శ్రీసాయి లీలా తరంగిణి – 1 వ. భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

శ్రీ సాయి లీలా తరంగిణి 

రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన :  తెలుగు.  తరువాత  ఆంగ్లంలోకి అనుబదింపబడినది (ఆంగ్ల మూలం సాయిలీలా.ఆర్గ్ నుండి గ్రహింపబడినది)మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)  అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు గారు.

ఈ రోజు నుండి శ్రీమతి భారమ్ మణి ఉమా మహేశ్వరరావు గారు రచించిన ‘సాయిలీలా తరంగిణి’ ప్రారంభిస్తున్నాను.  ఈ పుస్తకంలో,  శ్రీ భారమ్ ఉమా మహేశ్వరరావుగారికి, శ్రీమతి మణిగారికి వారి కుటుంబ సభ్యులకు  బాబా వారు చూపించిన అద్భుతమైన లీలలు, వారికందించిన అనుభవాలు ఆవిడ ఏర్చి కూర్చి సాయి బంధువులందరికి అందించారు. ఈ పుస్తకమ్ ఆవిడ తెలుగులో వ్రాసారు. దానిని ఆంగ్లంలోకి కూడా తర్జుమా చేయించారు.  ఈ పుస్తకానికి బాబావారు కూడా మెచ్చుకుని ప్రసంశించారు.  దానికి సంబంధించిన లీల కూడా ముందు ముందు వస్తుంది. 

ఈ పుస్తకం తెలుగులోనే ఆమె వ్రాసారు కాబట్టి కొంత మంది వద్ద పుస్తకం ఉండవచ్చునని భావించాను.  మరలా నేను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేయడం సరైన పనేనా అనిపించింది.  అనువాదం మొదలు పెడదామని మళ్ళీ విరమించుకున్నాను.  కాని ఇందులోని బాబా లీలలను చదివిన తరువాత ఉండలేకపోయాను.

సరే బాబానే అడుగుదామని, బాబా చిన్న ఫోటో ముందు చీటీలు వేసాను.  ఒక దానిమీద ‘అనువాదమ్ చెయ్యి’  ఇంకొక దానినీద ‘అనువాదం చెయ్యద్దు’ అని రాసి కళ్ళు మూసుకొని ఫొటో ముందు వేసి, కళ్ళు మూసుకునే ఒక చీటీ తీసాను.  అనువాదమ్ చెయ్యమనే వచ్చింది.  ఇది ఆయన ఆజ్ఞగా భావించి అనువాదం ప్రారంభించి మీకందిస్తున్నాను.  ఈ అనువాదానికి కర్త, కర్మ, క్రియ అన్నీ బాబావారే.  నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి.

ఇందులో మీరు చదవబోయే కొన్ని లీలలు ఇంతకు ముందు శ్రీ భారం ఉమా మహేశ్వరరావుగారు, శ్రీ బొండాడ జనార్ధనరావుగారు, వారి గురించి వ్రాసినవాటిలో చదివారు. వాటిలోవి కొన్ని మరల వస్తాయి.  కాని వాటిలో లేని కొన్ని సంఘటనలు ఇప్పుడు మీరు చదవబోయేవాటిలో కనిపిస్తాయి.

కారణమ్ శ్రీ భారమ్ ఉమా మహేశ్వరరావు గారి భార్య శ్రీమతి మణిగారు తన భర్త ప్రక్కనే ఉంటారు కాబట్టి ఆవిడ గ్రహించిన, చూసిన విషయాలను యధాతధంగా వ్రాసారు.  అందువల్ల వాటిని కూడా మరలా మీరు చదవబోతున్నారు. బాబా లీలలు మరలా మరలా చదవాలనిస్తూనే ఉంటాయి కదా.

ఓమ్ సాయిరామ్

త్యాగరాజు

**************************************************************************************************************************

శ్రీ సాయి లీలా తరంగిణి ప్రారంభం

శ్రీసాయిబాబాతో నాజీవితం – శ్రీమతి భారమ్ మణి ఉమా మహేశ్వర రావు

ముందు మాట

భగవాన్ శ్రీసాయిబాబా దైవాలందరి తరఫున వారి ప్రతినిధిగా దివినించి భూవికి దిగి వచ్చిన ప్రత్యక్ష దైవం.  ఆయన సర్వవ్యాపకుడు.  మానవ రూపంలో అవతరించిన భగవదావతారం.  ఆయనని మనఃస్ఫూర్తిగా త్రికరణ శుధ్ధిగా సంపూర్ణ విశ్వాసంతో భక్తితో నమ్మితే చాలు.  ఆయన ఎల్లవేళలా తన భక్తులను రక్షించడానికి సదా సర్వ సన్నధ్ధంగా ఉంటారు.  ఆయన దయ ఎల్లవేళలా మనపై ప్రసరిస్తూనే ఉంటుంది. 

శ్రీసాయిబాబా భగవంతుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.  మనం ఆర్తితో ఆయనను ప్రార్ధిస్తే తప్పక స్పందిస్తారు.  ఆయన తన అవ్యాజ్యమయిన ప్రేమని తన భక్తులందరి మీద కురుపిస్తూ ఉంటారు.  సాయినాధ్ దయార్ద్ర హృదయుడు.  తననే ధానిస్తూ తనలోనే లీనమయ్యే తన భక్తులను చూసి బాబా ఎంతగానో  సంతృప్తి చెందుతారు.

తల్లి తన పిల్లలు అభివృధ్ధిలోకి రావాలని ఎంతగానో శ్రమిస్తుంది. వారు అభివృధ్ధిలోకి వచ్చినపుడు వారిని చూసిన ఆతల్లి హృదయం ఎంతగానో సంతోషిస్తుంది. అదే విధంగా తాత్వికజ్ఞానాభివృధ్ధి కోసం పరితపించే తన భక్తులకు బాబా తన చేయూతనందిస్తారు.  వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి ముక్తిని కలుగచేస్తారు.  శ్రీసాయిబాబా తన భక్తుల కష్టాలను తొలగించి వారు సుఖశాంతులతో సంతోషంగా కాలం గడిపేలా అనుగ్రహిస్తారు.

వివిధ దేశాలలో కోటానుకోట్లమంది సాయిభక్తులు ఉన్నారు.  ఆధ్యాత్మిక సాగరంలో నేనొక నీటిబొట్టును.  శ్రధ్ధ సబూరీలతో సాయిబాబాను చేరుకున్న ప్రతిభక్తునికి ఆయన లీలలు అనుభవంలోకి వస్తాయి.  ఆయన చేసే కొన్ని విచిత్రమయిన లీలలను మనం అర్ధం చేసుకోలేము. 

వాటిలో కొన్ని లీలలను మనం మర్చిపోతాము. మరికొన్నిటిని గుర్తుంచుకుంటాము. అత్యంత దారుణమయిన మన కష్టాలను కూడా ఆయన చాలా సునాయాసంగా దూదిపింజలన్నంత తేలికగా తొలగించేస్తారు. బాబా కరుణవల్ల మన జీవితాలు పునీతమవుతాయి.

ఆయన హృదయమంతా తన భక్తులఎడల కరుణతో నిండి ఉంది కాబట్టే తన భక్తులందరినీ ప్రతిక్షణం కాపాడుతూ ఉన్నారు.

ముందు మాట – రేపు కూడా కొనసాగుతుంది…….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles