Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పోయాడతను.‘‘రండయితే’’ అన్నాడు. ముగ్గురూ వేపచెట్టు దగ్గరకి వచ్చారు. అప్పుడు అక్కడ బాబాతో పాటు మహల్సాపతి ఉన్నాడు. అప్పాకోతే పాటిల్‌ని చూస్తూనే లేచి నిల్చున్నాడు మహల్సాపతి.‘‘రండి రండి’’ అని ఆహ్వానించాడతన్ని.
అప్పాకోతే పాటిల్ ఆషామాషీ వ్యక్తి కాదు, ఊరిపెద్ద. ధ్యానంలో ఉన్నారు బాబా. అయినా సాహసించి, మాట్లాడాడు మహల్సాపతి.‘‘బాబా! ఈయన ఊరిపెద్ద అప్పాకోతే పాటిల్…’’ అని చెప్పాడో లేదో
మధ్యలోనే మాటందుకున్నారు బాబా.‘‘నా వాళ్ళని నాకే పరిచయం చేస్తున్నావా?’’ అడిగారు. కళ్ళిప్పి నవ్వుతూ చూశారు.‘‘నీ వాళ్ళా!’’ ఆశ్చర్యపోయాడు మహల్సాపతి.
అవునన్నట్టుగా తలూపారు బాబా.‘‘నీ దర్శనానికి మొదటిసారిగా వచ్చారు.’’‘‘ఈ జన్మలో మొదటిసారి. కాని జన్మజన్మలుగా నన్ను దర్శిస్తూనే ఉన్నారు. నాతోనే పుట్టి, నాతోనే గిడుతున్నారు.’’ అన్నారు బాబా. బయిజాబాయిని నవ్వుతూ చూశారు.‘‘ఈమె ఎవరో తెలుసా?’’ అడిగారు మహల్సాపతిని. అతను ఆమె పేరు చెప్పబోయాడు. వారించారతన్ని.‘
‘నేను చెబుతాను, ఈమె పేరు బయిజాబాయి. నా సోదరి.’’ అన్నారు బాబా.‘‘ఆవో బహెన్’’ అని పిలిచారామెను. అనురాగాన్నీ ఆత్మీయతనీ కలగలిపి అభిమానంగా పిలిచేసరికి బయిజాబాయికి కన్నీరాగలేదు.‘‘బాబా’’ అంది.
పరుగున వచ్చి బాబా కాళ్ళ మీద పడింది. ఆమె శిరసును ప్రేమగా నిమిరారు బాబా.‘‘గత జన్మలో నన్నెంతగా అభిమానించావో, ఎంతగా సేవించావో అంతా గుర్తు పెట్టుకున్నాను. కంటికి రెప్పలా కాపాడావు. కన్నతల్లిలా చూశావు.’’‘‘బాబా’’‘‘జన్మజన్మలకూ నన్ను అంటిపెట్టుకునే ఉండాలన్నావు. చాలా చిన్న కోరిక అన్నావు. తీర్చాలన్నావు. తీర్చానా లేదా?’’ అడిగారు బాబా.బయిజాబాయికి ఆనందంతో నోట మాట లేదు. వింటున్న వారు కూడా మూగబోయారు.
అప్పాకోతేపాటిల్ బాబాని దర్శించుకునేందుకు వచ్చాడనగానే గ్రామంలోని మరి కొందరు పెద్దలు కూడా బాబాని చుట్టు ముట్టారు. వారికి బాబా మాటలు పిచ్చి పేలాపనలనిపించాయి.జన్మజన్మల బంధం ఏమిటి? బాబాని బయిజాబాయి కన్నతల్లిలా చూడడం ఏమిటి? అంతా అబద్ధం అనుకున్నారు.‘‘కాదు’’ అన్నారు బాబా అందరికీ సమాధానం చెబుతున్నట్టుగా. ఆ మాటకి విస్తుపోయారంతా.
‘‘ఈ గురుస్థానం సాక్షిగా చెబుతున్నాను. నేను చెప్పింది నిజం. ఈ బయిజా గత జన్మలో గోవుగా పుట్టింది. పాలిచ్చి నన్ను పెంచింది.’’ అన్నారు బాబా. బయిజాని కరుణార్ద్రంగా చూశారు. తర్వాత ఆమె పక్కగా నిల్చుని గుప్పెటలోని గోళీలు చూసుకుంటున్న తాత్యాని దగ్గరగా తీసుకున్నారు. వాడి వీపుని నిమురుతూ బయిజాతో ఇలా అన్నారు బాబా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (3వ. భాగం)
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (2వ. భాగం)
- సర్వరోగ నివారిణి ధుని (1వ. భాగం)
- బాబా దేవుడు. ఆయనకి మరణం లేదు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments