Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకనకప్పుడు నేను చాలా కష్టాల్లో వుంటిని. శిరిడీ కి వెళ్ళిరావాలని చాలా సార్లు సంకల్పం చేసుకొని పైసలు కూడా కూడపెట్టాను. పైసలు ఖర్చు అయిపోయేవి కానీ శిరిడీ వెళ్ళలేక పోయేవాడిని, అందుకే చాలా నిరాశగా వుండేవాడిని.
బాబా నన్ను ఎందుకు రానివ్వటం లేదు, నేను అయన తన వాళ్ళను పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లు తన దగ్గరికి రప్పించు కుంటాడని విన్నాను. ఏమో నేను బాబాకు చెందిన వాడిని కానేమో అనుకునే వాడిని.
ఒక రోజు ఆలా బాధపడుతూ మా ఇంటికి దగ్గర్లో వున్న శ్రీ సాయినారాయణ గుడికి వెళ్ళాను. అప్పుడే ఆరతి మొదలు అయింది. ఆరతి అయ్యాక అక్కడ పూజారి సెల్వరాజ్ పిళ్ళే నన్ను పలకరించి ఎందుకు ఎదో చింతగా వున్నావు! అని అడిగాడు.
నేను శిరిడీ వెళ్లలేక పోతున్నాను అన్న విషయం చెప్పాను. అతడు దానికి నవ్వి “వూరికే ఇలా చింత చేస్తూ తిరుగుతూ వుంటే అవ్వదు. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయి, బాబా నిన్ను తన దగ్గరకు లాగుతాడు.”
నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా శిరిడీ కి వెళ్తూవుంటే “ఒక శ్రీఫలం (అంటె టెంకాయ) వాళ్లకు ఇచ్చి, ఆ సమర్ధసద్గురు సన్నిధానంలో నీ పేరు మీద నీ కోరిక చెప్పి సమర్పించామను” ,అప్పుడు చూడు అన్నాడు.
అంతె, నేను నా స్నేహితుని ద్వారా శ్రీఫలం పంపినాను.నన్ను నమ్మండి 15 రోజుల్లో శిరిడీ సాయినాథుని దర్శనం చేసుకొని నేను, నా భార్య వచ్చేసాము.
మరో అనుభవం
ఆ రోజుల్లో నేను మధ్యప్రదేశ్ state Electricity బోర్డు లో పనిచేసేవాడిని. నా స్నేహితుడు కంప్యూటర్ department లో పని చేసేవాడు, అతని పేరు G సోనాల్కర్ అతనికి ఒక కొడుకు, ఒక కూతురు.
కూతురి పేరు సాధన అమ్మాయిని పెండ్లి వయసు వచ్చింది. తల్లి, తండ్రి చింత చేస్తున్నారు,రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి.
ఒక రోజు sudden గా ఆయన భార్య నా దగ్గర అనింది. అన్నయ్య , అమ్మాయికి పెండ్లి వయసు వచ్చింది. సంబంధం కుదరటం లేదు. ఎలాగా, మీరు బాబా భక్తులు కదా! ఉపాయం చెప్పండి.” అనింది.
నేను అన్నాను, (బాబానే నాతొ అనిపించారు) ఎవరన్నా శిరిడీ వెళ్తుంటే ఒక టెంకాయ ద్వారకామాయి బాబా కు నివేదించి , మీ కున్న కోరిక అంటే, అమ్మాయి పెండ్లి గురించి ఆ టెంకాయ ద్వారా తెలియ చేయండి, సాధన చేత్తో టెంకాయ తాకించి బాబాకు నివేదించడి. అప్పుడు మీ సమస్య తీరిపోతుంది అని చెప్పాను.
నా మాట మీద విశ్వాసం వుంచి వాళ్ళు అలాగే చేశారు. నన్ను నమ్మండి ఒకటిన్నర నెలల్లో ఆ అమ్మాయికి మంచి సంభంధం వచ్చి, పెండ్లి కూడా అయి, అత్తవారింటికి వెళ్ళింది.
ఇవన్నీ చూసి నాకు ఆ సాయి నాధుని మీద ఇంకా భక్తి విశ్వాసాలు ఎక్కవ అయినాయి. ఆ సాయినాథుని చరణాలే ఇక శరణాలు అనిపించింది.
దినేష్ మదన్ తివారి
రామ్ నగర్, జబల్ పూర్
మధ్యప్రదేశ్
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- బాబా నిన్ను గొడుగు పట్టి ఇక్కడకు తీసుకు వచ్చారు. ఎవరినీ ఏమి అడగకు….శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ
- మనసెరిగిన బాబా – పంపిన ఊధీ ప్రసాదం
- అమ్మా! నీకు బాబా గారే కలలో వచ్చి నిన్ను శిరిడీ రమ్మనమని పిలిచారు, నేను కాదు నీ కలలోకి వచ్చింది.
- బాబా ముస్లిం అని అయిష్టత చూపిన వ్యక్తికీ తన ఇష్టదైవం సమక్షంలో దర్శనమిచ్చిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయి, బాబా నిన్ను తన దగ్గరకు లాగుతాడు.”
Radhika J
December 28, 2017 at 8:01 pmJai sadguru sainath
kishore Babu
December 28, 2017 at 9:37 pmSai Baba…Sai Baba…బాబా స్పర్శ చాలు కోరికలు తీరడానికి.
Madhavi
December 30, 2017 at 8:13 pmManam andharam temples velthamu.oka coconut.kottestham.kaani evaranna oohinchara..Coconut dwara mana korikanu baba ku theliacheyavachani.?? This is how baba is giving lessons..Sairam..