బాపట్ల హనుమంతరావుగారి జీవితములో కొన్ని సంఘటనలు 2



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఎప్పుడయితే ఆయన సాయిని గుర్తించారో అప్పటినుండి ఆయన జీవితంలో క్లిష్ట పరిస్థితులను సమస్యలను ఎదురొంటున్నపుడు, సాయినాధులవారు ఆయన జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహించారు. బాబా తన అంకిత భక్తులను ఏవిధంగా అనుగ్రహిస్తారో, హనుమంతరావుగారు బాబా వారి అధ్బుతమయిన లీలలను ప్రత్యక్షంగాను, స్వప్నాలలోను అనుభవించారు. ఆయన పదవీ విరమణ చేసినప్పుడు ఆయనకు నెలకు 37 రూపాయలు పెన్షన్ వచ్చేది. 1962 వ.సంవత్సరంలో ఆయన యింటికి చాలామంది స్నేహితులు, బంధువులు వచ్చారు. అందరూ రోజంతా, రాత్రివరకూ భోజనాలకు ఉండిపోయారు. ఇంటిలో సరుకులన్నీ నిండుకున్నాయి. యింతకుముందు బాకీ ఉన్నందున ఆయనకు బియ్యం, యితర సరుకులు యివ్వడానికి దుకాణదారుడు నిరాకరించాడు. ఈకష్టాన్నుండి గట్టెంక్కించమని హనుమంతరావుగారు బాబా పటం ముందు నిలబడి వేడుకొన్నారు. అరగంటలోనే, యింతకుముందు సరుకులు యివ్వడానికి నిరాకరించిన దుకాణుదారుడే హనుమంతరావుగారి యింటికి వచ్చి బియ్యం బస్తా, యితర సరుకులు తెచ్చి, “రావూజీ! మీ ఎడల అమర్యాదగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించండి. దయచేసి ఈసరుకులు తీసుకోండి. డబ్బు గురించి మీరు చింతించకండి”అన్నాడు. జరిగిన ఈ సంఘటన గురించి ఆయన తెలుగులో అధ్బుతమయిన కవిత్వాన్ని రచించారు. ఒకసారి ఆయన జీవితంలో తాననుభవించిన పేదరికాన్ని తలుచుకొంటూ చిన గంజాం రైల్వే పట్టాల ప్రక్కనే నడచుకొంటూ వెడుతున్నారు. అదే సమయంలో ఒక రైలు వస్తూ ఉంది. సహజంగానే ఆయన చెవిటివారు. ఆలోచనలో నిమగ్నమయి ఉండటం చేత రైలు వస్తున్న చప్పుడు ఆయనకు వినిపించలేదు. యిక రైలు ఆయన మీదకు వచ్చేస్తూ ఉంది. సరిగ్గా రైలు ఆయనను గుద్దేసే క్షణం. వెంట్రుకవాసిలో రైలు ఆయనకు ఢీకొనబోయే క్షణంలో బాబా భౌతికంగా ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను ప్రక్కకు లాగేశారు. హటాత్తుగా జరిగిన ఈ సంఘటనకి ఆయన నిర్ఘాంతపోయారు. వెళిపోతున్న రైలును కొంతసేపటి వరకూ అలా చూస్తూ ఉండిపోయారు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఈ లోకంలోకి వచ్చారు. వెంటనే సాయి కోసం చూశారు, కాని ఆయన అప్పటికే అదృశ్యమయిపోయారు. బాబా తనమీద చూపించిన దయకి ఆయన కవి హృదయం ఉప్పొంగి కళ్ళనుండి ధారగా ఆనంద భాష్పాలు జాలువారాయి.

ఒకసారి ఆయన రచనా వ్యాసంగంలో మునిగి ఉండగా ఒక కుక్క వచ్చి ఆయన చెప్పుల జతలోని ఒక చెప్పును నోటకరచుకొంది. నోట కరచుకొన్న చెప్పును వదలి వేస్తుందనే ఉద్దేశ్యంతో హనుమంతరావుగారు రెండవ చెప్పుని కోపంగా ఆకుక్కమీదకు విసిరారు. ఆకుక్క రెండవ చెప్పును కూడా నోటకరచుకొని పరుగెత్తుకొని వెళ్ళింది. వెంటనే ఆయనకు సర్వత్రా సాయిబాబా వ్యాపించి ఉన్నారని, సకల జీవులలోను సాయి ఉన్నారని జ్ఞానోదయమయింది. తాను చేసిన పనికి ఎంతో విలపించారు. కన్నీళ్ళతో “సాయినాధా, నేను నిన్ను గుర్తించలేక నీమీదకు చెప్పు విసిరాను. ఇంతటి ఘోరాతి ఘోరమయిన తప్పు చేసినందుకు ఈ రోజునుండి నేను చెప్పులు ధరించను” అని శపధం చేశారు. అప్పటినుండి ఆయన మండువేసవిలో కూడా కాళ్ళకు బొబ్బలెక్కుతున్నా లెక్కచేయక చెప్పులు లేకుండా నడిచేవారు. ఒకరోజున ఆయన బస్సునుండి దిగారు. వేసవి కాలం వల్ల ఆరోజు చాలా ఎండగాను, వేడిగాను ఉంది. ఆయన కాలు కింద పెట్టి నడవలేక చెట్టునీడకు పెరుగెత్తుకొని వెళ్ళి బాబాను యిలా ప్రార్ధించారు, “బాబా, విపరీతమయిన ఎండవల్ల నేను నడవలేకున్నాను. దయచేసి నన్ను క్షమించు”. ఆయన అలా ప్రార్ధించారో లేదో వెంటనే ఒక అపరిచిత యువకుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు ఒక చెప్పుల జత పెట్టి “అయ్యా!ఈ చెప్పులు మీకు సరిగ్గా సరిపోతాయి. చెప్ప్లులు లేకుండా మీరు నడవలేని స్థితిలో ఉన్నారు. మీజేబులో ఉన్న రెండు రూపాయలిచ్చి ఈ చెప్పులు ధరించండి” అన్నాడు. తన జేబులో రెండే రెండు రూపాయలున్నయనే విషయం అతనికెలా తెలిసిందని ఆశ్చర్యపోతూ రెండురూపాయలిచ్చారు. తరువాత ఆయనకు తాను సాయిబాబాను ప్రార్ధించిన విషయం గుర్తుకు వచ్చింది. తనకు చెప్పుల జతను యిచ్చినది సాయిబాబాయేనని గ్రహించుకున్నారు. సాయి తత్వాన్ని ఆయన మధించారు. నేటి సాయి భక్తులందరి ప్రేరణకి ముఖ్యంగా భారతదేశంలో తెలుగు మాటలాడే సాయిభకతులందరికి అదే మూలాధారం.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాపట్ల హనుమంతరావుగారి జీవితములో కొన్ని సంఘటనలు 2

sreenivas Murthy

Thank You Sai. Very Nice Leela.

కోన బాలాజీ బాజీ రావు

శ్రీ బాపట్గ హనుమంతరావు గారీ జీవితంలో
అధ్బుతమైన సాయి చమత్కారాలు చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తోంది.
సాయిబాబా అనుక్షణం తన భక్తుడి గురించచే చింతన. మరినిదేమో అఅన్య చింతన. ఇది పోయి సాయితో అనన్య చింతన కావాలని ఆ సాయిమాతని ప్రార్దిస్తున్నాను.
జై సాయి సమర్ద సాయిలీలాస్.కామ్ అధ్బుత, అవిరామ కృషి మాలాంటి వారి కళ్ళు తెరిపించే అశేష లీలలు. ఒక సాయి సురేష్, శ్రీనివాస మూర్తి గార్ల సేవనూ మేమేచ్సి ఋణం తీర్చుకోగలం.
జై సాయి సమర్ద
మీ
సాయి భక్త పాద రేణువు
కోన. బాలాజీ బాజీ రావు
నెల్లూరు
19.11.2016.

sreenivas Murthy

hank You బాలాజీ బాజీ రావు గారు. నిజముగా సాయి సురేష్ చేస్తున్న బాబా వర్క్ అభినందనీయం.
Daily saileelas .com లో వచ్చే బాబా లీలలు egar గా ఎదురుచూసే సాయి devotees ఉన్నందుకు చాలా సంతోషం.
మొన్న (గురువారం) నుండి ఆడియో’స్(saileelas .com ) కూడా డౌన్లోడ్ option ఇవ్వడం జరిగింది.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles