బాబా చూపిన కృప – బాబా దివ్యదర్శనం 2



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

నిన్నటి తరువాయి బాగం…

నేను వేగంగా కదిలిన చప్పుడుకి నా భార్యకు మెలకువ వచ్చింది. ఆనంద పరవశంతో మైమరచిపోయి గద్గద స్వరంతో “బాబాకు దయలేదని అనడానికి నీకెంత ధైర్యం. చూడు, ఆయన నీ నుదుటి మీద మృదువుగా రాస్తూ ఇక్కడే ఉన్నారు. ఆయనను గుర్తించలేవా? గుడ్డిదానివా?” అన్నాను. అతికీ అతకనట్లుగా మాట్లాడిన నామాటలను నా స్వరాన్ని ఆమె అర్ధం చేసుకొందో లేదో నాకు తెలీదు. మళ్ళీ నిద్రలోకి జారుకొంది. ఆ క్షణంలో నాకెంతగానో ఉపశమనం కలిగింది. బాబా ఆమెని కాపాడటానికి వచ్చారని నాకు తెలుసు. గత 20 రోజులుగా నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ రోజు కంటినిండా హాయిగా తనివితీరా నిద్రపోయాను.

తెల్లవారుజాము 4 గంటలకు నా భార్య లేచి ‘బాబా బాబా’అని గట్టిగా అరుస్తూ మంచం చుట్టూ చూస్తూ ఉండటంతో నాకు హటాత్తుగా మెలకువ వచ్చింది. ఆమెని నెమ్మదిగా మంచం మీద ప్రశాంతంగా కూర్చోమని చెప్పాను. ఆమె తనకు వచ్చిన కల గురించి వివరించి చెప్పడం మొదలుపెట్టింది.

“నేను ఎక్కడ ఉన్నానో తెలియని పరిస్థితులలో అడవులు, పర్వతాలు, పట్టణాలలో తిరుగుతూ ఉన్నాను. భయంతో గట్టిగా అరుస్తూ ఉన్నాను. అప్పుడే నావెనుకనించి ఒక స్వరం వినపడింది. దూరంగా ఒక మూలన ఒక వృధ్ధుడు కూర్చొని నన్ను తనదగ్గరకు రమ్మని సైగ చేశాడు. భయంతో నేను అతని వద్దకు పరిగెత్తుకొని వెళ్ళాను. ఆశ్చర్యం ఆయన బాబా. ద్వారకామాయిలో బాబా కూర్చున్న రూపంలోనే ఉన్నారు. నాకు సహాయం చేయమని ఏడుస్తూ బాబా పాదాలముందు సాష్టాంగపడి ప్రార్ధించాను. ఆందోళనపడవద్దని మృదుస్వరంతో అన్నారు. తీర్ధం తీసుకొని ప్రశాంతంగా ఉండమని చెప్పారు. కలలోనే తీర్ధం తీసుకొన్నాను అంతలోనే కల కరిగిపోయింది.”

కల గురించి అంతా విన్నాక మా ఆనందానికి అవధులు లేవు. బాబా దీవించారనీ, షిరిడీకి రమ్మని ఆయన పిలుస్తున్నారని యిది శుభ సూచకమనీ నా భార్యతో చెప్పాను. ఆరోజు రాత్రినించి టైఫాయిడ్ జ్వరం తగ్గుముఖం పట్టి తొందరలోనే తగ్గిపోయింది. మేమంతా అక్టోబరు 1975 వసంవత్సరం లో షిరిడీ వెళ్ళి దసరా వుత్సవాలలో కూడా పాల్గొన్నాము.

షిరిడీలో నాకు మరొక గొప్ప అనుభూతి కలిగింది. అది అంతుపట్టనిది. బహుశా నవమినాడు జరిగింది అనుకుంటాను. ఆరోజు బాగా రద్దీగా ఉంది. నేను సంస్థానం వారు నడుపుతున్న కాంటీన్ లో ఉండిపోయాను. మధ్యాహ్న్న హారతి కి వెళ్ళే తొందరలో ఉన్నాను. ఆరతి ప్రారంభమయిపోయింది. మందిరమంతా విపరీతమయిన భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఎలాగో నేను సెంట్రల్ హాలులోకి ప్రవేశించాను. కాని అక్కడ నేను బాగా ఎడమవైపుకి ఒక మూలకి తోసివేయబడ్డాను. అక్కడినుండి నాకు బాబా విగ్రహం స్పష్టంగా కనపడదు. దానితో నాకు చాలా నిరాశ కలిగింది. నాకు బాబా వారి గడ్డము, దవడ మాత్రమే కనపడుతున్నాయి.

నిరాశతోను, అసంతృప్తితోను తలవంచుకొని క్రిందకు చూస్తున్నాను. కొంతసేపటి తరువాత హటాత్తుగా తలపైకెత్తాను. నా ఎదుట కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను. గర్భాలయంలో బాబా కూర్చొని ఉన్న రూపం నాకళ్ళెదుట కనిపించింది. బాబా తలతిప్పి ఒక్కసారిగా నాకళ్ళలోకి సూటిగా చూశారు. ఇదంతా ఒక లిప్తపాటులో జరిగింది. బాబావారి కళ్ళలోనుండి వస్తున్న ఆ ప్రకాశవంతమయిన వెలుగుని నేను తట్టుకోలేకపోయాను. నా చుట్టూరా జరుగుతున్నదేమిటో అర్ధం కాక చేతులతో నా మొహాన్ని కప్పుకొన్నాను. మొహం మీదనుండి చేతులను తీసి అటువంటి అధ్బుత దృశ్యాన్ని యింకా దగ్గరగా చూద్దామనే ఉద్దేశ్యంతో జనాన్ని తోసుకొని ముందుకు వెళ్ళాను. అబ్బా! నాస్నేహితుడు ఆర్.వీ. కృష్ణారావు అనే అతను నా వెనుకనించి వచ్చి నేను వీక్షిస్తున్న ఆ దివ్యదర్శనం బాబా అనుగ్రహం సమసిపోయేలాగ నన్ను ప్రక్కకు తోసి ముందుకు వెళ్ళాడు. నాకు కనిపించిన దృశ్యం ఆ క్షణంలో నాకు కలిగిన పరవశం, పులకరింపు వర్ణించడానికి మాటలు చాలవు. ఆ అనుభూతి వర్ణించలేనిది. అప్పుడు నేను చూసినది నా చిత్తభ్రమ కాదు. ఈ దృశ్యం తరువాత అంతకు ముందు కనిపించినట్లుగానే నాకు బాబా గడ్డం, ఒక వైపు చెంప మాత్రమే కనిపించాయి. అప్పుడప్పుడు ఈ సంఘటనని తిరిగి గుర్తుకు తెచ్చుకున్నప్పుడెల్లా నాకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. 1975 లో జరిగిన మా షిరిడీ యాత్ర ఎప్పటికీ మరచిపోలేనిది.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles