Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈ రోజు మనం మరొక అధ్బుతమయిన బాబా లీలను తెలుసుకుందాము. బాబా తన అంకిత భక్తులను ఏ విధంగా కాపాడుతూ వస్తారో దానికి ఉదాహరణ శ్రీబాపట్ల హనుమంతరావు గారి జీవితం.
నువ్వు భగవాన్ సాయిబాబాకు ప్రియపుత్రుడవు
జీవితాంతం సాయినాధుల వారి మార్గదర్శకత్వం, ఆయన అనుగ్రహం పొందే అదృష్టం కలిగిన భక్తులు కొద్దిమంది ఉన్నారు. బాబా మహాసమాధి చెందిన తరువాత, బాపట్ల హనుమంతరావుగారి జీవితమే దీనికి ఒక దృష్టాంతం. బాబా తన భక్తులను యిప్పటికీ కాపాడుతూ వస్తున్నారు.
సాయినాధుల వారు మహాసమాధి చెంది 20 సంవత్సరాలయింది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల ప్రాంతం అయిన చిన గంజాంలో హనుమంతరావుగారు తెలుగు పండితులుగా పని చేస్తున్నారు. జీవన సాగరంలో ఆయన ఎన్నోకష్టనష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కూడా ఎంతో నిరాశా నిస్ఫృహలకు లోనయ్యి జీవన సమరాన్ని కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయునిగా తనకు వచ్చే జీతం తన పిల్లలకు కాస్త మంచి చదువు చెప్పించడానికి కూడా సరిపోవకపోవడంతో హనుమంతరావుగారు పొగాకు వ్యాపారాన్ని చేపట్టారు. కాని ఆవ్యాపారంలో చాలా నష్టాలు వచ్చి అధః పాతాళానికి చేరుకొనే దశకి వచ్చారు. దాంతో తీవ్రనిరాశకు గురయ్యి తన జీవితాన్ని అంతం చేసుకుందామనే నిర్ణయానికి వచ్చారు. డిశెంబరు 27, 1944 సంవత్సరంలో శ్రీసాయినాధులవారు ఆయన కలలో దర్శనమిచ్చి “నేను సాయిబాబాను. నీలో పాండిత్యం, కవిత్వంలో ప్రావీణ్యం ఉన్నాయి. గతంలో నీవు చేసినట్లుగానే నువ్వు సాహిత్య రంగంలో నిమగ్నమయి క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టు. నీకు వచ్చిన కష్టాలు, సమస్యల గురించి చింతించకు. ఏసమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు” అని చెప్పి బాబా ఆయనకు రామునిగా, శ్రీకృష్ణునిగా, శివునిగా, హనుమంతునిగా, దత్తాత్రేయునిగా వివిధ రూపాలలో దర్శనమిచ్చి అనుగ్రహించారు. కాని, అప్పట్లో హనుమంతరావుగారికి బాబా గురించి తెలియదు. అందుచేత తనకు వచ్చిన ఆకలకు అంతగా ప్రాధాన్యమివ్వలేదు. మరుసటి రోజు చీరాలనుండి ఆయన స్నేహితుడు ఆదినారాయణ ఆయనకోసం వచ్చారు. శ్రీసాయినాధులవారి తత్వ ప్రచారకులు, అఖిలభారత సాయిసమాజ్ అధ్యక్షులయిన శ్రీ బీ.వీ నరసింహ స్వామి గారు చీరాల వస్తున్నారని, అందుకోసం హనుమంతరావు గారిని ఆహ్వానించడానికి వచ్చినట్లు చెప్పారు. హనుమంతరావుగారిని కలుసుకొని ఆయనకు సహాయం చేయమని సాయిబాబా నరసింహ స్వామీజీ గారిని ఆదేశించారని, ఈ విషయం హనుమంతరావుగారికి చెప్పి తీసుకురమ్మని తనను పంపించారని చెప్పాడు ఆదినారాయణ. తనతో కూడా వచ్చి స్వామీజీ ని కలుసుకొని బాబా దీవెనలు అందుకోమని హనుమంతరావుగారికి చెప్పారు. హనుమంతరావుగారి జీవీతంలో అది ఒక సంతోషకరమయిన సంఘటన. చీరాల చేరుకొని నరసింహ స్వామీజీ ని కలుసుకోగానే ఆయన హనుమంతరావుగారిని ప్రేమగా కౌగలించుకొని అందమైన సాయిబాబా చిత్రపటాన్ని బహూకరించారు. నరసింహ స్వామీ గారు ఆయనతో “హనుమంతరావూ, నువ్వు భగవాన్ సాయిబాబాకు ప్రియపుత్రుడవు. ఆయన నిన్ను తన ఆస్థాన కవిగా ఎంచుకొన్నారు. ఆయన నాకలలో దర్శనమిచ్చి సాయి చరిత్రను తెలుగు భాషలో తీసుకొచ్చే బాధ్యతను నీకప్పగించమని నన్నాదేశించారు. ఆంధ్ర ప్రాంతంలో సాయి తత్వాన్ని వ్యాప్తి చేయడానికి అది దోహద పడుతుంది. ఈ పరిణామం హనుమంతరావుగారి జీవితాన్నే మార్చేసింది. ప్రారంభంలో ఆయన నరసింహ స్వామీజీ గారు ఆగ్లంలో వ్రాసిన కొన్నింటిని తెలుగులోకి అనువదిదంచారు. తరువాత ఆయన చాలా పుస్తకాలను వ్రాశారు. ఆయన వ్రాసినవన్నీ చదివిన తరువాత బాబాతో ఆయనకు ఎంతటి ప్రగాఢమయిన బంధం ఏర్పడిందో అర్ధమవుతుంది. తెలుగులో ఆయన వ్రాసిన వాటిలో ప్రముఖమయినవి 1) ఏమీ! నిన్నుపేక్షింతునా 2) శ్రీసాయి బోధామృతం 3) శ్రీసాయిబాబా కూడా దేవుడేనా 4) శ్రీ సాయి అనుసరణము. ఆయన రచించిన సాయి తత్వంలో సాయి తత్వ కవితాస్తా వైభవం, సాయిబాబా జానపద సాహిత్య భాగాలు, సాయి తత్వాన్ని చాటి చెప్పే వీధి నాటకాలు ఉన్నాయి. ఇవి తెలుగులో సాయి తత్వాన్ని చాటి చెప్పే మూల గ్రంధాలుగా ప్రజాదరణ పొందాయి.
రేపు తరువాయి బాగం ….
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాపట్ల హనుమంతరావుగారి జీవితములో కొన్ని సంఘటనలు 2
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
- గూడు చేరిన పక్షి…..సాయి@366 జనవరి 26….Audio
- గురుభక్తి…..సాయి@366 ఏప్రిల్ 17….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments