Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయం లో, మద్రాస్ నుండి వచ్చిన భజన మండలి యొక్క లీలా ఇవ్వబడింది. వారి పేర్లు, చిరునామాలు మరియు ఇతర కొన్ని వివరాలు లేవు. క్రింద ఆలీలాపై సమగ్ర వివరణ ఇవ్వబడింది.
అతని పేరు గోవింద స్వామి, అతని గురువు దక్షిణ కనారాకు చెందినా రామ్ బావు. అందువలన అతను బావు స్వామి అని కూడా పిలువబడేవాడు. ఈ గోవింద స్వామి మద్రాస్ ఎలక్ట్రిక్ tramways(వీధులలో పట్టాలపై నడిచే ఒక చిన్న రైలు) లో పనిచేసేవారు. 1915లో అతను కుటుంబంతోపాటు భారతదేశ తీర్ధ యాత్రకు వెళ్లారు.
మార్గమధ్యంలో వారు 23.8.1915 న షిర్డీ సందర్శించారు. వారు చక్కగా పాడుతూ రోజు బాబా సమక్షంలో భజనలు చేసారు. బాబా వారికి రూ. 2/- మరియు రెండు రూపాయల విలువ చేసే బర్ఫ్ ఇచ్చేవారు. అతను ఆ బర్ఫీని ఒక రూపాయి పన్నెండు అణాలకు అమ్మేసేవాడు. అతడు ఈ వివరాలను తన డైరీలో ప్రతిరోజూ వ్రాసుకున్నాడు.
ఒకరోజు, అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చారు (ఇదంతా సాయి సచ్చరిత్రలో అందంగా విశదీకరించబడింది). ఆ స్వప్న దర్శనం తరువాత అత్యాశ గల ఆ సంశయవాది బాబా యొక్క గొప్ప భక్తుడు అయ్యాడు.
డాక్టర్ పిళ్ళై అతని కలను గురించి వ్రాసి పంపమని అతన్ని అడిగారు. అతడు అలాగే వ్రాసి పంపించాడు. భజనల యందు రాధాకృష్ణ మాయికి గల ప్రేమను తెలుసుకున్న అతను ఆమె ఇంట్లో కూడా భజనలను చేసాడు. ఆమె బాబా జీవిత విశేషాలను కలిగి ఉన్న ఒక మరాఠీ పుస్తకాన్ని అతనికి ఇచ్చిందట. అతడు ఆ పుస్తకాన్ని ఎంతో భద్రంగా భద్రపరుచుకున్నాడట.
ఒకరోజు మధ్యాహ్న ఆరతి సమయంలో భక్తులందరూ ఆయననే చూస్తుండగా బాబా అతని భార్య అదిలక్ష్మి అమల్ కి శ్రీరామునిగా దర్శనం ఇచ్చారు. ఆమె మనస్సు ఆనందంతో నిండిపోయి, బాబా కోసం బాజి మరియు పాయసం తయారుచేసి ప్రసాదంగా సమర్పించాలని నిర్ణయించుకుంది.
తేది. 30/08/1915న, ఆమె వాటిని తయారుచేస్తూ, “బాబా ఎంతో ప్రేమతో, భక్తితో వీటిని తయారుచేస్స్తున్నాను మీరు వీటిని స్వీకరించాలి” అని బాబాకు ప్రార్థన చేసింది. తయారుచేసిన తరువాత ఆమె ఆత్రుతగా వాటిని తీసుకుని ద్వారకామయికి వెళ్లి ఇచ్చింది.
దుర్గాభాయ్ అనే భక్తురాలు భక్తులు తెచ్చిన ప్రసాద సమర్పణలను వరుసలలో ఉంచుతూ ఆమె తెచ్చిన ప్రసాదాన్ని చిట్టచివరిదిగా ఉంచినప్పటికీ బాబా ఆ చివరి ప్రసాద పాత్ర వద్దకు వెళ్లి మూత తీసి అమితమైన ఇష్టంతో ఎంతో ఆత్రంగా ఆమె తెచ్చిన ప్రసాదాన్ని భుజించారు. బాబా చూపిన ప్రేమ ఆమె హృదయంతరాలను స్పృశించింది. ఈ సంఘటనతో ఆమెకు బాబా యందు భక్తి ఇంకా ధృఢపడింది.
source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- Dr. హాటే కు సంబందించిన మరికొంత సమాచారం
- శంకర్ లాల్ కె. భట్
- దక్షిణ రక్షణ కల్పిస్తుంది, మానసిక వేదన నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు మంచి ఆదాయం లభిస్తుంది–Audio
- గోవిందా రావు గార్డె
- గురువుగారు చేతులు తట్టుతూ భజన చేస్తూనే ఉన్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments