Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈ భీమాజీ పాటిల్ గురించి సాయి సచ్చరిత్ర ద్వారా మనకు తెలిసినదే. అయినప్పటికీ బాబా చరిత్రం అమృతం కంటే మధురమైనది. ఎన్నిసార్లు చదివిన తనివి తీరనది. కాబట్టి మళ్ళి ఒకసారి చదివి ఆనందించండి అని సాయి బంధువులను వేడుకుంటున్నాను. చివరిలో కొంచం మనకు తెలియని సమచారం కూడా ఇవ్వబడింది.
భీమజీ పాటిల్ ఖేబడే మహారాష్ట్ర పూణే జిల్లాలోని జున్నార్ తాలూకా నారాయణ్ గావ్ నివాసి. అతడు ఆ గ్రామంలో పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములను కలిగి ఉన్న సంపన్నుడు. అతను గొప్ప దయర్ధహృదయం గలవాడు. ముఖ్యంగా వచ్చే సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చి, వారికీ భోజనాలు పెట్టేవాడు. అతను ఒక క్షణం కూడా విచారం అనేది ఎరుగడు, ఎల్లప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తుండేవాడు.
అటువంటి జీవతాన్ని అనుభవిస్తున్న భీమాజీ పాటిల్ అనుకోకుండా దురదృష్టవశాత్తూ 1909లో క్షయవ్యాధి బారినపడ్డాడు. జ్వరం, విపరితమైన దగ్గుతో చాలా భాదను అనుభవించాడు. రోజులు గడిచేకొద్దీ అతనికి జ్వరం పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు, అందువలన అతను చాలా భయపడ్డాడు. ఎప్పటికప్పుడు రక్తం కక్కుకుంటూ ఉండేవాడు. భీమజీ పూర్తిగా మంచం పట్టాడు. అతను చాలా బలహీనమై సన్నగా అయిపోయాడు.
అన్ని రకాలైన పరిష్కారాలు ప్రయత్నించబడ్డాయి కానీ ప్రయోజనం పొందలేదు. దీని కారణంగా అతని మనస్సు పూర్తిగా వికలమైపోయింది. అతనికి ఏ ఆహారం, పానీయం రుచించేది కాదు. అతనికి ఈ భాదల వలన విశ్రాంతి లేకుండా పోయింది. అతను తన మనుగడపై ఆశలు వదులుకున్నాడు. అతను తమ కుల దైవంకి కూడా ప్రార్ధించాడు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు.
జ్యోతిష్కులను కూడా సంప్రదించాడు. వైద్యులు, హకీమ్స్, ఆయుర్వేద పండితులు ఏమీ చేయలేకపోయారు. వారందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. బీమాజీ అలసిపోయి, నిరాశకు గురై, ‘ఓ దేవా, నేను ఏమి చేశాను? ఎందుకు ప్రతిదీ విఫలమైంది? నేను ఎలాంటి భయంకరమైన పాపం చేశాను అందుకు ఇలాంటి భరించలేని బాధలను అనుభవిస్తున్నాను? ‘ అని హృదయ విదారకంగా సోకించాడు.
భీమాజీ సహాయం కోసం చేసిన ప్రార్ధనలను, వేదనను దేవుడు విని కరుణతో కదిలిపోయాడు! అకస్మాత్తుగా అతనికి తన స్నేహితుడైన నానా సాహెబ్ చందోర్కర్ గుర్తుకు వచ్చాడు. వెంటనే తన సమస్యలను వివరంగా వివరిస్తూ నానాకు లేఖ వ్రాసాడు. భీమజీ పాటిల్ హఠాత్తుగా నానా సాహెబ్ గుర్తు చేసుకోవడం సాదారణంగా జరిగినది కాదు, అది సాయిబాబా ప్రేరేపణ మాత్రమే.
తమతో ఋణానుబంధం కలిగి ఉన్న తమ భక్తులను బాబా ఏదో ఒక రూపంలో తమ చెంతకు చేర్చుకుంటారు. సరిగ్గా అలాగే భీమజీ పాటిల్ వ్యాధిని నిర్మూలించటానికి సాయిబాబా ఆ సమయంలో అతనికి నానా చందోర్కర్ గుర్తు వచ్చేలా చేసారు.
భీమజీ పాటిల్ లేఖను చదివి నానా చందోర్కర్ గుండె బాధతో నిండిపోయింది. అతని హృదయం భీమజీ పాటిల్ కోసం కరుణతో నిండిపోయింది. ‘సాయిబాబాను దర్శనం చేసుకొని, ఆయన పాదాలను పట్టుకోమని, అదే అంతిమ పరిష్కారమని’ చెపుతూ నానా బీమాజీకి లేఖ వ్రాసారు. నానా సలహా ప్రకారం, భీమజీ పాటిల్ ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. సాయిబాబా దర్శనం కోసం తనతోపాటు కొందరు బంధువులను తీసుకోని, కుటుంబ సభ్యుల వద్ద సెలవు తీసుకోని షిర్డీకి బయలుదేరాడు.
భీమజీ పాటిల్ మరియు అతని బంధువులు వెళుతున్న బండి వచ్చి ద్వారకామయి మసీదు ప్రవేశద్వారం వద్ద నిలిచింది. నలుగురు వ్యక్తులు తమ చేతులతో అతనిని మోసుకొని మశీడులోనికి తీసుకువచ్చారు. నానా సాహెబ్ చందోర్కర్ భీమజీతోపాటు వచ్చారు. మాధవ రావు దేశ్పాండే (శ్యామా) అప్పటికే ద్వారకామయికి వచ్చి ఉన్నారు.
భీమజీని చూస్తూనే బాబా మాట్లాడుతూ, “షామా, నీవు ఎంత మంది దొంగలును తెచ్చి నాపై భారం వేస్తావు? నీకు ఇది సరియైనదేనా?” అని అన్నారు.
బాబా మాటలు విని భీమజీ సాయిబాబా పాదాలపై తన తల ఉంచి, “సాయినాధా, నన్ను కరుణించి నన్ను కాపాడు” అన్నాడు.
కరుణ సముద్రుడైనా సాయిబాబా భీమజీ పాటిల్ బాధను చూసి కనికరంతో చలించిపోయారు. బాబా నవ్వుతూ “నీ అత్రుతలను విడిచిపెట్టి ప్రశాంతంగా ఉండు. షిర్డీలో నీ పాదము మోపిన క్షణంలో నీ బాధ ముగిసింది. నీవు ద్వారకామయి మెట్లను అధిరోహించడంతో నీ బాధలు అన్ని ముగుసాయి.
నీవు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తావు. ఇక్కడి ఫకీర్ చాలా దయగలవాడు. అతను నీ వ్యాధిని, నొప్పిని వ్రేళ్ళతో సహా పెకిలించివేస్తాడు. అందువల్ల మనస్సులో ఎటువంటి దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండు. నీవు వెళ్లి భీమబాయి ఇంటిలో ఉండు. ఇప్పుడే వెళ్ళు, నీవు భాధల నుండి రెండు రోజులలో ఉపశమనం పొందుతావు” అని అన్నారు.
చావు బతుకుల మద్య ఉన్న వాడి నోట్లో అమృతం పోసినట్లుగా, దాహంతో తపించిపోయే వాడికి త్రాగడానికి నీరు దొరికినట్లుగా సాయిబాబా యొక్క మాటలు విని భీమాజీ పాటీల్ గొప్ప సంతృప్తిని అనుభవించాడు.
భీమాజీ దాదాపు ఒక గంట మశీదులో బాబా సమక్షంలో కూర్చున్నాడు. ప్రతి ఐదు నిమషాలకు రక్తం కక్కుకొనే అతను బాబా సమక్షంలో ఒక్కసారి కూడా కక్కుకోవడం జరగలేదు.
బాబా భీమాజీని పరిశీలించలేదు, కనీసం అతని రోగం గురించి ప్రశ్నించలేదు. కేవలం కృప దృష్టితో ఆయన ఆ వ్యాధి యొక్క మూలాన్ని తక్షణమే నాశనం చేశారు.
బాబా భీమజీ పాటిల్ కు కొద్దిగా ఊధి ఇచ్చి, అతని నుదిటిపై కొద్దిగా పెట్టి భీమజీ పాటిల్ తలపై తమ హస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు. తరువాత భీమబాయి ఇంటిలో ఉండమని భీమాజీ పాటిల్ కు చెప్పారు.
(Source: Shri Sai Satcharitra, Chapter 13, Personal Interview Smt.Shreya Nagaraj had with Shri.Sanjay Prakash khebade patil, Great Grand Son of Bhimaji Patil. Photo Courtesy: Sri. Nagaraj Sham)
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- భక్త భీమాజీ పాటిల్ రెండవ భాగం
- మహల్సాపతి ఆహ్వానం ఆవోసాయి (1వ. భాగం)
- బాబానే గోవింద పాటిల్ రూపంలో వచ్చి 40 మంది తన భక్తులను రక్షించారు.
- సాయి భక్త ముక్తారాం – మొదటి బాగం….
- నేను ఉదీ ఇవ్వను. అల్లమలిక్ హై–బయ్యాజీ అప్పాజీ పాటిల్–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “భక్త భీమాజీ పాటిల్ మొదటి భాగం”
Maruthi
August 27, 2017 at 11:42 amSri Sathchidananda Samardha Sadguru Sainath Maharaj Ki Jai