భక్త భీమాజీ పాటిల్ రెండవ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

బాబా భీమజీ పాటిల్ కు కొద్దిగా ఊధి ఇచ్చి, అతని నుదిటిపై కొద్దిగా పెట్టి భీమజీ పాటిల్ తలపై తమ హస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు. తరువాత భీమబాయి ఇంటిలో ఉండమని భీమాజీ పాటిల్ కు చెప్పారు. అంతవరకూ జబ్బు వలన నీరసించిపోయి నడవలేని స్థితిలో ఉన్న భీమజీ పాటిల్ లేచి ఎవరి సహాయం లేకుండా నడుచుకుంటూ వెళ్లి మంచం మీద కూర్చున్నాడు. ఇప్పుడు అతను కొంత శక్తివంతమై చురుకుగా ఉన్నాడు.

భీమబాయి ఇంటిని ఇటీవలే బంకమన్నుతో చదును చేయడం వలన నేల తడిగా ఉంది. అటువంటి స్థలం జబ్బుతో భాదపడుతున్న భీమాజీకి సరైనది కాదు అయినప్పటికీ అతడు బాబా ఆజ్ఞను శిరసావహించి భీమబాయి ఇంటిలోనే ఉండటానికి నిర్ణయించుకున్నాడు. అతడు ఆ తడి నేలపైనే  రెండు గోనెలు పరుచుకొని పడక ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా పడుకున్నాడు.

అదే రాత్రి భీమజీ పాటిల్ కు కలలో బాబా తన చిన్నతనంలోని ఉపాధ్యాయుడుగా దర్శనమిచ్చి అతని కర్రతో చేతి మీద కొట్టారు. తాను ఎందుకు అలా శిక్షించబడుతున్నడో భీమాజీ అర్థం చేసుకోలేకపోయాడు. అదే రాత్రి కొంతసేపటి తరువాత భీమజీకి మరొక కల వచ్చింది.

ఆకలలో ఎవరో తెలియని ఒక పెద్దమనిషి వచ్చి అతని ఛాతీపై బలంగా నొక్కిపెట్టి కూర్చున్నాడు. అప్పుడు ఆ పెద్దమనిషి ఛాతిపై ఒక రాతి పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయటచే మిక్కిలి బాధననుభవించెను. భీమజీ పాటిల్ ఆ భాదను  భరించలేకపోయెను. ఆ కల అంతటితో ముగిసింది.

తరువాత భీమజీ ఒకరకమైన ఓదార్పుతో సుఖంగా, ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం భీమజీ లేచి, అంతకు మునుపు లేనంత తాజాగా ఉన్నట్లుగా భావించాడు. అనారోగ్య భావన పూర్తిగా అదృశ్యమయ్యింది. ఆ రోజుతో అతని వ్యాధి పూర్తిగా నిర్మూలించబడింది. అంతటితో అతని బాధ ముగిసింది.

భయంకరమైన వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు గమనించిన భీమజీ పాటిల్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతను బాబా దర్శనానికి వెళ్ళాడు. అతను బాబా ముఖం చూచినప్పుడు, తన ముఖం ఆనందముతో మెరిసిపోయింది, ఆహ్లాదకరమైన మృదుబావనతో తన కళ్ళు ముసుకున్నాయి. అతడు గౌరవంతో సాయి పాదాలకు వంగి.వందనం చేసుకున్నాడు.

అతను షిర్డీలో మరో నెలరోజుల పాటు ఉండి మహదానందంతో తన స్వగ్రామం చేరుకున్నాడు. అతను నానా సాహెబ్ చేసిన మేలును కృతజ్ఞతతో గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుండి భీమజీ పాటిల్ తరచుగా సాయిబాబా దర్శనం కొరకు షిర్డీని సందర్శించడం ప్రారంభించాడు.

అప్పటి నుండి భీమజీ పాటిల్ ప్రతి గురువారం సాయి సత్యనారాయణ వ్రతం చేయడం ప్రారంభించాడు. సత్యనారాయణ వ్రత కథ చదవడానికి బదులుగా భీమాజీ దాసగణు రచించిన ‘అర్వీచినా భక్తలీలామృతం’ నుండి సాయి చరిత్ర చదివేవాడు. అతడు తన బంధువులను, స్నేహితులను ఇంకా ఇతర తెలిసన వారినందరిని సాయి సత్యనారాయణ వ్రతానికి ఆహ్వానించి ఎంతో శ్రద్ధతో చేసేవాడు. గ్రామంలోని ప్రతి ఒక్కరు అతని ఇంట్లోని జరిగే సాయి సత్యనారాయణ వ్రతానికి హాజరయ్యేవారు. ఆ విధంగా భీమజీ పాటిల్ నారాయణ్ గావ్ లో నూతన ఒరవడిని మొదలుపెట్టాడు.

భీమజీ పాటిల్ మరణించిన తరువాత, కొన్ని సంవత్సరాలు సాయి సత్యనారాయణ వ్రతం చేసే సంప్రదాయం  కొనసాగింది. కానీ తర్వాత అతని తరువాతి తరాల వారు దాని గురించి పూర్తిగా మరచిపోయి, దానిని చేయడం పూర్తిగా నిలిపివేసారు. దానితో చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నారు.

ఒకసారి సాయి మహాభక్త నానా సాహెబ్ నిమోంకర్ 4వ తరానికి చెందిన నందకుమార్ రేవన్నాథ్ దేశ్పాండే నిమోంకర్ నారాయణ్ గావ్ లో ఉన్న సాయిబాబా మందిరంలోని ద్వారకామయిలో పాదుక పూజకోసం నారాయణ్ గావ్ సందర్శించారు. సాయి భక్తుడు శ్రీమతి శివాజీ బోరడే అతనిని భీమాజీ పాటిల్ యొక్క పూర్వీకుల ఇంటికి తీసుకువెళ్లారు.

శ్రీ. నందకుమార్ రేవన్నాథ్ దేశ్పాండే నిమోంకర్ వారి కథను విన్న తర్వాత, సాయి సత్యనారాయణ వ్రతాన్ని తిరిగి ప్రారంభించమని చెప్పారు. అతను చెప్పినట్లుగా భీమజీ పాటిల్ యొక్క వారసులు సాయి సత్యనారాయణ వ్రత సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. తరువాత వారి సమస్యలన్నీ తొలగిపోయి వారు సుఖంగా ఉన్నారు.

భీమజీ పాటిల్ కొడుకు నారాయణ్ భీమజీ ఖేబడే పాటిల్. అతని కుమారుడు ప్రకాష్ నారాయణ్ భీమజీ పాటిల్. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మరణించారు. ప్రస్తుతం తన భార్య శంకర్ ఉషా తన ముగ్గురు కుమారులు శ్రీ సంజయ్ ప్రకాష్ ఖేబడే పాటిల్, శ్రీ అజయ్ ప్రకాష్ ఖేబడే పాటిల్, శ్రీ వైభవ్ ప్రకాష్ ఖేబడే పాటిల్ మరియు ఒక కొడలుతో ఉన్నారు.

భీమజీ పాటిల్ యొక్క పురాతన వాడ(ఇల్లు)ను పడగొట్టి ఆ ప్రదేశంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. అందులో ఒక భాగంలో వారి పూర్వీకుల గృహంగా ఉంచి, వారి ఇంటిలోనే ఒక చిన్న సాయి బాబా మందిరం కూడా నిర్మించారు.

భీమజీ పాటిల్ కుటుంబీకులు 2013లో సాయి తేరా ధాం మందిర్ అనే పేరుతొ ఒక ప్రత్యేక సాయిబాబా మందిర్ని కూడా నిర్మించారు. శ్రీసాయి సచ్చరిత్ర 13 అధ్యాయాన్ని ఆ మందిరం లోపల గోడపై చెక్కించారు. ఈ మందిరం భీమజీ పాటిల్ యొక్క పూర్వీకుల ఇంటి నుండి కొద్ది దూరంలోనే ఉంది. అక్కడికి వెళ్ళడానికి కేవలం సుమారు 7నిమిషాలు పడుతుంది.

సాయిబాబా సమాధి చెందడానికి కొద్దిరోజుల ముందు బాబా ఒక నంది(ఎద్దు)ని భీమజీ పాటిల్ కు ఇచ్చారు. ఈ నంది కొన్ని సంవత్సరాల తరువాత మరణించింది. ఈ నందిని  ద్వారకామయి సాయిబాబా మందిరం యొక్క ప్రాంగణంలో సమాధి చేసారు. నంది యొక్క నల్లటి రాతి విగ్రహం ఆ సమాధిపై స్థాపించబడింది.

సాయి భక్తుల ప్రయోజనం కోసం సాయి మహాబక్తా భీమజీ పాటిల్ యొక్క పూర్వీకుల నివాస సంప్రదింపు వివరాలను క్రింద ఇవ్వబడ్డాయి:

Address:

Sai Mahabhakta Bhimaji Patil Khebade House 
C/o.Sanjay Prakash Khebade Patil 
Narayangaon-410 504, 
Junnar Taluk, Pune District, 
Maharashtra, India 
Contact Number: +91 99600 69073
Email Address: 
sanjaykhebade@gmail.com

(Source: Shri Sai Satcharitra, Chapter 13, Personal Interview Smt.Shreya Nagaraj had with Shri.Sanjay Prakash khebade patil, Great Grand Son of Bhimaji Patil. Photo Courtesy: Sri. Nagaraj Sham)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles