బాబా వారి కృప



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఈ రోజు మనము ఊదీ మహిమ గురించి తెలుసుకుందాము. ఈ లీలని సాయిలీల పత్రిక నుండి గ్రహించడమయినది.

బాబా ఊదీ మహిమ (1974) : శ్రీ మహేష్ చంద్ర శ్రీవాత్సవ

అక్టోబర్ 1973 నుంచి ఈయన బాబావారి దీవెనలు అందుకుంటూ వుండేవారు.

ఒకరోజు బుధవారం “కోజగిరి పూర్ణిమ” ముందు రోజు రాత్రి షిరిడీకి ప్రయాణం పెట్టుకున్నారు. ఉదయం 10.30 కి, ఆయనకి షిరిడీలో బాబా బొమ్మ వున్న సిల్వర్ ఉంగరం కొనుక్కోవాలని ఒక ఆలోచన వచ్చింది. ఆరోజు మధ్యాహ్నం 1.30 కి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. అతను వజ్రాల వ్యాపారి కూడా.   స్నేహితుడితో, తను షిరిడీ వెడుతున్నానని,  మరల 2 రోజుల వరకూ కలవడం కుదరదని చెప్పడానికి,  అతనితో కలిసి భోజనం చేయడానికి వెళ్ళాడు.

ఆ రోజు మధ్యాహ్నం, భోజనం అవగానే ఆ స్నేహితుడు తనంత తానుగా ప్లాటినం ఉంగరం ఇచ్చాడు. అది చాలా విలువైన, అద్భుతమైన ఉంగరం. అటువంటి విలువైన ఉంగరాన్ని తను చేయించుకోలేడు. ఆ ఉంగరం మీద బాబా బొమ్మ బంగారంతో చెక్కబడివుంది. అది పంచలోహాలతో చేయబడినది.

మరునాడు గురువారం “కోజగిరి పూర్ణిమ” నాడు తను షిరిడీ లో ఉంటాడు. ఈ అద్భుతం ఆయన జీవితంలో గొప్ప మార్పుని తెచ్చింది. మదిలో చెరగని ముద్ర వేసింది. బాబా గారు చూపించే లీలలన్నీ కూడా మరలా మరలా గుర్తు చేసుకునే విధంగా ఉంటాయి.

ఫిబ్రవరి 23, 1974, ఉదయం కొంతమంది స్నేహితులతో కలిసి షిరిడీ లో అడుగు పెట్టారు. అందరూ కలిసి ఒకేచోట ఉందామనుకున్నారు. కాని, షిరిడీ వెళ్ళగానే శ్రీ వాత్సవ గారు విడిగా వేరేచోట ఉందామనుకుని అలాగే వేరేచోట బస చేశారు.

ప్రొద్దున్న అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని మహాసమాధి మందిరానికి అభిషేకం చూడ్డానికి వెళ్ళదామని చెప్పడానికి స్నేహితుల వద్దకు వెళ్ళారు. అప్పటికి వాళ్ళింకా తయారవలేదు. అందుచేత తనని సమాధిమందిరంలో కలవమని, తను ఎదురుచూస్తూ వుంటానని చెప్పారు.

బాబా గారికి పూలదండ కొంటున్నప్పుడు, బాబా గారు సూచన ఇస్తున్నట్లుగా ఒక విధమయిన ఆలోచనా తరంగం ఆయన మనసులోకి వచ్చింది. “మొదట ద్వారకామాయి కి వెళ్ళు, తరువాత చావడి, తరువాత సమాధిమందిరం. నేనింకా జీవించే ఉన్నాను.” అని ఈవిధంగా ఆయనకి అనిపించింది.

ద్వారకామాయిలో ఆయన చరణాలకు సాగిలపడి నమస్కరించి అక్కడ ఫోటోకి,  చావడిలో ఫొటోకి దండలు వేసి, సమాధిమందిరంలోకి వెళ్ళాడు. అభిషేకం తరువాత మధ్యాహ్న హారతి కూడా చూద్దామని వెళ్ళాడు. మధ్యాహ్నహారతి అవగానే తన బసకి వెళ్ళిపోయాడు. మెల్లిగా సాయంత్రం 4, 4.30 కి లేచి మరలా ద్వారకామాయిలో ఆయన పాదాల వద్ద కూచుని పుస్తకాలు చదువుకుందామని పడుకున్నాడు.

కాని ఏదో తెలియని శక్తి 3 గంటలకు లేపింది. తయారయి ద్వారకామాయికి వెళ్ళమని చెప్పినట్లయింది. అప్పటికి సమయం 3.30 అయింది. ద్వారకామాయి చేరుకునేటప్పటికి, అక్కడున్న పనివాడు, ఈయనని బాబా గారి ఫోటోలు, పాదుకలు తుడిచి శుభ్రం చేయమని చెప్పాడు. ఆ సమయంలో ఇటువంటిది ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈయన ఆనందానికి అవధులు లేవు. ఎంత చక్కటి అవకాశాన్ని బాబాగారు ఇచ్చారు?

ఇదంతా ఆయన తన మీద కురిపించిన కటాక్షం. ద్వారకామాయిలో ఈ సేవ చేసి, ఆయనకి నమస్కరించి, సాయి చాలీసా, దుర్గా చాలీసా, హనుమాన్ చాలీసా, సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టారు. ఇంతలో అనుకోకుండా చావడి మందిరాన్ని పర్యవేక్షించే ఆయన ఎక్కడినించి వచ్చాడో, ఈయన వద్ద వున్న “ఆస్ బోర్న్ వ్రాసిన ఇంక్రెడిబుల్ సాయిబాబా” అనే పుస్తకం చూసి, దగ్గిర కూర్చుని బాబాగారి లీలలు, మహిమల గురించి చర్చించడం మొదలు పెట్టారు. ఆ పుస్తకంలో వివరించినవన్నీ మాట్లాడారు.

ఈవిధంగా చర్చించుకుంటుండగా తనలో అనుకున్నారు,  “బాబాగారు లేరని ఎవరన్నారు? ఆయన ప్రతిచోటా వున్నారు. ఈ ప్రపంచమంతా నిండి వున్నారు. ఈ షిరిడీ ఆయన తిరిగిన పవిత్రప్రదేశం. ఈ షిరిడీ తన భక్తులకి ఎప్పుడూ కూడా ఆయన లీలలని గురించి జ్ఞప్తి చేస్తూ వుంటుంది.” 

ఇలా ఆలోచిస్తుండగా ఆయన దృష్టి బాబా పాదుకలపై పడింది. పాదుకలంతా కూడా ఊదీతో చల్లినట్లుగా ఉంది. అపుడే అక్కడికి వచ్చిన ఇద్దరు భక్తులు కూడా వారిలో వారు మాట్లాడుకోవడం కనిపించింది. వారు మరాఠీలో మట్లాడుకున్నారు. వారు మాట్లాడిన మాటలు ఈ పర్యవేక్షకుడు అనువదించి చెప్పాడు. వారు అన్న మాటలు, “చూడు, బాబా పాదుకల మీద ఊదీ ఎంత అందంగా చల్లబడి వుందో”.

వారు వెళ్ళగానే 10, 15 నిమిషములవరకూ ఎవ్వరూ రాలేదు. బహుశా ఇదంతా బాబా వారి కృప. ఆ పవిత్రమైన ఊదీ ఈయన కోసం ఏర్పరిచారు. ఎప్పుడూ భక్తులు వచ్చే సమయంలో కూడా ఎవరూ రాలేదంటే అదంతా బాబాగారు ఏర్పరచినదే.

ఇక 4.55 కి లేచి, చావడికి వెళ్ళి కాసేపు కూచుందామని పర్యవేక్షకుడితో చెప్పారు. అపుడు అతను ఇంతకుముందు తను ఏ బాబా గారి పాదాలనయితే శుభ్రం చేశాడొ అక్కడ ఏర్పడిన ఊదీ వంక చూపించాడు. చూడగానే ఆ ఊదీ చాలా ఎక్కువగా ఉన్నట్లనిపించింది. కాని, చావడిలో పని చేసే పర్యవేక్షకుడు అంతా ప్రోగుచేసి ఇచ్చేటప్పటికి ఒక చిటికెడు ఊదీ వచ్చింది. అది బ్రౌన్ కలర్లో ఉండి, వజ్రంలా మెరుస్తోందిట.  ఆయన నమ్మకానికి బాబాగారు ఆ విధంగా అనుగ్రహించారు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles