రమిస్తూ ఉంటారు. మన గురువు దైవం శ్రీసాయిబాబా సర్వభూతముల హితమును కోరుకునేవారని అభివర్ణించవచ్చు.
ఆధ్యాత్మిక సంబంధమయినవే కాకుండా ఐహికపరమయిన విషయాలన్నిటికీ ఆయన సహాయం కొరకు మనమందరం ఆయనను ప్రార్ధిద్దాము. సాయిని మన మదిలో నిలుపుకొని ప్రతినిత్యం ఆయనను స్మరించుకుందాము. మనకు సహాయమందించడానికి మనమెప్పుడు పిలిచినా వెన్వెంటనే వచ్చి తీరుతారు.
ఇప్పటికీ బాబా అధ్భుతాలను, అనుభవాలను తన భక్తులకు కలిగిస్తూనే ఉన్నారు. దీనినిబట్టి సాయిబాబా ఇప్పటికీ అదృశ్యంగా జీవించే ఉన్నారని మనం ప్రగాఢంగా విశ్వసించవచ్చు. ప్రతి విషయంలోను ఆయన మనకు మార్గదర్శకులుగా ఉంటూ, తన దయను మనపై ప్రసరిస్తూ సహాయం చేస్తూ ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ చెబుతాను.
సాయిబాబా నాకొక అద్భుతమైన తన లీలావిలాసాన్ని చూపించారు. నా భర్తకు 1968 వ.సంవత్సరం నుండి గుండెజబ్బు ఉంది. మంచి పేరున్న హృద్రోగ నిపుణులందరూ నా భర్తకు వచ్చిన గుండె సమస్య “ఆరోటిక్ స్టెనోసిస్ విత్ రిగర్జిటేషన్’ గా నిర్ధారించారు. బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. చాలా సార్లు చాలా తీవ్రంగా మూర్చవస్తూ ఉండేది. నాడి కూడా సక్రమంగా కొట్టుకునేది కాదు.
1983వ.సంవత్సరంలో ఒక సారి ఆయనకు తీవ్రమయిన గుండెపోటు వచ్చింది. అపుడు బాబా ఆయనకు స్వప్నంలో దర్శనమిచ్చి, నుదుటిమీద ఊదీని రాశారు. ఆతరవాత 1983 వ.సంవత్సరం నవంబరు నెలలో నాభర్త ధ్యానంలో ఉండగా, సాయిబాబా ఫోటోనుండి దివ్యమయిన కాంతి వచ్చింది. ఆ కాంతి నాభర్త గుండెప్రాంతం వద్ద చర్మాన్ని చీల్చుకొని లోపలికి ప్రవేశించింది.
ఆకాంతి ప్రవేశించిన చోట వలయాకారంలో కాలినట్లుగా మచ్చ కూడా ఏర్పడింది. నాభర్తకు ఆ ప్రదేశంలో మంట పుట్టింది. వలయాకారంగా కాలిన చోటునుండి రక్తం బయటకు చిమ్మింది. అప్పటినుండి ఆయన ఛాతీమీద గుండె ప్రాంతంలో ఆపరేషన్ తరువాత కుట్లు వేసినట్లుగా మచ్చ అలా ఉండిపోయింది. ఛాతీలో బరువుగా ఉండటం, మూర్చ రావడం, ఇటువంటి సమస్యలన్నీ తగ్గిపోయాయి.
ఈసంఘటన జరిగిన తరువాత గుండెకు అన్నిపరీక్షలు చేసారు. ఎక్స్ రే, ఇసిజి, స్ట్రెస్, ఎకొ, కార్దియోగ్రామ్ లాంటి పరీక్షలన్నీ చేసారు. గుండె అంతా ఎటువంటి లోపం లేకుండా సక్రమంగా ఉందని నిర్ధారణ చేసారు డాక్టర్స్. అప్పటివరకు సంవత్సరాల అతరబడి ఎన్నో మందులను వాడుతున్నారు. మందులకి వేలాది రూపాయలు ఖర్చవుతూ ఉండేది.
సాయిబాబా చేసిన అధ్భుతమయిన సర్జరీ ఫలితంగా ఇక మందులు వాడే అవసరం రాలేదు నాభర్తకి. పరిపూర్ణ ఆరోగ్యవంతులయారు. ప్రపంచవ్యాప్తంగా సాయిభక్తులందరికి కూడా సాయిబాబా ఇప్పటికీ సజీవంగానే ఉన్నారనీ ప్రతిక్షణం మనల్ని కనిపెట్టుకుని మనలని కాపాడుతూనే ఉన్నారని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
(రేపటి సంచికలో ‘నాప్రార్ధనకు తక్షణమే స్పందించిన సాయిబాబా‘)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- శ్రీసాయి లీలా తరంగిణి – 7 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 8 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 2 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 1 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 5 వ. భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments