Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఊదీని నుదిటి మీద రాయండి. శరీరంలో యేప్రాంతములో బాథ ఉంటే అక్కడ ఊదీని రాయండి. నీటిలో ఈ పవిత్రమైన ఊదీని కలిపి ఇవ్వండి. ఊదీ అత్యంత శక్తివంతమైన రోగ నివారిణి. బాబా గారు జీవించి ఉన్నప్పుడు, ఆయన లక్షల మందికి ఊదీ ద్వారా నయం చేశారు. ఇప్పుడు కూడా యెంతోమంది ఊదీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఫలితాన్ని పొందుతున్నారు. మీరు సరాసరి షిరిడీ నించి గాని, దగ్గిరలో నున్న బాబా గుడి నుంచి గాని ఊదీని పొందవచ్చు, ఊదీ దొరకని సందర్భాలలో, అగర్ బత్తి వెలిగించి రాలిన బూడిదని బాబాని స్మరించి దానినే ఊధిలా ఉపయోగించండి. ఊదీని నీటిలో కలిపి సేవించిన వారికి బాబా గారు యెన్నో అథ్భుతాలు చేశారు.
2.నీటి పై, తన కరుణాదృక్కులు సారించమని బాబాని ప్రార్థించండి.
మీకు దగ్గరిగా ఉన్నవారితో ఒక గ్లాసు నిండా నీటిని పట్టుకొనమని చెప్పండి. ఆ నీటిని తన కరుణా దృక్కులతో పవిత్రం చేయమని బాబాను మనస్పూర్తిగా వేడుకొని, ఆనీటిని రోగి చేత త్రాగించండి. బాబా ఫొటో ముందు గ్లాసులో నీరు ఉంచి, ఆయన పవిత్రం చేసినట్టుగా భావించి, ఆనీటిని త్రాగండి. యెప్పుడైనా యెవరికైనా గాని మందులు ఇచ్చేటప్పుడు, వాటిని బాబా పాదాల వద్ద ఉంచి ఇవ్వండి.
3. బాబా మందిరాన్ని దర్శించండి, దీపాలను వెలిగించండి, యింటి వద్ద ప్రార్థించండి.
దగ్గిరలోఉన్న బాబా మందిరాన్ని దర్శించి, దీపాలను వెలిగించండి. మీ శక్త్యానుసారం అన్నదానం చేసి ప్రసాదాన్ని, అనారోగ్యంతో ఉన్నవారికి ఇవ్వండి. ఒకవేళ దగ్గిరలో బాబా మందిరము యేమీలేకపోతే, మీ ఇంటిలోనే బాబా విగ్రహము ముందుగాని, ఫోటో ముందుగాని, దీపాలను వెలిగించి, పండ్లు నైవేద్యముగా సమర్పించి, ఆ ప్రసాదాన్ని ఇవ్వండి.
అనారోగ్యంతో ఉన్నవారికి సచ్చరిత్రనివ్వండి. పుస్తకము దొరకని సందర్భాలలో ఆన్ లైనులో ప్రింట్ తీసి ఇవ్వవచ్చును. (సచ్చరిత్ర దొరకకపోవడం ఉండదేమో అనుకుంటున్నాను) వారికి చదవడం రాకపోయినా సరే, సచ్చరిత్ర దగ్గర ఉంటే చాలు. బాబా గారు దగ్గిరున్నట్లే. బాబాకి తెలుసు యెవరిని రప్పించాలో వారిని రప్పించి చరిత్ర చదివిస్తారు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చేత కూడా చదివిస్తారు.
5. బాబా లీలలు, కథలు, సంఘటనల గురించి చెప్పండి.
షిరిడి సాయిబాబా శక్తి గురించి యెల్లప్పుడూ మాట్లాడండి. వీలయితే, మీ స్నేహితులు, బంథువులు వారికి జరిగిన బాబా అనుభూతులు, లీలలు, లేక మీరు చదివిన బాబా లీలలు, లేక సచ్చరిత్రలోని సంఘటనల గురించి చెప్పండి. బాబా గారు సహాయం చేసి రోగాలను యెలా తగ్గించారో చెప్పండి. బాబాగారు యేవిథమైన మాయలు, మంత్రాలు, చేయలేదని చెప్పండి. నివారణా శక్తి వారి మనసులోనే ఉందని చెప్పండి, యెందుకంటే బాబా గారు, అంతర్వాసిని, అనగా మన మనసులోనే ఉన్నారు. వారి మనసు కనక యెల్లప్పుడు సాయి ఆలోచనలతోనే నిండి ఉండి, యెల్లప్పుడు, సాయినామాన్నే స్మరిస్తూ, సాయీ, సాయీ, సాయీ, అని సహాయాన్ని అర్థిస్తే తప్పకుండా బాబా గారు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఇంతే కాకుండా అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో ఓర్పుతోనూ, సహనంతోనూ ఉండమని చెప్పండి, బాబా యేదో ఒకరోజున సహాయము చేస్తారని చెప్పండి.
యెల్లవేళలా సాయి మంత్రాన్ని జపిస్తూన్న చాలా మంది భక్తులు, బాబా ఉనికిని, ఆయన లీలలను అనుభవించారు. గంటల తరబడి, సాయి నామాన్ని జపిస్తూ ఉండండి. లేకపోతే మీకు యెప్పుడు, మీ మనసుకు బాబాగారు తలపులోకి వస్తారో అప్పుడు ఆయన నామాన్ని జపిస్తూ ఉండండి. మీరు చేసే నామ స్మరణ, ఇలా ఉండవచ్చు. “సాయిరాం” “ఓం శ్రీ సాయిరాం” “షిరిడీ సాయి ద్వారకామాయి” “ఓంసాయి శ్రీ సాయి జయజయ సాయి” “సాయిబాబా” “సాయి” “సాయినాధ” ఇంక ఏవిధంగానైన స్మరించవచ్చు.
7. బాబా గారు జీవించి ఉన్నప్పుడు 7 రోజులపాటు యేకథాటిగా నామ సప్తాహాన్ని ప్రోత్సహించారు
మనం కనీసం ప్రతిరోజు ఒక్కసారయినా చేయాలి. వైద్యం తీసుకుంటున్న వ్యక్తి కనక సాయి సాయి సాయి అని గుర్తు చేసుకుంటూ ఉంటే దుష్టశక్తులు ప్రవేశించవు. ఆ వ్యక్తి కనక క్లిష్ట పరిస్తితిలో ఉంటే వారి తరఫున మనము చేయవచ్చు. మనకు ఇష్టమైన దేవుని మంత్రాన్ని జపించవచ్చు.
8. షిరిడీ సాయిబాబా పాటలు, హారతులు వినండి.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి యింటిలో కనక ఉంటే హారతులు వినమని చెప్పండి, లేక సీ.డీ ఉంటే పెట్టుకుని చూడమని చెప్పండి. దీని వల్ల మన యింటిలో అనుకూల వాతావరణమేర్పడుతుంది. ఆయన అనుగ్రహ తరంగాలు యింటిలో వ్యాపిస్తాయి.
9. మానవ సేవకి సంబంథించిన పనిలో నిమగ్నం కండి.
సాథ్యమయితే, బీదవారికి అన్నదానం చేయడం, బట్టలు, రగ్గులు అనాథశరణాలయాలలో పంచడం మొదలైన కార్యక్రమాలు చేయండి. మీరు పంచిన వాటిని వారు సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో గమనించండి. యెక్కువగా నిథులను పొందే సంస్థలని మినహాయించండి. పాత్ర దానం చేయాలి. అపాత్ర దానం కూడదు. దానము చేసేటప్పుడు “సాయిరాం” అని దానము చేయండి. బాబా కోరుకునేదిదే. సాయి పేరుతో చేసే దానం శక్తివంతమైనది. దానాలు చేయడం వల్ల పూర్వజన్మ కర్మలు నశిస్తాయి. మనకు తోచినంతలోనే దానం చేయాలి. అంతేగాని ఒక్కసారిగా విపరీతంగా ఖర్చు చేసి దానం చేయనక్కరలేదు.
కొంతమంది గుడిలో ప్రార్థన చేసేటప్పుడు, యితర సమస్యల గురించి ఆలోచించడం, యింకా తమని గమనించే వ్యక్తుల మీద దృష్టి పెడతారు. నువ్వు నమస్కారం చేస్తున్నప్పుడు గాని, సాయి కి నీకు మథ్య అడ్డు తెర అనేది ఉండకూడదు. నీతనువంతా సాయికి అర్పించి నమస్కారం చేయి. సాష్టాంగ నమస్కారం చేయి, సాయి ఇష్ట పడతారు. సాయి ముందు ప్రయత్న పూర్వకంగా యేడవవద్దు. కాని అనుకోకుండా దుఖము గాని యేడుపుగాని వస్తే సిగ్గుపడద్దు. ఒక్కొక్కసారి సాయి మన పూర్వజన్మల పాపాలని కడిగివేయడానికి మన కన్నీటిని ఉపయోగిస్తారు.
సుకన్య …
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 1వ. భాగమ్
- బాబా వారు మాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు …..!
- బాబా స్మరణ మాత్రం చేతనే భయానకమైన Train Accident నుంచి రక్షించబడిన సాయి భక్తులు–Audio
- బాపట్ల హనుమంతరావుగారి జీవితములో కొన్ని సంఘటనలు 1
- సాయి అనుగ్రహం: కొబ్బరికాయ లో దొరికిన ముక్కుపుడక–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments