Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-172-1312-పిల్లి దృష్టిని 3:04
బెంగుళురు కు చెందిన చిన్న పిల్ల సూర్య బాబాకి అచంచలమైన భక్తురాలు.
పిల్లి పిల్లలంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఒకరోజు ఒక పిల్లిపిల్ల ఆమె ఇంటిలోనికి ప్రవేశించింది.
ఆమె తల్లిదండ్రులు ఆ పిల్లిని తనతో ఉంచుకోవడానికి సూర్యని అనుమతించారు.
ఒకరోజు సూర్య తల్లి సూర్యనీ ఆమె సోదరినీ తీసికుని మల్లేశ్వరం లోని సాయిమందిరానికి భజన కార్యక్రమానికి వెళ్ళింది.
వాళ్ళు ఇంటికి చేరుకునేటప్పటికి మిగిలిన పిల్లి పిల్లలు ఈ కొత్త పిల్లిని తీవ్రంగా గాయపరిచాయి.
ఎంతతీవ్రంగా గాయ పరిచాయంటే ఈ కొత్త పిల్లి కళ్ళు రెండూ బయటకు వచ్చేసేంతగా గాయపరిచాయి. కళ్ళనుండి రక్తం కారుతోంది. నొప్పితో విపరీతం గా మ్యావ్ మ్యావ్ అంటూ మూలుగుతోంది.
ఈ దృశ్యాన్ని చూసిన సూర్య చలించిపోయింది, ఆమె హృదయం ద్రవించిపోయింది,
కొత్తపిల్లి ఈ విధంగా దృష్టి పోగొట్టు కోవడం ఆమెని కదిలించివేసింది. ఆ పిల్లిని ఎత్తుకుని పరుగు పరుగున బాబా ఫోటో ముందుకు పోయి ఈ మూగ జంతువుకి ఇంతటి శిక్ష ఎందుకు?
ఈ చిన్నపిల్లి దృష్టిని పునర్దుద్దరించలేవా? అంటూ ఏడ్చింది. కొద్దిగా విభూతి తీసికుని ఆమె గాయానికి రాసింది. ’బాబా నా ఈ చిన్నారి పిల్లి దృష్టిని పునరుద్దరించు’ అని ప్రార్దించింది.
ఆశ్చర్యకరంగా ధ్వనించవచ్చు, అద్భుతమేమొ అనిపించవచ్చు కానీ కొన్ని నిముషాలలోనే రక్త స్రావము ఆగిపోయింది.
కళ్లు సాధారణ స్థితికి రావడం ప్రారంభమయింది. కొద్ది సమయంతర్వాత ఆ కొత్తపిల్లికి చూపు పునరుద్దరించబడింది అని వేరేగా చెప్పనవసరం లేదు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నో కష్టాలు ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి.
వారు దుర్భరమైన దారిద్య్రం పాలయ్యారు. దుఖంతో బాబాను పూజించడం మానుకున్న ఆ కుటుంబం బాబా కి దూరమయ్యారనే చెప్పాలి.
వారు చైన్నయ్ కి వెళ్లిపోయారు. బాబాని వదిలేసారు. చెన్నయ్ కి చేరిన రెండుమాసాల తర్వాత ఒక రోజు ఆమె తల్లికి భజనలు చేయమన్న ఆదేశం వినిపించింది.
ఆ కుటుంబం ఇంటిదగ్గరా, అప్పుడప్పుడూ మందిరాలలోనూ భజనలు చేయడం ప్రారంభించారు.
వారి విశ్వాసం పునరుద్దరింపసాగింది. వారి ఆర్దిక పరిస్థితికూడా మెరుగుపడ సాగింది.
సూర్య తల్లి చాలా భాషలలో పండితురాలు. ఆమె వివిధ భాషలలో బాబాపై, బాబా కి కృతజ్ఞతలనర్పిస్తూ ప్రవచనాలిస్తూ జీవితాన్ని కొనసాగించింది.
సాయి సుధ, సంచిక: 13, భాగం: 9, ఫిభ్రవరి 1953
సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366096
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాలకృష్ణా! నిన్ను నే చేరి కోలతు…. మహనీయులు – 2020… జూలై 8
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – మూడవ భాగం–Audio
- తెలియగలేరే నీ లీలలు …..సాయి@366 డిసెంబర్ 2….Audio
- నాకాలి నొప్పిని స్వీకరించి నన్ను రక్షించారని ఈ నాటికీ నమ్ముతున్నాను-Gopal Rao–16–Audio
- ఎన్నో సాయి లీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర మూడవ భాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “పిల్లి దృష్టిని పునర్దుద్దరించిన విభూతి—Audio”
kishore Babu
June 26, 2016 at 10:37 amసాయి బాబా వారికి ముందునుంచిని , భక్తి శ్రద్దలతో ఆయనను కోరుకొంటే చాలు ,అది అసాధ్యమయిన సరే సాధ్యం చేస్తారు. ప్రణామములు సాయి దేవ.