శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (5వ.భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (5వ.భాగం)

ఆంగ్ల మూలం : లెఫ్టినెంట్ కల్నల్ ఎం.బి. నింబాల్కర్ 

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 

అన్నదానము :

ఆఖరుగా, బాబా అన్నదానం గురించి ప్రముఖంగా చెప్పారు.  వేరువేరు యుగాలలో ఆచరించవలసిన వేర్వేరు సాధనాల గురించి మన ప్రాచీన గ్రంధాలలో వేదాలలో నిర్దేశింపబడ్డాయి.   కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము.  ప్రస్తుతం కలియుగంలో దానము.  అన్ని దానాలలోకెల్ల అన్నదానము శ్రేష్ఠమయినది.  మధ్యాహ్నం వేళ మనకు భోజనం లేకపోతే చాలా బాధపడతాము.  అలాగే ప్రాణులన్నీకూడా అదే రీతిలో ఆహారం దొరకకపోతే ఆకలితో బాధపడుతూ ఉంటాయి.  ఈ విషయం గ్రహించుకుని ఎవరయితే ఆకలితో ఉన్నవారికి, బీదవారికి అన్నం పెడతారో వారే గొప్పదాత.

తైత్తరీయ ఉపనిషత్తులో “అన్నం పరబ్రహ్మ స్వరూపం”, అన్నం నుండే అన్ని జీవులు జన్మిస్తున్నాయి, జన్మించాయి.  అన్నం లోనే అవి జీవిస్తాయి, మరణిస్తాయి, మరలా అన్నంలోనే అవి ప్రవేశిస్తాయి” అని చెప్పబడింది.

ఇతర దానాలు అనగా, ధనం దానం చేయుట, ఆస్తి, దుస్తులు మొదలైనవి దానం చేసేటప్పుడు పాత్రనెరిగి దానం చేయాలి. వీటిని దానం చేసేటప్పుడు వివేకంతో వ్యవహరించాలి.  కాని ఆహారం విషయంలో ఇవేమీ పరిగణలోకి తీసుకోనక్కరలేదు.  మధ్యాహ్నం వేళ మనింటికి ఎవరు వచ్చినా సరే వారికి భోజనం పెట్టవలసినదే.   ఒకవేళ అంగవికలురు, గ్రుడ్డివారు, రోగిష్టులు గాని వచ్చినట్లయితే ముందుగా వారికి  పెట్టిన తరువాతే, మిగిలినవారికి అనగా ఆరోగ్యవంతులకు, తరువాత మన బంధువులకు పెట్టాలి.   అధ్యాయం – 38

తార్ఖడ్ గారి భార్య ఆమె భోజనం చేసే వేళకి ఒక కుక్క ఆకలి తీర్చినపుడు, సాయిబాబా ఎంతగా సంతోషించారో మనకు గుర్తుకొస్తుంది.  (అధ్యాయం – 9).  “నువ్వు ఎల్లప్పుడూ ఈవిధంగానే చేస్తూ ఉండు.  నువ్వు చేసే మంచిపని నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.  మొదటగా ఆకలితోనున్న వారికి రొట్టెనిచ్చి ఆతరువాతనే నీవు తిను” అన్నారు బాబా.

అదే విధంగా లక్ష్మీబాయి షిండే బాబా కోసం వండి తెచ్చిన రొట్టె, కూరలను బాబా,  కుక్కకు పెట్టడంతో, లక్ష్మీబాయి షిండేకి కోపాన్ని కలిగించింది.  అపుడు బాబా ఆమెకు ఏమని బోధించారో మనకందరకూ తెలిసినదే –“ఏమీలేనిదానికెందుకు బాధపడతావు? ఆకుక్క ఆకలి నా ఆకలి ఒకటే.  అయితే కొంతమంది మాట్లాడగలరు, కొంతమంది మూగగా ఉంటారు.  జీవరాశులన్నిటి ఆకలి సమానమే.  ఎవరయితే ఆకలిగొన్నవారికి ఆకలి తీరుస్తారో వారు నా ఆకలిని తీర్చినట్లేనని నిశ్చయంగా తెలుసుకో” అన్నారు బాబా.

ఈవిషయంలో బాబా తనే స్వయంగా చేసి చూపించారు.  ప్రారంభంలో తరచూ ఆయనే పెద్ద పెద్ద గుండిగలలో వంట చేసి బీదవారికి, నిస్సహాయులకి భోజనాలు పెడుతూ ఉండేవారు. బాబా బజారుకు వెళ్ళి పప్పుదినుసులు, మసాలా సరుకులు కొని తెస్తూ ఉండేవారు.  తానే స్వయంగా తిరగలిలో విసరుతూ ఉండేవారు. తరువాత భక్తులు అధిక సంఖ్యలో షిరిడీకి రావడం ప్రారంభమయింది.  భక్తులందరూ నైవేద్యం కోసం ఎన్నో పదార్ధాలను తీసుకొస్తూ ఉండేవారు.  అందుచేత బాబాకు ఇక వండే అవసరం లేకపోయింది.  అయినప్పటికి నైవేద్యం కోసం తెచ్చిన పదార్ధాలను అందరికీ పంచిపెట్టడం మాత్రం మానలేదు.  ఆయన కొద్దిగా మాత్రమే రుచి చూసేవారు.

ముగింపుః

బాబా చెప్పిన సలహాలన్నీ కూడా ఎప్పుడూ ఆచరణాత్మకంగాను. వాస్తవికంగాను ఉండేవి.  దానం గురించి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి చెప్పినా గాని, అతిగా చేసి అప్పుల పాలవద్దని హెచ్చరించారు.  (భక్త లీలామృతం – దాసగణు అధ్యాయం – 32).  ఆయన చెప్పిన సలహాలోని అతి ముఖ్యమయిన అంశం ఆహారం గురించి.  ఆహారం ఏది వడ్డించబడినా దానితోనే తృప్తిపడటం నేర్చుకోమని బోధించారు. అంతేగాని జిహ్వ చాపల్యంతో నాకు ఫలానా పదార్ధం కావాలి, ఇప్పుడు మీరు వడ్డించిన పదార్ధం నాకు ఇష్టం లేదు అని నిరసన వ్యక్తం చేసినట్లయితే బాబా  చెప్పిన సలహాను పాటించనట్లే.  అందుచేత బాబా ఇచ్చిన సలహాలని తూచా తప్పక పాటించినట్లయితే మనకి ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాక, ముక్తికోసం మనం చేసే ప్రయత్నాలలో కూడా సహాయపడుతుంది.

(ఇంతటితో ఆహారం గురించిన విషయాలు సమాప్తం)

(రేపటి సంచికలో మూడవ విషయం వాక్కు – Speech)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.co

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles