Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
అరచేతిని అడ్డుపెట్టి అరుణకాంతిని ఆపగల బాబా, ప్రకృతి బీభత్సాలని శాసించగల బాబా, ఆఖరికి కాలధర్మానికి కట్టుబడిపోయారు.1918ఆశ్వయుజమాసం.దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి.
తాత్యా హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఒక్కసారిగా చలిజ్వరం చుట్టుకుందయన్ని. ఇంట్లో కుప్పకూలిపోయాడు. ఆ దృశ్యాన్ని దివ్యదృష్టితో చూశారు బాబా.
ఆయన అప్పుడు ద్వారకామాయిలో ఉన్నారు. కళ్ళు మూసుకున్నారు బాబా. ముందుకు బలంగా చేయి జాచారు. అక్కడ ఉన్నదేదో తీసుకుంటున్నట్టుగా తీసుకుని, అది బయటపడకూడదన్నట్టుగా పిడికిలి బిగించారు. గుండెకు దగ్గరగా చేతిని తీసుకుని వచ్చారు.
గుండెల మీద చేతిని ఉంచి, పిడికిలి విప్పారు. అంతే! బాబా హఠాత్తుగా జ్వరపడ్డారు. విపరీతమయిన జ్వరం. ఒళ్ళు కాలిపోతోంది. దగ్గడం కూడా ప్రారంభించారు బాబా.
దగ్గి దగ్గి నీరసించిపోయారు. అంత నీరసంలోనూ భక్తులను కాదనలేదాయన. దర్శనభాగ్యం అందజేస్తూనే ఉన్నారు.‘‘విశ్రాంతి తీసుకోండి బాబా’’ అందామనుకున్నాడు శ్యామా. ఆ అవకాశమే లేదు.
పోటె త్తినట్టుగా భక్తులు వచ్చి పడుతున్నారు. బాబా స్థితికి జాలి చెందాడు శ్యామా. అంతలో రామచంద్రపాటిల్ వచ్చాడక్కడకి. ఆందోళనగా ఉన్నాడతను. బాబాని కలిసేందుకు ప్రయత్నించాడు. వీలుకాలేదు.
భక్తులు వరుసలో నిల్చుని, బాబాని దర్శించుకుని వెళ్తున్నారు. తోసుకుని ముందుకు వెళ్ళడం మర్యాద కాదు. ఊరుకున్నాడు. అరగంట క్రితం తాత్యాని కలిసేందుకు అతనింటికి వెళ్ళాడు పాటిల్. తీవ్ర జ్వరంతో మంచానికి అతుక్కుపోయి కనిపించాడు తాత్యా. బాబా చెప్పిన విషయం చప్పున గుర్తొచ్చిందతనికి.
అనారోగ్యంతో తాత్యా త్వరలో మరణిస్తాడని కలలో కనిపించి బాబా చెప్పారు. అదిప్పుడు నిజమవుతోందని ఆందోళన చెందాడు పాటిల్. భయపడ్డాడు. తాత్యాని బతికించుకోవాలనుకుంటూ బాబాని సమీపించాడు.
‘‘బాబా’’ గొల్లుమన్నాడు పాటిల్.‘‘ఏమయింది?’’ ఏమీ తెలియనట్టుగా అడిగారు బాబా.‘‘తాత్యాని కాపాడు బాబా. జ్వరంతో బాధపడుతున్నాడు.’’ అన్నాడు పాటిల్. కన్నీరు పెట్టుకున్నాడు.
ఇక్కడ బాబా, అక్కడ తాత్యా ఒకేసారి జ్వర పడడం శ్యామాకి ఆందోళన కలిగించింది.‘‘కాపాడు బాబా, తాత్యాని కాపాడు.’’ బాబా పాదాల్ని చుట్టుకున్నాడు పాటిల్.‘‘ఎందుకంత కంగారు? తాత్యాని బాబా తప్పకుండా కాపాడతాడు. లే’’ అని పాటిల్‌ని శ్యామా లేవనెత్తాడు. శ్యామాని చుట్టుకున్నాడు పాటిల్. ఏడుస్తూ ఇలా అన్నాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నీ కొడుకు తాత్యాని నేను కంటికి రెప్పలా కాపాడతాను. ఈ క్షణం నుంచి తాత్యా బాధ్యత నాది.’’
- ‘‘నేనే కాపాడతాను. బయిజాకిచ్చిన మాట తప్పుతానా?’’
- మహిమలు కోరని మమతలు….. సాయి@366 మార్చి 12….Audio
- “నీ దరిదాపుల్లో మరణం లేదు, నా బాధంతా వాడి గురించే”
- ‘‘భయం నా గురించి కాదు, తాత్యా గురించి”
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments