Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-173-1312U-నేను ఉదీ ఇవ్వను 7:14
బయ్యాజీ అప్పాజీ పాటిల్ షిర్డీ సాయిబాబా ను జీవితాంతమూ సేవించుకో గలిగిన భాగ్యశాలి.
జీవిత విశేషాలు
బయ్యాజీ 1889 లో జన్మిచాడు. ఇతడు శిరిడీ లోనే పుట్టి పెరిగి సాయితో పాటే శిరిడీలోనే నివసిస్తూ ఆ సద్గురువును సేవించుకోగలిగిన అదృష్టవంతుడు. బయ్యాజీ పాటిల్ కు చిన్నతనం నుంచే బాబా తెలుసు.
బాబా జీవితాంతమూ వీరింట్లో భిక్ష చేశారు. బాబా మూడు సంవత్సరాలపాటు వీరింటికి రోజుకు 8 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు .
తరువాత మూడు సంవత్సరాలు రోజుకు 4 సార్లు వీరింట్లో భిక్ష చేసేవారు. ఆ తర్వాత 12 సం. లు పాటు ప్రతి రోజూ ఒక్కసారి భిక్ష స్వీకరించేవారు.
బాబాను సేవించడం మొదలు పెట్టేటప్పటికి బయ్యాజీ అప్పాజీ పాటిల్ కు 11 సంవత్సరాలు.
అతని 11 వ యేట ఒకరోజు ఉదయం గం. 9-30ని”ల ప్రాంతంలో బాబా అతనిని పశువులు మేపుకోడానికి వేల్లనివ్వలేదు.
ఆయన అకస్మాత్తుగా కోపించి, అతడిని, మరికొందరిని తిట్టి, నాలుగు కుండలు పగుల గోట్టారు..
తర్వాత తమ అరచేతి వెనుక వైపున “భం, భం” అని నోటితో శబ్ధంచేసి, ఎవరి మరణమో, ఆశుభామోగాని సూచించారు.
నాటిరాత్రి అతని మేనత్త కొడుకు దాజీకోటే జ్వరంతో మరణించారు.
బాబా మహాసమాధి చెందక ముందు 14 సం. లు పాటు ప్రతిరోజూ బయ్యాజీ పాటిల్ కు నాలుగు రూపాయలిచ్చి, “నేనిచ్చిన ఈ ధనాన్ని ఎవ్వరికీ దానం చేయవద్దు. దీనిని ఖర్చు పెట్టకు. ఎవ్వరికీ అప్పుగా కూడా ఇవ్వకు” అన్నారు.
అందుకని అతడు ఆ ధనాన్ని దాచుకున్నాడు. తర్వాత ఆ పైకంతో సుమారు 84 ఎకరాల భూమిని కొన్నాడు.
ఒకసారి శిరిడీలోని రైతులందరూ తమ పొలాలలో చెరుకు పంట వేస్తూ ఉన్నారు .
తానూ కూడా చెరుకు పంట వేయాలని తలచాడు పాటిల్ . కానీ బాబా వద్దన్నారు . ఆయన ఆజ్ఞను పాటించి అతడు చెరుకు పండించలేదు .
కానీ ఒక సంవత్సరం మాత్రం బాబా మాట వినకుండా చెరుకు పంట వేశాడు . అతడికి తీవ్రమైన నష్టమొచ్చింది . బాబా ఆజ్ఞను పాటిస్తే భక్తులకు మేలు జరుగుతుందని పాటిల్ గ్రహించాడు .
బయ్యాజీ పాటిల్ బాబాకు పాదసేవ చేసుకుంటూ ఉండేవాడు .
అతనికి చాలా బలం . ఎన్నోసార్లు అతడు బాబాను తన చేతులతో ఎత్తుకుని ధుని దగ్గర దించేవాడు.
క్రమంగా అతడు తానెంతో బలవంతుడినని గర్వించసాగాడు. ఒకరోజు సాటివారితో, “నాకు భీముడంత బలం నాకు బలంలో ఎవరూ సాటిరారు” అని గర్వంగా చెప్పాడు .
ఆ రోజు కూడా బాబాను తన చేతులతో ఎత్తడానికి ప్రయత్నించాడు . కానీ ఎంత ప్రయత్నించినా బాబాను లేపలేకపోయాడు. బాబా అతడిని చూసి నవ్వారు .
బయ్యాజీ తన తప్పు తెలుసుకున్నాడు . అలా అతని గర్వాన్ని తొలగించారు బాబా.
1913 లో బయ్యజీ పాటిల్ తండ్రి (70సం.) అలవాటు ప్రకారం గుర్రం మీద బయటకు వెళ్లి పక్షవాతంతో ఇంటికి వచ్చారు.
అతడు బాబా వద్దకు వెళ్లి ఊదీ అడిగారు. బాబా “నేను ఉదీ ఇవ్వను. అల్లమలిక్ హై” అన్నారు.
నాటికీ మూడవరోజున కార్తిక శుద్ధ ఏకాదశి నాడు అతని తండ్రి మరణించారు. మరురోజు యధాపుర్వం అతను మశీదుకు వెళ్లి బాబా పాదాలు వత్తారు”.
సాయితో నిత్యసంగాత్యం వలన బయ్యాజి పాటిల్ హృదయంలో అతనికి తెలియకుండానే, అతని ప్రయత్నం – సాధన ఏమి లేకనే ఎంతటి ఉత్తమ సంస్కారం కలగిందో ఈ ఒక్క సంఘటన తెలుపుతుంది.
ఒకవంక అతని కన్న తండ్రి మృత్యుముఖంలో ఉన్నారు. మరోవంక తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థ సద్గురువు సాయి అతనికి ఇంటికి కొద్దిడురంలోనే వున్నారు.
కనుక తన తండ్రిని బ్రతికించమని అనన్యంగా ఆయనను శరణు బొందారు. అయినప్పటికీ సాయి ఉదీ ఇవ్వనపుడు మరెవరికైనా అయితే ఆయనపట్ల పట్టరాని కోపం వస్తుంది.
అంతవరకు ఆయనపై ఉన్న భక్తిశ్రద్ధలు అడుగంటి పోతాయి. సాయి తమవల్ల గాకనే తన తండ్రిని రక్షించలేదని అతడు సమాధాన్పదబోతే సాయి సర్వ సమర్ధులు, సాక్షాత్తు భగవంతుడు అన్న విశ్వాసం సడలిపోతుంది.
అలగాక, ఆయన సర్వ సమర్దులైనప్పటికి తన ప్రార్ధన మన్నిన్చాలేదనుకొంటే ఆయన ప్రేమస్వరూపమని, తన ఏకైక రక్షకులన్న భావం నశించిపోతుంది.
అంతవరకూ అతడు గతంలో చేసిన సేవంతా వ్యర్ధమని ఆ పరిస్తితుల్లో సామాన్యులకు అనిపించి తీరుతుంది. అటుతర్వాత మళ్ళి ఆయనను దర్శించడం కూడా కష్టమే.
ఒకవేళ ఎవరైనా ఆ విఘాతానికి తట్టుకొని, మనస్సును సమాధాన పరుచుకోగాల్గినప్పటికి అందుకేంతో సమయం పడుతుంది. ఏమైనప్పటికీ పిత్రుశోకం కొంతకాలం సామాన్యులను కృంగదీయకమానదు.
కానీ బయ్యాజి పాటిల్ లో ఇవేవి కన్పించవు. అతడు తన తండ్రి మరణించిన మరురోజే ఎప్పటివలె ఆయనను దర్శించే పాదసేవ చేసుకున్నారు.
ఆయన తన తండ్రిని ఎందుకు రక్షించలేదని అతడు బాధగా సాయి ని ఒక్కసారి కూడా అడగలేదు.
అదీ అసలైన భక్తీ. అదే సాయి కోరే దక్షిణలోని ‘నిష్ఠ’. అది అతనికి సాయి సన్నిధి ప్రసాదించిన వరమేనని తలచవచ్చు.
బాబా బయ్యాజీ పాటిల్ తో, “నీ తండ్రి ఐదు నెలలలో మళ్ళీ వస్తాడు. నువ్వు బాధపడడమెందుకు?” అన్నారు.
బాబా చెప్పినట్లే బయ్యాజీ పాటిల్ కు ఒక కుమారుడు జన్మించాడు. బాబా అలా తమ భక్తుల నిత్యజీవితంలోని కష్టాలను, కోరికలను తీర్చడమే గాక వారికి తమ సేవ, సాన్నిధ్యమూ యిచ్చి ఉద్ధరిస్తారు.
బాబా తమ చివరిరోజున అతనికి ఒక నీతినేర్పి, ‘అది ఎవరికి చెప్పవద్దు, చెప్పావంటే చచ్చిపోతావు’ అన్నారు. తర్వాత సాయి ‘నేను వెళ్ళిపోతున్నాను.
నన్ను వాడకు తీసుకుపోండి. పెద్దపెద్దవారు నన్ను అక్కడ సేవ చేస్తారు’ అని చెప్పి బాబా అతనిని అనుకుని శరీరం విడిచారు.
ఆతర్వాత నిమోన్కర్ వారి నోట్లో నీరుపోస్తే అదంతా బయటకు వచ్చేసింది. ఆ నీరు పట్టుకోవాలని వారి గడ్డం క్రింద బయ్యాజి పాటిల్ చేయి పెట్టారు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఒకసారి కలలోకి రావయ్యా…..సాయి@366 నవంబర్ 8….Audio
- భక్త భీమాజీ పాటిల్ రెండవ భాగం
- భక్త భీమాజీ పాటిల్ మొదటి భాగం
- మహల్సాపతి ఆహ్వానం ఆవోసాయి (1వ. భాగం)
- బాబానే గోవింద పాటిల్ రూపంలో వచ్చి 40 మంది తన భక్తులను రక్షించారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నేను ఉదీ ఇవ్వను. అల్లమలిక్ హై–బయ్యాజీ అప్పాజీ పాటిల్–Audio”
sarada
June 26, 2016 at 4:01 pmAnubavaalu chlaa bagunnai