బాబా ముస్లిం అని అయిష్టత చూపిన వ్యక్తికీ తన ఇష్టదైవం సమక్షంలో దర్శనమిచ్చిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


1999వ సంవత్సరంలో మేము హైదరాబాద్, ఉప్పల్లో ఉండే వారము. 2000 సంవత్సరం వరకూ బాబా ఎవరో నాకు తెలియదు.

మా ఇంటి పక్కన అద్దెకు ఉంటున్న ఒకావిడ (విశాలి) ఆవిడ బాబా భక్తురాలు.

బాబా గురించి నాకు బాగా చెబుతుండేది. నేను చాలా శిష్టాచార సంపన్నమైన కుటుంబం నుండి వచ్చిన దాన్ని కాబట్టి,

నాకు ఇంట్లో మడీ, ఆచారం అదీ ఉండటం చేత, ఈయన ముస్లిం దేవుడు కాబట్టి, మనం అసలు ఈయనని, తలవనే తలవ కూడదన్న భావం నాకు ఉండేది.

కానీ, ఒకసారి విశాలితో మాట్లాడుతూ అనుకోకుండా ”ఊరికే బాబా బాబా అంటారు అంత గొప్పవాడా మీ బాబా! అయితే నేను బాబాని, (పరానికి సంబంధించిన) మూడు ప్రశ్నలు అడుగుతాను,

అందులో ఒకటి, మనం చనిపోయాక ఎక్కడికి వెళతాము? ఇలాంటివి, వాటికి సమాధానాలు బాబా నుంచి వస్తే , అప్పుడు చూద్దాం” అని, అలా బాబా సంభాషణ నుంచి తప్పించుకోవడానికి అలా అన్నాను.

రెండు, మూడు రోజులయ్యాక, ఒక రోజు తెల్లవారుఝామున నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో నేను ”శ్రీ రాఘవేంద్ర స్వామి” గుడికి వెళ్లినట్లు, ”బృందావనం” (శ్రీ మంత్రాలయం రాఘవేంద్రస్వామి సమాధిని బృందావనం అంటారు) దాటాక, ఒక సమాధిని కనిపించింది.

 ”ఇదేమిటి రాఘవేంద్రస్వామి బృందావనం పక్కన సమాధి ఉన్నదేమని” ఆలోచిస్తూ నిలబడి నేను ఉన్నాను.

ఇంతలో గుడి పూజారి వచ్చి, గుడి మూసేసే సమయం అయిపోతోంది. తొందరగా వెళ్లి ”తీర్థం” తీసుకోమని చెప్పాడు.

శ్రీ రాఘవేంద్ర స్వామికి తీర్థం చాలా ముఖ్యం. నేను లోపలికి వెళ్లి బృందావనం దగ్గర నిలబడి, నేను బాబాను అడగాలనుకున్న రెండు ప్రశ్నలు వేశాను.

నేనడిగిన ప్రశ్నలకి, జవాబులు నాకు సమాధి నుంచి వినపడ్డాయి. నేను భయపడి వెంటనే బయటికి వచ్చేస్తుంటే, ”నన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను అన్నావు, రెండు ప్రశ్నలు మాత్రమే అడిగావు. దానికి నేను సమాధానాలు చెప్పాను.

నన్ను నువ్వు మూడవ ప్రశ్న అడగకుండానే వెళ్ళిపోతున్నావేంటి? అని స్పష్టముగా సమాధిలోనుంచి మాటలు వినిపించాయి.

నేను ఉలిక్కి పడి పక్క మీద నుండి లేచి కూర్చున్నాను. నేను బాబా ప్రస్తావన, తప్పించుకోవడానికి అడుగుతానన్న ప్రశ్నలకి, కలలో ”శ్రీ రాఘవేంద్ర స్వామి” సమక్షంలో సమాధానాలు దొరికే సరికి నాకు నెమ్మదిగా బాబా మీద గురి కుదిరింది.

ఇది జరిగినప్పుడు మా అబ్బాయిలు ఇద్దరు చాలా  చిన్నవాళ్లు. ఒకడు 7th క్లాస్ రెండో వాడు 3rd క్లాస్ అప్పటి నుండి నా  కన్ని బాబాయే.

బాబా గుడికి వెళ్ళటం, బాబా చుట్టూ ప్రదిక్షణాలు చెయ్యటం, అప్పుడప్పుడు ”శ్రీ సాయి సచ్చరిత్ర” పారాయణ చెయ్యటం చేస్తున్నాను.

నాకు శిరిడీ  వెళ్లి శ్రీ సాయినాథుని దర్శనం చేసుకోవాలని ఉన్నా, 2012వ సంవత్సరం వరకు కుడా మాకు ఆయన పర్మిషన్ ఇవ్వలేదు.

మా పెద్ద అబ్బాయి గౌహతి లో I.I.T చదువుతున్న సమయంలో, నాలుగో ఏడులో ఉన్నప్పుడు, బాగా జ్వరం  వచ్చి కాలేజీకి వేళ్ళకుండా రెస్ట్ తీసుకోవలసి వచ్చింది.

అనారోగ్యం కారణంగా బాగా చదవలేక, నీరసం కారణంగా పరీక్షలు సరిగా రాయలేకపోయాడు. దాని కారణంగా మార్కులు బాగా రాలేదు తక్కువగా వచ్చాయి.

ఆ కారణంగా క్యాంపస్ సెలక్షన్ లో మంచి కంపెనీలో రావలసిన జాబ్ రాలేదు.

ఆ సమయంలో మా చుట్టం ఒకాయన మా ఇంటికి వచ్చి ”నేను శిరిడీ వెళుతున్నాను మీరు వస్తారా?” అని అడిగాడు. మేము చాలా  సంతోషంతో వప్పుకున్నాము.

ఇన్నాళ్ళకి ఆ సాయిని చూడబోతున్నామని సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.

అప్పుడే మా వారు, ”మనవాడికి జాబ్ రాలేదు కదా! వాడికి జాబ్ వచ్చాక వెళదాములే” అని నా ఉత్సాహం మీద నీళ్ళు జల్లే ప్రయత్నం చేసారు.

”బాబా దగ్గరికి వెడితే అన్నీ ఆయనే చూసుకుంటాడు, మనం ఎలాగైనా శిరిడీ  వెళ్లి తీరాలంటూ” పట్టుబట్టాను.

మధ్యాహ్నం 3.30 నిమిషాలకి బస్సు ఉంది. బస్సు స్టాండ్ కి వెళ్లాలంటే, 3 . 00 గంటలకి మేము బయలుదేరాలి.

బస్సు భోజనానికి ఎక్కడ ఆపుతాడో, ఏమో అక్కడ తినడానికి ఏమి దొరుకుతాయో అని, రాత్రి తినడానికి పూరీలు , పులిహోర అన్నీ చేశాను.

అన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేశాను. సమయం అయిపోతోందని హడావిడి పడుతున్నాము. 2 . 30 గంటల సమయము అవుతుండగా, మా అబ్బాయి నుండి ఫోన్ వచ్చింది.

”అమ్మా! నేను జాబ్ లో సెలెక్ట్ అయ్యాను” అని చెప్పాడు. ఒక్కసారిగా బాబా వారి అద్భుత చర్యకి, ఆనందం, ఆశ్చర్యం కలిగాయి.

ఉద్యోగం లేకుండా, రాకుండా శిరిడీ వెడితే బావుండదని మా వారు అనుకున్నారు కదా! అందుకని మనసులో కొంచెం బాధ కూడా లేకుండా, బాబాను చూడబోతున్నామన్న ఆనందం,

మా వాడికి ఇంకా జాబ్ రాలేదన్న బాధ లేకుండా చేసి, అన్ని ఆలోచనలకి శుభం కార్డు వేసి పూర్తి ఆనందాన్ని ప్రసాదించాడు బాబా.

”శిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం” అంటారు బాబా. ఇక్కడ షిరిడి కి వెళ్ళాలన్న ఆలోచనకే దుఃఖ పరిహారం చేసాడు.

”చూసారా! బాబాని పూర్తిగా నమ్మితే ఏం జరిగిందో మనవాడికి జాబ్ లేదు, ఏం వెళతాం అన్నారు.

ఆ కొరత మనసులో ఏ మాత్రం లేకుండా చేసి, శిరిడీ బయలుదేరటానికి ముందే మనకి ఆ ఆనందం కలిగేలాగా వాడికి జాబ్ ఇప్పించి మరి పంపుతున్నాడు” అని నేను మా వారితోటి అన్నాను.

ఇంకా ఆనందంగా  శిరిడీ బయలుదేరి వెళ్ళాము. బాబాని మనసారా దర్శనం చేసుకుని, తర్వాత మూడు రోజులు చుట్టూ పక్కల క్షేత్రాలు కూడా చూసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాము.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles