శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము (3) వాక్కు 2వ.భాగమ్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (3) వాక్కు – (2వ. భాగం)

ఆంగ్ల మూలం: లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

ఎల్లపుడు సత్యమునే పలుకవలెను:

మన పురాణాలు, వేదాలే కాకుండా అన్ని గ్రంధాలలో కూడా ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెనని మరీ మరీ నొక్కి వక్కాణించబడింది.  మన జాతీయ ధర్మ సూత్రం కూడా ‘సత్యమేవ జయతే’ (ఎప్పటికీ సత్యమే జయిస్తుంది).  మహాభారతంలో పాండవులలో అగ్రజుడయిన ధర్మరాజు గురించి మనకు తెలుసు.  ఆయన ఎల్లప్పుడు సత్యమునే పలికేవారు.  ఆయన జీవితంలో ఒక్కసారి మాత్రం అసత్యమాడినందువల్ల నరకంలో కొద్దిసేపు గడపవలసి వచ్చింది.  సాయిబాబా చేసే ఉపదేశాలు  ఎప్పుడూ వాస్తవంగాను, ఆచరణాత్మకంగాను ఉంటాయి.  ఆయన ఎప్పుడూ తన భక్తులకు అసత్యమాడవద్దనీ, ఎప్పుడూ సత్యమునే పలుకమని మాటలద్వారా చెప్పలేదు.  కాని భక్తులందరికీ సాయిబాబా అంతర్ జ్ఞాని అని తెలుసు.  (ఆయన అందరి హృదయాలలోను నివస్తుండటం వల్ల అందరి విషయాలు ఆయనకు తెలుసు) అందుచేత ఎవరు అసత్యమాడినా ఆయనకు వెంటనే తెలిసిపోతుంది.  అందువల్లనే ఎవరూ కూడా ఆయన సమక్షంలో అసత్యమాడే ధైర్యం చేయరు. అప్పుడు ఆకాలంలో ఎవరూ అంత ధైర్యం చేయలేదు.  మరి ఈ రోజులలో కూడా మనం ఆవిధంగానే ఉండాలి.  బాబా మన హృదయంలోనే నివిసిస్తూ ఉన్నారని మనం ప్రగాఢంగా విశ్వసిస్తుంటె మనం ఆ విధంగా చేయగలమా?  అంతేకాదు , బాబా మన ఎదురుగా ఫోటోలో ఉన్నా ఆయన మన ఎదురుగానే  సజీవంగానే ఉన్నట్లే కదా?  అటువంటి పరిస్థితులలో కూడా మనం అసత్యమాడే ధైర్యం చేయగలమా? శ్రీసాయి సత్ చరిత్ర మూలగ్రంధం మరాఠీలో హేమాడ్ పంత్ తగిన విధంగా చెప్పారు.

    असत्य चालेना साईप्रति I अस्त्ये नाहीम साईची प्राप्ति

    असते जाणो अधौगति  I अंति दुर्गति असत्ये  II 138 II

అసత్య చాలేనా సాయీప్రతి I అసత్యే నాహీమ్ సాయీచీ ప్రాప్తి

అసత్యే జాణో అధౌగతి I అంతి దుర్గతి అసత్యే II  (138 II

(సాయి ముందు అబద్ధమెన్నటికీ పనిచేయదు.  అబధ్ధంతో సాయిని పొందలేవు.  అబద్ధమాడటమంటే అది పతనమే.  అబధ్ధం చివరికి నరకానికి తీసుకొని వెడుతుంది)

रवोटे सांगूनि भागेना काज I साई महराज सर्वसाक्षी  II 49 II

(రవోటే సంగూని భాగేనా కాజ్   సాయి మహరాజ్ సర్వసాక్షి)

అసత్యమాడి విజయాన్ని సాధించడం అసంభవం.  సాయిబాబా సర్వసాక్షి – సర్వజ్ఞుడు.

అయినప్పటికి సాయిబాబా గారు కూడా తన జీవితంలో అసత్యమాడిన సంఘటనలు ఉన్నాయి.  శ్యామాకు మేలు చేయడానికి అతని చేత విష్ణుసహస్రనామ పారాయణ ప్రారంభింపచేయడానికి రామదాసి వద్దనున్న పుస్తకాన్ని (భగవద్గీత తరువాత ముఖ్యమయినది) ఇవ్వదలచుకొన్నారు.  అందుచేత బాబా రామదాసిని పిలిచి తనకు కడుపులో నొప్పిగా ఉన్నదని అసత్యమాడి, బజారుకు వెళ్ళి సోనాముఖి తెమ్మని చెప్పారు.  రామదాసి బజారుకు వెళ్ళగానే బాబా తన ఆసనాన్నుండి లేచి, విష్ణుసహస్రనామ పుస్తకాన్ని తీసి శ్యామాకిచ్చారు.  కాని, శ్యామా దానిని తీసుకోవడానికిష్టపడలేదు. (అధ్యాయం -27).  అదే విధంగా జామ్నేర్ లో నానా చందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవం కోసం వెంటనే ఆమెకు ఊదీ, ఆరతిపాట ఇవ్వదలచి బాబాయే స్వయంగా టాంగా తోలేవానిగా వెళ్ళారు.  తనను జామ్నేర్ నుండి బాపుగిర్ గారు టాంగాని, పలహారములని పంపించారని అసత్యమాడారు. (అధ్యాయం – ౩౩ )

ఆయన చేసిన ఈచర్యలలోని గూఢార్ధం ఏమిటి?  వాటిని మనమెలా అర్ధం చేసుకోగలం?  మొదటిది, సాధువులు, సత్పురుషులు తాము చేసిన ఈచర్యల పర్యవసానాలకు వారు బాధ్యత వహించాలని లేదు.  అవి మంచివయినా, చెడువయినా కారణం, ఈ పనులు తామే స్వయంగా చేశామని కూడా చెప్పరు.  ఇక రెండవది, వారు చేసిన పనులు పాపాత్మకమయినవైనప్పటికీ, వాటివల్ల కలిగే పర్యవసానాలను కూడా తమ భక్తుల క్షేమంకోసం భరించడానికి కూడా సిధ్ధపడతారు.  ఇక పైన చెప్పుకొన్నవాటిలో మొదటి విషయానికి వస్తే, తన భక్తుడయిన శ్యామాను ఆధ్యాత్మిక మార్గలోనికి తీసుకొని వచ్చి, అతని చేత సాధన చేయిద్దామనే ఉద్దేశ్యంతో ఈవిధంగా నాటకమాడారు. సామాన్యంగా మాటలతో ఇచ్చే సలహాల యొక్క ప్రభావం అంతగా పనిచేయదు. ఇక రెండవ సందర్భం – జామ్నేర్ లో మైనతాయి ప్రసవం కష్టమయి వేదనపడుతున్న సమయంలో, సుఖప్రసవం కలిగించి తన కుమార్తెను కాపాడమని నానాసాహెబ్ చందోర్కర్ మనఃస్పూర్తిగా ఎంతో ఆవేదనతో చేసిన ప్రార్ధనలకి సాయిబాబా స్పందించారు.  జామ్నేర్ 100 మైళ్ళ దూరంలో ఉంది.  అంత రాత్రి వేళ ఊదీ, ఆరతిపాట అత్యవసరంగా ఆమెకు చేరవలసి ఉంది.  బాబా, బాపుగిర్ బువాను అంతవేళకాని వేళలో అతని స్వగ్రామానికి వెళ్ళమని ప్రేరేపించడమే కాకుండా, జలగావ్ రైల్వేస్టేషన్ నుండి జామ్ నేర్ వెళ్లడానికి టాంగావాలాగా వచ్చి సహాయం చేశారు.   తనను నానాసాహెబ్ చందోర్కర్ టాంగానిచ్చి పంపించాడని బాపుగిర్ బువాను నమ్మించడానికి బాబా అసత్యమాడారు.  ఆవిధంగా సాదు సత్పురుషులయిన వారు తమ భక్తులకు ఆపత్కాల సమయంలో సహాయం చేయడానికి ఏమయినా చేయగలరు. సాధువులయిన వారు తమ భక్తులకు వచ్చిన ప్రమాదకరమయిన, బాధాకరమయిన రోగాలను తాము ఇష్టపూర్వకంగా తమ మీదకు తీసుకొని వారిని రక్షించిన సందర్భాలను గురించి మనం వినలేదా?  దాదాసాహెబ్ ఖాపర్దే చిన్న కొడుకుకు ప్లేగు వ్యాధి సోకినప్పుడు అతనికి వచ్చిన నాలుగు బొబ్బలను బాబా తనమీదకు తీసుకొని, ఇష్టపూర్వకంగా ఆయన ఆబాధననుభవించారు. (అధ్యాయం – 7).  అటువంటప్పుడు సాధుసత్పురుషులయినవారు తమ భక్తుల క్షేమం కోరి పాపపు పనులు చేసినా వాటివల్ల వచ్చే పరిణామాలను కూడా అనుభవించడానికి ఏవిధంగాను సంకోచించరు.

(ఇంకా ఉంది)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles