Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా అబ్బాయి మమ్మల్ని రమ్మనటం మేము రాము అనటం మా వాడికి అస్సలు నచ్చలేదు.
నాన్నా మిమ్మల్ని వదిలి నేను ఇక్కడ ఇలా వుండటం నాకు నచ్చటం లేదు. నేను ఉద్యోగాన్ని వదిలేసి మేము కూడా శిరిడీ వచ్చేస్తాము. అందరం అక్కడే ఉందాం అన్నాడు.
మా వాడికి కూడా లక్ష రుపాయాలు జీతం వస్తుంది. సిటీ లో జీవితం అంతా వదిలేసి మా కోసం ఇలా వచ్చేస్తానంటున్నాడు. మేము సరేన్నన్నాము.
అంతే ఒక రోజు కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు వదిలేసి శిరిడీ వచ్చేసారు.
ప్రస్తుతం మా అబ్బాయి ఒక హోటల్ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు. మా కోడలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోంది.
వాళ్ళు శిరిడీ వచ్చేసాక మా వియ్యాలవారికి ఒక్కతే అమ్మాయిగా వాళ్ళు అమ్మాయిని వదిలి పెట్టి ఉండలేక వాళ్ళు కూడా వాళ్ళుంటున్న ఇల్లు అద్దెకి ఇచ్చేసి వచ్చి శిరిడీ లోనే వుంటున్నారు.
బాబా దయ వలన మా కోడలు కూడా ఈతరం అమ్మాయిలాంటింది కాదు. మేమంటే అమ్మాయికి కూడా చాలా గౌరవం.
మా అమ్మాయిని మా అక్క కొడుక్కీ ఇచ్చాము కదా, అవటానికి అక్కే అయినా మా అమ్మాయిని చాలా కష్టాలు పెట్టింది.
నేను అటు అక్క ఇటు కూతురు ఎవరికి చెప్పలేక పోయేవాడిని. మా అమ్మాయి కష్టాల గురించి ఒక రోజు ద్వారకామాయి లో బాబా తో చెప్పుకొని ఏడ్చాను.
బాబా చిన్నపిల్ల. కష్టాలు పడలేకుండా వుంది. ఎదో ఒకటి చెయ్యి అని అనుకున్నాను.
ఆ తర్వాత మా అక్క పెట్టె కష్టాలన్నీ మా అల్లుడికి తెలిసి ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా రాత్రికి రాత్రి శిరిడీ కి బయలుదేరి వచ్చేసారు.
ఇప్పుడు అమ్మాయి అల్లుడు కూడా ఇక్కడే వుంటున్నారు. అమ్మాయికి సంస్థానం లో సెక్యూరిటీ లో పని కుదిరింది.
ఆ తరువాత కొద్ది రోజులకి చదువుకుంది కదా సెక్యూరిటీ లో ఎందుకని అక్కడ నుండి రిసెప్షన్ లో వేశారు.
మా అల్లుడు ఒక ప్రైవేటు కంపెనీ లో పని చేస్తున్నాడు. వాళ్ళకి నేను రహతా లో ఒక ఇల్లు కొనిపెట్టాను. అక్కడే వుంటారు.
బండి కొనుక్కుంది. రోజు అక్కడి నుండి ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నంకల్లా వెళ్ళిపోతుంది షిప్ట్ సిస్టం.
శిరిడీ లో ఒక రోజు నేను ఇంటికి వస్తూండగా రాత్రి 11 గంటలప్పుడు ఒక ముసలాయన తెల్ల బట్టలు వేసుకున్నాడు.
వేడి వేడి గా పొగలు కక్కుతున్న సిరా ని నాకు ప్రసాదం అని ఇంటికి తీసుకో పో అని నా చేతి లో పెట్టాడు.
ఆయనేమో తన చేత్తో పట్టుకొని అతి మామూలు గా నా చేతి లో పెట్టాడు. నా చేయి కాలిపోయింది.
అంత వేడి గా వుందా సిరా అప్పుడు ముసలాయన కాగితం తీసుకొని, అందులో నవ్వుతూ పెట్టిచ్చాడు.
నన్ను ఉద్యోగం లోంచి 60 సంవత్సరాలకి రిటైర్ చేసారు.
ITI COLLEGE లో రిటైర్ అయ్యాక నాకు అనుకోకుండా హైదరాబాద్ లోని సాయిబాబా మందిరం చాదర్ ఘాట్ వారి ఒక వసతి గృహం శిరిడీ లో కట్టించారు.
వారు ఒక తెలుగు తెల్సిన వారి కోసం చూస్తున్నారు. ఆ సమయం లో వారికీ నేను తారసపడ్డాను. నన్ను మేనేజర్ గా నియమించారు.
కుమారి యం. మణెమ్మ గారు శ్రీ హేమాడ్ పంత్ రాసిన శ్రీ సాయి సచ్చరిత్రను మరాఠీ భాష నుండి తెలుగు లో రాసారు.
అది సరిగా వుందా లేదా అని చెక్ చేయటానికి, నేను చెప్పే క్లాసులకు బదులు గా అది చూడటానికి నన్ను సంస్థానం వాళ్ళు నియోగించారు.
ఎందుకంటే ఆవిడ పుస్తకం సంస్థానం నుండి ఆమోదం పొందింది. మరాఠీ చదవటానికి ఒకళ్ళు, తెలుగులో సరిగా వుందా లేదా అని ఒకళ్ళు చూసారు, ఆ తెలుగు చూసింది నేనే.
అలాగే శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ – సాయిపథం -శిరిడీ (శ్రీ భరద్వాజ మాస్టారు గారి తోడల్లుడు) గారి పుస్తకం, ఆయన మరాఠీ లోంచి తెలుగులో కి అనువదించితే దాని DTP కూడా నేను చూసాను.
ఆయన్ని (శరత్ బాబూజీ) నేను మా అబ్బాయి గురించి, మా అమ్మాయి గురించి వాళ్ళ పరిస్థితి ఎలా? అని నేను దీనంగా అడిగేవాడిని,
అప్పుడు శ్రీ బాబూజీ బాబా నిన్ను గొడుగు పట్టి ఇక్కడకు తీసుకు వచ్చారు. ఎవరినీ ఏమి అడగకు. అన్ని సమస్యలు వాటంతట అవే సమసి పోతాయి అని చెప్పారు.
అప్పటి నుండి నేను ఎవరినీ ఏమీ అడగటం మాని బాబాకే చెప్పుకుంటున్నాను.
నేను శిరిడీ రావటం, శ్రీ సాయి సంస్థానం లో పని చేయటం, నేను చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం అయివుంటుంది.
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు,
శుభం భవతు.
S శ్రీనివాసులు, ద్వారకామాయిభవన్, శిరిడీ
Latest Miracles:
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయి, బాబా నిన్ను తన దగ్గరకు లాగుతాడు.
- అమ్మా! నీకు బాబా గారే కలలో వచ్చి నిన్ను శిరిడీ రమ్మనమని పిలిచారు, నేను కాదు నీ కలలోకి వచ్చింది.
- మనసెరిగిన బాబా – పంపిన ఊధీ ప్రసాదం
- అడిగినంతనే గ్రక్కున వరమిచ్చే వేల్పు కాదు,అడగకుండానే మన బాధలు తొలగించే వేల్పు మన పూజ్య గురుదేవులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజి గారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments