బాబా చూపిన కృప – బాబా దివ్యదర్శనం 1



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

సాయిబంధువులకు ఈ రోజు మరొక అద్భుతమైన బాబా లీలను అందిస్తున్నాను. పిలిచిన వెంటనే నేనున్నను నీచెంత, నీకెందుకా బెంగ అనిపించేలా తక్ష్ణం వచ్చి ఆదుకునే బాబా. అనుకోకుండా ఆయన చేసే అధ్బుతమైన లీలలు జన్మ జన్మలకూ మరపురాని మధురానుభూతులుగానే మిగిలిపోతాయి. అటువంటి అత్యధ్బుతమైన ఒక లీలను ఈ రోజు తెలుసుకొందాము. ఇక చదవండి. ఆనందాన్ని పొందండి.

దయగల సాయికి మొట్టమొదటగా నా వినమ్రపూర్వకమైన ప్రణామములు సమర్పించుకుంటున్నాను. 1960వ.సంవత్సరంలో నెల్లూరు లో మా పొరుగింటివారి ద్వారా నాకు సాయిబాబా గురించి తెలిసింది. వారు నాకు సాయిబాబాను ఆశ్రయించమని సలహానిచ్చారు. క్రమం తప్పకుండా సాయంత్రం వేళల్లో నెల్లూరులో ఉన్న సాయిబాబా గుడికి వెడుతూ ఉండేవాడిని. ముఖ్యంగా గురువారాలప్పుడు మాత్రం అస్సలు మానకుండా వెడుతూ ఉండేవాడిని. 1974వ.సంవత్సరం వరకు బాబా గురించి ఆయన బోధల గురించి తెలుసుకొనే భాగ్యం కలగలేదు. హైదరాబాదులో నా సహోద్యోగి, సాయిబాబా భక్తుడయిన శ్రీ వై.వీ.సుబ్బాయ్య తో నాకు సన్నిహిత సాంగత్యం కలగడం, అది నాకు గొప్ప అదృష్టమనే చెప్పాలి. ఆయన వల్లనే నాకు షిరిడీ దర్సించాలనే కోరిక కలిగిందంటే దానికి ఆయన ప్రేరణే కారణం. షిరిడీ వెళ్ళడానికి అయ్యే ఖర్చులను కూడా నాకు ముందుగానే ఇచ్చారు. అక్టోబరు 1975వ.సంవత్సరంలో నాకు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ షిరిడీ యాత్ర చాలా అద్భుతంగా జరిగింది. అప్పటినుండి నేను శ్రీ సాయినాధులవారినే ఆశ్రయించాను. నిజం చెప్పాలంటే ఆయననే మా కులదైవంగా పూజిస్తూ వంచ్చాను. నా మితృడు శ్రీ సుబ్బయ్య ని చూసే నేను కూడా సాయినాధులవారిని నా దైవంగా ఆరాధించడం ప్రారంభించాను.

సాయిబాబా అనుగ్రహం వల్ల 1975 సంవత్సరం నుండి నాకెన్నో అనుభవాలు కలిగాయి. అన్నీ ఆయనే నాకు. ఆయన ఎప్పుడూ నాతోనే ఉంటూ ప్రతీ విషయంలోనూ నాకు మార్గదర్శకుడిగా ఉన్నారన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆయన అనుగ్రహం నామీద విస్తారంగా కురిపించమని, ఆధ్యాత్మిక మార్గంలోకి నన్నులాగుకొని నన్ను అభివృద్ధిపధంలో నడిపించమని నా హృదయపూర్వకంగా బాబాని ప్రార్ధిస్తున్నాను. సాయి లీల పత్రికలో భక్తుల అనుభవాలను చదివిన తరువాత నాకు కూడా నాకు కలిగిన కొన్ని అనుభవాలను సాయిలీల పత్రిక పాఠకులకి, భక్తులకి వివరంగా చెప్పాలనిపించింది. 1975వ.సంవత్సరం ఆగస్టు నెలలో మొట్టమొదటిసారిగా నేను షిరిడీ యాత్రకు వెడదామని చెప్పడంతో నా భార్య ఇద్దరు అమ్మాయిలు ఎంతగానో సంతోషించారు. కాని జూలై నెల మొదటివారంలో నాభార్యకు అనారోగ్యం చేసి వారం రోజులపాటు విపరీతమయిన జ్వరంతో బాధపడింది. అది మెల్లగా టైఫాయిడ్ లోకి దింపింది. టైఫాయిడ్ వచ్చి రెండు వారాలయింది. ఆకుపచ్చని విరోచనాలు మొదలయి దానితో కొన్ని సమస్యలు ప్రారంభమయ్యాయి. మధ్య మధ్యలో స్పృహతప్పిపోతూ ఉండేది. దాంతో మాకు చాలా ఆందోళన కలిగింది. 1975 జూలై 22వ.తేదీన సాయంత్రం 3 గంటలకు నా భార్య గట్టిగా అరుస్తూ నామీదకు విరుచుకు పడుతూ, “నాముందు గోడ మీద వేళ్ళడుతున్న బాబా ఫోటోను తీసి బయటకు విసరివేయండి” అంది . “బాబా అస్సలు స్పందించటంలేదు. మీరు చేసే పూజలన్నీ వ్యర్ధం. ఫొటోని బయటకు విసిరేయండి” అంది వెక్కుతూ ఏడుస్తూ.

ఆవిడ అలా విరుచుకుని పడటంతో నాకు చాలా దిగ్భ్రమ కలిగింది. ఏంచేయాలో నాకు పాలుపోలేదు. అది ఒక భయంకరమైన పరిస్థితి. అందులో సందేహం లేదు. అనునయంగా ఆమెను సముదాయిస్తూ మెల్లని స్వరంతో ఇలా అన్నాను, “చూడు, నీ గతజన్మల కర్మలను తొలగించుకోవడానికి ఈ విపత్కర పరిస్థితిని తట్టుకునే ధైర్యాన్ని, శక్తిని నీకు యిమ్మనమని, నేను అన్నివిధాలుగాను బాబాని ప్రార్ధిస్తూ ఉన్నాను. నీకు వచ్చిన ఈ వ్యాధిని తొలగించమని గాని, లేక మరొక సందర్భానికి వాయిదా వేయమని గాని ప్రార్ధించడంలేదు. బాబాకి నీమీద దయ లేదని భావించకు. నిన్ను కాపాడటానికి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు ఆయన”.  నామాటలు ఆమె మీద తగినంత ప్రభావాన్ని చూపాయో లేదో నాకు తెలీదు. కొంతసేపటి వరకూ అలా వెక్కుతూ ఏదుస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకొంది. అదే రోజు రాత్రి 10 లేక 11గంటలకు, పడక కుర్చీలో పడుకొని జ్వరంతో బాధపడుతున్న నా భార్యమీద దయ చూపమనీ, బలహీన పడిపోయి ఈ పరిస్థితిని ఆమె యిక తట్టుకోలేదని ఈ కష్టాన్నించి ఆమెని గట్టెక్కించమని కళ్ళు మూసుకొని బాబాని ప్రార్ధిస్తూ ధ్యానంలో ఉన్నాను. మెల్లగా నేను కళ్ళు తెరిచి చూశాను. నా ఎదుట కనిపించిన దృశ్యాన్ని చూసి ఉలిక్కి పడ్డాను.

మంచం మీద ఒక మూలగా బాబా కూర్చొని ఉన్నారు. ఆయన నా భార్య నుదుటి మీద చేయి వేసి మృదువుగా రాస్తున్నారు. గాలిలో బాబా రూపం కనిపించింది. ద్వారకామాయి లో ఉన్న ఫొటోలో బాబా ఎలా ఉన్నారో ఆ విధంగా అంత స్పష్టంగాను నాకు కనిపిస్తున్నారు. బాబాని యింకా స్పష్టంగా చూడటానికి ఆయనని స్పృశిద్దామని ఒక్క ఉదుటున కుర్చీని తన్ని నాభార్య పడుకున్న మంచం దగ్గిరకి పరిగెత్తాను. అబ్బా! ఆ దృశ్యం కరిగిపోయింది. అది ఒక ఉత్కంఠభరితమైన, సంతోషకరమైన క్షణం.

రేపు తరువాయి బాగం…..

సాయిలీల పత్రిక
మార్చ్ 1980
ఎస్.ఎస్.మాధవరావు
హైదరాబాదు

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles