Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా – కామథేనువు
ఈ రోజు మనము ఊర్వీ లాడ్ గారి అనుభవాలు తెలుసుకుందాం.
బాబా గారి లీలలు అనంతము. మనము ప్రతిరోజు బాబా లీలలను చదువుతున్నాము, లీలలను అనుభవిస్తున్నాము. దీనిని బట్టి మనకి తెలిసేది యేమంటే బాబాగారు మనతో యెప్పుడు ఉంటారు. కాని ఆయన ఉనికిని మనము యెప్పుడు గ్రహిస్తామంటే మనము మంచి పనులు చేయాలి. అహంకారం ఉండకూడదు. అహంకారంతో యెన్ని మంచి పనులు చేసినా అవన్ని నిష్ప్రయోజనమే.
బాబా గారు మనలని మంచి మనుషులుగానూ, వినయ విథేయతలతో ఉండాలని కోరుకుంటారు. అందుచేత మనము మొట్టమొదటగా చేయవలసినది యేమిటంటే, దయగలవారిగాను, మంచిమనుషులుగానుతయారవడం. ఈరోజు నేను పోస్ట్ చేయబోయేది, ఇంతకుముందు ఊర్వి లాడ్ గారి “బాబాతో నా మొట్టమొదటి అనుభూతి” కి ఇది అనుబంథము. ఇది కూడా ఊర్వీగారి లీల, దీనిని మీఅందరితో కూడా పంచుకుంటున్నాను.
నాకు కాలి మీద చర్మ వ్యాథి (తెల్లమచ్చలు) ఉంది. సంఘంలో అందరూ కూడా నన్ను తృణీకరించేవారు. కాని నేను మా నాన్నగారికి చాలా కృతజ్ణురాలిని, ఆయన నా కనడియన్ వీసా కోసం చాలా డబ్బు ఖర్చుపెట్టారు. దీనికంతా కూడా మా మామయ్య చాలా సహాయం చేశాడు.
నాకు గుర్తుంది, నా 24వ పుట్టినరోజు నాడు నేను యింటర్వ్యూకి వెళ్ళాను. బాబా గారి అపరిమితమైన ఆశీర్వాదంతో యింటర్వ్యూ, వైద్య పరీక్షలూ పూర్తి అయ్యాయి. అన్ని పనులూ చక్కగా జరుగుతున్నాయి. కనడియన్ ఎంబసీ కూడా నా వీసా పంపించడానికి సిథ్థంగా ఉంది. కాని ఈలోపులో యునైటేడ్ స్టేట్స్ లో 9/11 సంగటన వల్ల, నా వీసాకు సంబంథించిన పలులన్నీ ఆగిపోయాయి
మేము యెంతో కాలం యెదురు చూశాము. కాని ఫలితం కనపడలేదు. మేమంతా చాలా అందోళన పడ్డాము. చాలా డబ్బు ఖర్చయింది. ఒకరోజున మానాన్నగారు షిరిడీ వెడదామని నిశ్చయించారు. మేమంతా షిరిడీ వెళ్ళాము. దర్శనం బాగా అయింది. మరునాడు, కెనడాలో ఉన్న మామామయ్య వద్ద నుంచి, మా లాయరు గారికి నా వీసా వచ్చిందని ఫోన్ వచ్చింది.
నేను కెనడా వెళ్ళి స్థిరపడ్డాను. 9 నెలల తరువాత నా వివాహం కోసం ఇండియా వచ్చాను. కాని నాకు 6 రోజుల సెలవు మాత్రమే ఉంది. ఒకరోజు నేను బొంబాయి ఎయిర్ పోర్ట్ లో దిగి వెంటనే మావూరు వెళ్ళాను. అదే రోజు నేను, మాన్నగారు మా యింటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళాము. దర్శనము అయిన తరువాత మందిరము ఆవరణలో మానాన్నగారితో షిరిడి వెడతానని చెప్పాను.
నా తల్లితండ్రులు నా కోరికను మన్నించారు. మరునాడు శుక్రవారము నాడు, నేను, మా అమ్మగారు, మా సోదరుడు, డ్రైవరుతో కారులో షిరిడికి బయలుదేరాము. షిరిడీలో 12 గంటల మథ్యాహ్న హారతి చూసి యింటికి తిరిగి వచ్చాము. మేము శుక్రవారము రాత్రికి యింటికి వచ్చాము. మరునాడు శనివారమునాడు నా కాబోయే భర్త నన్ను కలుసుకోవడానికి వచ్చారు. మేమిద్దరము ఒకరికొకరం ఇష్టపడ్డాము, బాబా ఆశీర్వాదముతో గురువారమునాడు నిశ్చితార్థము జరిగింది.
బాబా దయ వల్ల మంచి భర్త లభించాడు. మా వివాహము తరువాత మాకు అమ్మాయి పుట్టింది. నేను నాభర్త, ఇంక పిల్లలు వద్దనుకున్నాము. కాని ఒకరోజు రాత్రి నేను, నా భర్త బాబా గుడిలో ఉన్నట్లుగా కల వచ్చింది. నేను బాబాకి నమస్కరించి కళ్ళు తెరిచేటప్పటికి బాబాగారి కుడి కంటిలో బ్రహ్మాండమైన విశ్వము కనిపించింది. మరునాడు నా భర్తకి నాకు రాత్రి వచ్చిన కల గురించి చెప్పాను. నా భర్త ఆశ్చర్యపోయి తనకు కూడా అటువంటి కలే వచ్చిందని చెప్పారు. ఈ బాబా లీల తరువాత నేను గర్భము దాల్చానని తెలుసుకున్నాను.
ఆగష్టు 9, 2009 లో మాకు శ్రావణమాసములో అమ్మాయి పుట్టింది. (హిందూ కాలండరు ప్రకారం శ్రావణమాసం పవిత్రమైన నెల) మేము మా అమ్మాయికి “దిష” అని పేరుపెట్టాము. దిష బాబాగారు మాకు ప్రసాదించిన వరము.
నాకు యింతటి ఆనందకరమైన జీవితాన్ని యిచ్చినందులకు బాబా గారికి చాలా చాలా కృతజ్ణురాలిని. బాబా నువ్వెప్పుడూ నాతోనే ఉన్నావు, అందుకనే నా భవిష్యత్తు గురించి నాకు యే చింతా లేదు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పిలిచి అవకాశం ఇవ్వటం బాబా కృప కాకా మరేమిటి–Audio
- బాబా చూపిన కృప – బాబా దివ్యదర్శనం 2
- బాబా చూపిన కృప – బాబా దివ్యదర్శనం 1
- బాబా వారి కృప
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments