Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (3) వాక్కు – 3వ.భాగమ్
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజమే చెప్పడం – నిజమే తప్ప మరేమీ చెప్పకపోవడం : –
మన దైనందిన జీవితంలో ఈ విధంగా ప్రవర్తించడం ఒక్కొక్కసారి సమస్య కూడా అవుతుంది. ఈ రోజుల్లో చిల్లర నాణాల కొరత బాగా ఉందని మనకందరికీ తెలుసు. మనం బస్సులో కాని, రిక్షాలో గాని, ఆటోలో గాని వెడుతున్నపుడు, కండక్టరుగాని, రిక్షా తొక్కేవాడు గాని, ఆటోవాడు గాని, తమ దగ్గర చిల్లరలేదని దానికి సరిపడ డబ్బు ఇవ్వమంటారు. మన దగ్గర చిల్లర ఉన్నాగాని మరలా మనకి తిరుగు ప్రయాణానికి కావలసి ఉంటుందని, మనం లేదని అబధ్ధం చెబుతాము. అప్పుడు ఆ పరిస్థితి అటువంటిది. మాకు తిరుగు ప్రయాణానికి చిల్లరకావాలి అందుచేత ఇవ్వడానికి కుదరదని నిజం చెప్పలేము. అబధ్ధమాడాల్సిన పరిస్థితి. ఒకవేళ నిజం చెబితే వచ్చేటప్పుడు కష్టపడాలి. ఒక్కొక్కసారి మనం ఆటో అతనికి డబ్బు ఇచ్చేముందు చిల్లర ఉందా అని అడిగినప్పుడు ఉన్నా లేదని చెపుతాడు. ఆ విధంగా చెప్పి మనకి ఇవ్వవలసిన చిల్లర ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. చిల్లర ఉందా అని అడగకుండా డబ్బు ఇచ్చినపుడు మనకి రావలసిన చిల్లర చేతిలో పెడతాడు. ఒక్కొక్కసారి ఇటువంటి సందర్భాలు కూడా మనకి అనుభవమవుతూ ఉంటాయి. వాస్తవానికి కండక్టరుగాని, రిక్షాతోలేవాడు గాని, ఆటోవాళ్ళు గాని తమ వద్ద చిల్లర లేదని చాలా సార్లు మోసం చేస్తూనే ఉంటారు. అందుచేత మనం ఏమి చేయాలి? ‘సత్యంవద’ (ఎప్పుడూ సత్యమునే పలుకుము).
మరొక ఉదాహరణ: మన మనవడు లేక మనవరాలు (మన పిల్లలయినా) బొమ్మలు గీసుకుంటాను తెల్ల కాగితాలు కావాలి అని అడిగారనుకోండి. మామూలుగా మనం ఏమి చేస్తాము? ఒకటి రెండు సార్లు ఇస్తాము. ఇక కాగితాలు అయిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి. అప్పుడు మనం ఏమని చెబుతాము? ఇంట్లో ఉన్న కాగితాలు అలా ఇచ్చివేస్తూ ఉంటే ఆఖరుకు అవి అయిపోయి, ఈ ముసలితనంలో మనం బజారుకు వెళ్ళి మళ్ళీ మళ్ళీ కొనుక్కుని రావలసి వస్తుంది. అందుచేత ఇంటిలో కాగితాలు ఉన్నా గాని లేవని మనం అబధ్ధమాడినపుడు, సత్యమునే పలుకుము అన్న సూత్రాన్ని మనం అతిక్రమించినట్లే కదా? మరొక ఉదాహరణనే తీసుకుందాము. ఇంటిలో చాక్లెట్లు ఉన్నాయనుకోండి. పిల్లలకి ఒకటి లేక రెండు ఇస్తాము. పిల్లలు మళ్ళీమళ్ళీ అడిగారనుకోండి. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంక లేవు అయిపోయాయి మళ్ళీ తేవాలి అని అబధ్ధం చెబుతాము. మరి మనం ఏమి చేయాలి? ఇక్కడ సత్యమునే పలకవలెను అనే సూత్రాన్ని పట్టుకొని ఉన్న చాక్లేట్లన్ని ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తూ ఉంటే వారి ఆరోగ్యాన్ని మనమే చేజేతులా పాడుచేసినవారమవుతాము. అలాంటి పరిస్థితులలో అసత్యమాడక తప్పదు.
పైన చెప్పిన చర్చలనే గనక పరిగణలోకి తీసుకొంటే నా స్వంత అభిప్రాయాలను వివరిస్తున్నాను. ఎవరయినా సరే ఎప్పుడూ నిజమే చెప్పాలి. ఎప్పుడూ అబధ్ధం చెప్పకూడదు. అది తమ స్వలాభం కోసమయినా సరే. కానీ, అది ఇతరులకు లాభం చేకూరుస్తుంది అనుకుంటే చిన్న అబద్ధమాడినా తప్పు లేదు. ఉదాహరణకి ఎవరికయినా మనం ఒక చెడు వార్తని చెప్పవలసి వచ్చినపుడు, ఆవార్త వినడం వల్ల ఆవ్యక్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉండవచ్చు. (ఆవ్యక్తికి రక్తపోటు, గుండెజబ్బులలాంటివి ఉండవచ్చు). అటువంటి సందర్భాలలో చెడువార్త గురించి పూర్వాపరాలు ఏమీ చెప్పకుండా, అటువంటిదేమీ జరగలేదని, లేకపోతే ఆ విషయం గురించి మనకేమీ తెలియదనే చిన్న అబధ్ధం ఆడవచ్చు.
అదేవిధంగా ఎవరయినా మనకి ప్రేమతో, అభిమానంతో తినడానికి ఏమయినా పెట్టరనుకోండి. దాని రుచి మనకి అంతగా నచ్చనప్పుడు ఏమి చేయాలి? ఆ పదార్ధం బాగులేదని వారి మొహం మీదనే చెబితే వారి మనసుని బాధపెట్టినవాళ్ళమవుతాము. అలా కాక చిరునవ్వుతో అది చాలా రుచిగా ఉందని పొగిడి చిన్న అబధ్ధం ఆడితే వారెంత సంతోషిస్తారు? అటువంటి చర్యలని మన శాస్త్రాలు కూడా సమర్ధించాయి.
सस्तस्य वचनं श्रेय: सत्यादपि हितं वदेत I
यम्दूत हितम त्यंनतमेतत्सत्यं मत मम !
महाभारत शांतिपर्व
(నిజం చెప్పడం మంచిది. కాని, ఏది చెబితే అది ఇతరులకు మేలు చేస్తుందో అది ఇంకా మంచిది. నా అభిప్రాయం ప్రకారం సకల జీవులకు అంతిమంగా సంక్షేమాన్ని కలిగించడానికి ఏదయితే చెబుతామో అదే నిజమైన నిజం.)
सत्यं ब्रयात प्रियं ब्रयात् न बरत्रट्यात् सत्यमप्रियम् II 134II
मनुष्म्रुति अ. 34
(ఎవరయినా నిజమే మాట్లాడాలి. ఎదటి వారికి అంగీకారయోగ్యమైనది, సంతోషాన్ని కలిగించేదే మాట్లాడాలి. ఎప్పుడూ కూడా అవతలి వారికి సమ్మతం కాని, సంతోషాన్ని కలిగించని నిజాన్ని చెప్పకూడదు.)
(ఇంక ఉంది)
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (3) వాక్కు 1వ.భాగమ్–Audio
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము (3) వాక్కు 2వ.భాగమ్
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (3) వాక్కు – (4వ. భాగం)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (3వ.భాగమ్)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం(7వ.భాగమ్)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments