మహల్సాపతి ఆహ్వానం ఆవోసాయి (1వ. భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై

 

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 

నీ కోసం తనూ అంతగానే బాధపడుతోంది, అన్నారు బాబా .’’మరింతగా ఆశ్చర్యపోయాడు పాటిల్‌.

ఎవరో ఆ పేరును పలకమన్నట్టుగానే పలికాడతను.‘‘ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది నా బిజిలీ’’అడిగాడు పాటిల్‌.‘‘అక్కడ ఉంది. వెళ్ళి చూడు.’’ అన్నారు బాబా. చెట్ల గుబురుల వైపు చేయెత్తి చూపించాడు. బాబా చూపించిన వైపుగా పరుగందుకున్నాడు పాటిల్‌. కాళ్ళు తడబడి ఓ చోట పడిపోవాల్సింది. నిలదొక్కుకున్నాడు. మళ్ళీ పరుగందుకున్నాడు. పరుగుదీస్తూ ఎక్కడ?

ఎక్కడ నా బిజిలీ అనుకుంటూ అటూ ఇటూ చూస్తోన్న పాటిల్‌కి ఓ చోట గడ్డి మేస్తూ బిజిలీ కనిపించింది.‘‘బిజిలీ’’ అని గట్టిగా కేకేశాడు పాటిల్‌. ఆ కేకకి తలెత్తి చూసింది బిజిలీ. తన యజమాని! ఆనందంగా పెద్దగా సకిలించిందది. బిజిలీ దగ్గరగా చేరుకున్నాడు పాటిల్‌. దాని మెడను వాటేసుకున్నాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. పోయిందనుకున్న గుర్రం దొరికింది. ప్రాణం లేచొచ్చింది. అంతకన్నా కావాల్సింది ఏముంది?‘‘ఎలా తప్పిపోయావు బిజిలీ? ఇక్కడికెలా వచ్చావు?’’ అడిగాడు పాటిల్‌. సమాధానంగా ముందుకు నడిచింది బిజిలీ. దాన్ని అనుసరించాడు పాటిల్‌. 

నడిచి వచ్చి బాబాకి ఎదురుగా నిల్చుంది బిజిలీ. పెద్దగా సకిలించింది.

‘‘పాటిల్‌ కోసం బెంగ పెట్టుకున్నావు. వచ్చాడు కదా, చూశావు కదా? ఆనందంగా ఉందా?’’ నవ్వుతూ అడిగారు బాబా. ఉందన్నట్టుగా తలూపింది బిజిలీ.‘‘నీ కోసం అతనూ, అతని కోసం నువ్వు రెండు నెలలుగా బాధపడుతున్నారు. ఇక మీ బాధ తీరిపోయిందిగా! హాయిగా వెళ్ళిరండి.’’ అన్నారు బాబా. పాటిల్‌ని చూశారు.‘‘బిజిలీకి నువ్వంటే ప్రాణం. తీసుకెళ్ళు’’ అన్నారు.

చేతులు జోడించాడు పాటిల్‌. పట్టించుకోలేదు బాబా. చిలుం గొట్టంలో పొగాకు నింపుకోసాగారు. బాబాని చూస్తూ నిల్చున్నాడు పాటిల్‌. చిలుం గొట్టంలో దట్టంగా పొగాకు నింపారు బాబా. తర్వాత పక్కనున్న పట్కాలాంటి చిమ్టాను అందుకున్నారు. దానిని నేలలో గుచ్చారు. ఆశ్చర్యం! గుచ్చిన చోట నుంచి సర్రున నీరు పైకి చిమ్మింది. ఆ నీటిలో చేతిగుడ్డను తడిపారు బాబా. తర్వాత దానిని పిండారు. పిండిన గుడ్డని చిలుం చివరన చుట్టారు.

తనని గమనిస్తున్న చాంద్‌పాటిల్‌ని నవ్వుతూ చూశారు బాబా. ‘ఏమిటి చూస్తున్నావు?’ అన్నట్టుగా తలాడించారు. సమాధానం లేదు పాటిల్‌ దగ్గర్నుంచి. అతను కళ్ళప్పగించి చూస్తున్నాడంతే!

చేతికర్రలాంటి సట్కా అందుకున్నారు బాబా. దాంతో నేల మీద కొట్టారు. కొట్టిన చోట నిప్పు రాజుకుంది. ముందు పొగ వచ్చింది. తర్వాత కణకణలాడుతూ నిప్పు ప్రత్యక్షమయింది. కళ్ళు పెద్దవి చేసి, నిశ్చేష్టుడయ్యాడు పాటిల్‌. నిప్పుతో చిలుం ముట్టించారు బాబా. గట్టిగా పీల్చి, పొగ వదిలారు. మత్తుగా కళ్ళు మూసుకున్నారు.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles