Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘యాఁ అల్లాహ్‌ఁ’’ అన్నారు ‘‘బాబా’’. పాటిల్ బాబా కాళ్ళ మీద పడ్డాడు. నిప్పు, నీరు పుట్టించగలవాడు దేవుడే! అనుమానం లేదనుకున్నాడు పాటిల్.
బాబా కాళ్ళను కళ్ళకద్దుకున్నాడు.‘‘నువ్వు ‘అల్లా” వు బాబా! లేదంటే నీ రూపంలో అల్లా ఇక్కడ కొలువయ్యాడు.’’ అన్నాడు పాటిల్. బాబా కాళ్ళను శిరసునకు ఆనించుకున్నాడు.
‘‘లే, కూర్చో’’ అన్నారు బాబా. పాటిల్ చేతులు జోడించే కూర్చున్నాడు.‘‘తాగు’’ చిలుం అందించారు బాబా. ముందు తాగాలా? వద్దా? అని సందేహించాడు పాటిల్. తర్వాత దైవప్రసాదం అనుకుని తాగాడు. హాయిగా ఉంది.
‘‘బాబా’’‘‘అడుగు’’‘‘మీ ఇల్లెక్కడ బాబా?’’ అడిగాడు పాటిల్. సమాధానంగా ఆకాశాన్ని చూపించారు బాబా. తర్వాత నవ్వుతూ ఇలా అన్నాడు.‘‘ఈ భూమండలం అంతా నాదే! నా ఇల్లే’’
‘‘ఈ భూమండలం అంతా మీ ఇల్లు అయినప్పుడు, మరి నాతో మా ఇంటికి రారాదూ?’’ అడిగాడు పాటిల్. కళ్ళు మూసుకున్నారు బాబా.‘‘షిరిడిలో మా చెల్లెలు పెళ్ళి. మనం అంతా ఆ పెళ్ళికి తరలి వెళ్దాం.’’ అన్నాడు. షిరిడి అనగానే కళ్ళు తెరిచారు బాబా.
ఆనందంగా ‘వెళ్దాం పద’ అన్నట్టుగా తల ఎగరేశారు. లేచి నిల్చున్నారు. ముందు బాబా, అతని వెనుక బిజిలీతో పాటుగా చాంద్‌పాటిల్…ముగ్గురూ అక్కణ్ణుంచి బయల్దేరారు.కొద్దిరోజులు గడిచాయి.
పెళ్ళివారు షిరిడికి ప్రయాణమయ్యారు. ఎడ్లబళ్ళ మీద ప్రయాణం. పెళ్ళికూతురు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్న పిల్లలు బళ్ళలో కూర్చుని ప్రయాణం చేస్తూ ఉంటే, యువకులంతా కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. ఊరేగింపుగా నడుస్తున్నారు.వేసవికాలం. రోడ్లన్నీ పొడి పొడిగా ఉండి, దుమ్ము రేపుతున్నాయి.
చాంద్‌పాటిల్, బాబాని అంటిపెట్టుకునే ఉన్నాడు. అతనితో పాటుగానే నడుస్తున్నాడు. బాబా నడుస్తున్నారు కాని, అయన లోకంలో అయనన్నారు. ఎవరినీ పట్టించుకోవట్లేదయన. తనని అనుక్షణం పట్టించుకుంటున్న పాటిల్‌ని కూడా చూడట్లేదయన. ఎటో చూస్తూ నడుస్తున్నారు.‘‘తొందరగా నడవండి, మధ్యాహ్నానికల్లా షిరిడికి చేరుకోవాలి.’’ కేకేశారెవరో. నడకలు వేగాన్ని అందుకున్నాయి.
బాబాతో నడవడం ఎవరి వల్లా కాలేదు. అయన నడక ముందు పరుగుదీస్తున్న ఎడ్లబళ్ళు కూడా వెనుకబడ్డాయి. షిరిడికి చేరుకున్నారంతా. ఊరి పొలిమేరల్లోనే పెళ్ళివారిని ఆహ్వానించేందుకు మగపెళ్ళివారు గుంపుగా నిలబడ్డారు. ఖండోబా ఆలయం ముందు కలకలంగా ఉన్నారు.
పెళ్ళివారు వచ్చేశారు! పెళ్ళివారు వచ్చేశారు.హడావుడి పడ్డారు షిరిడి వాసులు.పెళ్ళివారిని పేరు పేరునా ఆహ్వానించసాగారు.
బాబా వారి వంతు వచ్చింది. యువకుడు. ఇరవై ఏళ్ళవాడు. పకీరు. ఏ పేరున పిలవాలయన్ని. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
ఇంతలో మహల్సాపతి వచ్చాడక్కడికి.‘‘ఏమయింది?’’ అడిగాడు. సమస్య చెప్పారు.‘‘అదా’’ అన్నాడు మహల్సాపతి. బాబాని చూశాడు. ఎక్కడో ఎప్పుడో అతన్ని చూసిన జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకంతో పాటు తనని ఆకర్షిస్తున్న ఆ కళ్ళను చూశాడు మహల్సాపతి. ఒకేసారి సూర్యచంద్రుల్ని చూస్తున్నట్టుగా అనిపించింది. ఆ వెలుగుల్ని తట్టుకోలేకపోయాడు. చేతుల్ని కళ్ళకి అడ్డం పెట్టుకున్నాడు. తర్వాత అవే చేతుల్ని జోడించాడు.
‘‘ఆవో సాయి’’ అన్నాడు. ఆహ్వానించాడయన్ని.
షిరిడిలో సాయిబాబా పాదం మోపాడు. పులకించిపోయింది ఆ నేల.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మహల్సాపతి ఆహ్వానం ఆవోసాయి (1వ. భాగం)
- మహల్సాపతి ఆహ్వానం ఆవోసాయి
- “తాత్యాని బాబా తప్పకుండా కాపాడతాడు. లే’’
- భక్త మహల్సాపతి 6వ బాగం..
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (1వ. భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments