Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
గురుదేవుల అనంతలీలలు
గురుర్బ్రహ్మా,గురుర్విష్ణుహు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురువేనమః
అన్న నానుడి నూటికి నూరుపాళ్ళు మా గురుదేవులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గారికి అన్వయిస్తుంది.
1954వ సంవత్సరం అక్టోబరు 7వ తేదీ విజయదశమి పర్వదినాన శ్రీ బాబావారి విగ్రహప్రతిష్ట సమాధి మందిరములో జరిగితే,బాబావారు ఆరోజు తమ ప్రతినిధిగా గురువుగారిని ఈలోకంలో అవతరింపజేశారు.
గురువుగారి మేనత్త(శ్రీ సురేంద్రబాబు గారి చెల్లెలు) చి||ల||సౌ సువర్చలతో 1964సం|| అక్టోబరు 15వ తేదీ విజయదశమినాడు జరిగిన వివాహంతో నా ప్రవేశం గురువుగారి వంశవృక్షంలో చేరింది.
పూజ్య గురుదేవుల్ని సాక్షాత్తు శ్రీ సాయి విశిష్టావతారంగా గుర్తించి,వారి చల్లని నీడలో లోకమంతా పరవశిస్తుంటే,వారని గుర్తించడానికి మాకు చాల కాలం పట్టింది.వారు మాకు ప్రసాదించిన అనుభవాలు,లీలలు ఎన్నో ఉన్నాయి.
నాకు 16-11-2009న హార్ట్ ప్రాబ్లం కలిగి నెల్లూరు అనసూయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో అడ్మిట్ అయ్యాను.25వ తేదీ డిశ్చార్జి అయ్యాను.
దీనికి సంబంధించి బాబా,గురుదేవులు ఏవిధంగా నన్ను అనుగ్రహించి,నాబాధనంతా వారే భరించి,నాకు ప్రాణదానం చేసారో క్రింద వివరముగా గురుబంధువులకు తెలుపుకుంటాను.
మా కుటుంబాన్ని గురుదేవులు ఏవిధంగా అనుగ్రహించారో వరుసగా తెలుపుకొని,చివర గురుదేవుల సమాధి అనంతరము నాకు ఎలా ప్రాణదానము చేసి కాపాడారో అన్ని వివరముగా తెలుపుకోవడానికి గురువుగారి అనుమతి ప్రార్థిస్తున్నాను.
నేనుండగా భయమేల?
నాడు బాబా ద్వారకామాయి తల్లి ఒడిలో చేరిన బిడ్డల చింతలను తీరిస్తే,నేడు సత్సంగమనే తల్లి ఒడిలో చేరిన బిడ్డల కోరోకలు తీరుస్తూ,అడిగినంతనే గ్రక్కున వరములిస్తూ మాకుటుంబానికి గురుదేవులు పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబు గారు అందిస్తున్న అనుభవాలు,లీలలు ఎన్నో,మరెన్నో…
పూజ్యశ్రీ గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు అర్పించుకొంటు వారి అనుమతి తప్పక అనుగ్రహిస్తారనే ఆశిస్తూ ప్రారంభిస్తున్నాను.
లోకమంతా పూజ్యగురుదేవుల్ని ,సాక్షాత్తు శ్రీసాయి విశిష్టావతారంగా గుర్తించి,వారి చల్లని నీడలో వారి కృపాకటాక్షములను సంపూర్ణముగా అనుభవించిన చాలాకాలానికిగాని,వారి విశిష్టావతార లక్ష్యం అర్థం కాలేదు.అది కేవలం మూర్ఖత్వం,అజ్ఞానం,దురదృష్టం.
గురువుగారి వంశచరిత్రలో స్థానం కల్పించుకున్న మా దంపతులకు,వారి సాన్నిధ్యంలో స్థానం సంపాదించడానికి చాలాకాలం పట్టింది.
గురువుగారి నాన్నగారికి స్వయానా తోబుట్టువు నాభార్య సువర్చల .అంటే గురువుగారికి మేనత్త.
వారిని సద్గురువుగా గుర్తెరిగి వారి శరణు పొందాక,మా కుటుంభ సభ్యులకు కలిగిన దివ్యానుభావాలు,లీలలు వ్రాయడానికి,తోటి గురుబంధువులతో పంచుకోవడానికి పూజ్య గురుదేవుల అనుమతి మరోసారి అభ్యర్థిస్తున్నాను.
మా కుమార్తె సుచరిత వివాహమై నాలుగు ఐదు సంవత్సరములవరకు పిల్లలులేక,తీరని దుఃఖంతో ఉండేది.
గురువుగారు నెల్లూరు ఇందిరాభవన్ లో దర్శనమిచ్చినప్పుడు ,మా కుటుంబసభ్యులందరూ వెళ్లి వారిని దర్శించుకున్నాము.అప్పుడే గురువుగారు అమ్మాయికి తమ ప్రసాదంగా ఫలము,ఊదీ యిచ్చి ఆశీర్వదించారు.
అట్నుంచి గురువుగారు ఒంగోలు వెళ్ళారు.ముందుగా వారి అనుమతి తీసుకొని నేను,నా భార్య ఒంగోలు వెళ్ళాము.వారిని దర్శించి పిల్లల విషయాలు,సమస్యలు విన్నవించుకొని,వారి గురించి ఆశీస్సులు తీసుకున్నాము.
వారి కృపాకటాక్షమే ఈనాడు మా అమ్మాయికి ఒక అమ్మాయి,ఒక అబ్బాయి-సాయి నిఖిల,సాయి అభివన్.వారి ఆశీస్సులచే పుట్టినవారు కాబట్టి వారిద్దరూ సాయిభక్తులే.
ముఖ్యంగా ఒంగోలులో జరిగిన మరోవిచిత్ర విషయం వివరిస్తాను.నా భార్య తన బాల్యం నుండి విపరీతమైన తలనొప్పితో బాధపడుతుండేది.వివాహము అయ్యాక ఎన్నో మందులు వాడాము.కానీ ప్రయోజనం లేదు.
గురువుగారికి ఆమె బాల్యం నుండి ఆమె గురించి తెలుసు కాబట్టి ఆమె అడుగకుండానే ఆమె శిరస్సు మీద తమ దివ్యహస్తాన్నుంచి,కాసేపు అట్లాగే ధ్యానస్తులయ్యారు.
తరువాత ఊదీ యిచ్చి,ఆశీర్వదించారు.ఆక్షణం నుండి ఈనాటివరకు ఆ మాయదారి తలనొప్పి ఎటు పారిపోయిందో తెలియదు.
అందుకే అంటున్నాను “అడిగినంతనే గ్రక్కున వరమిచ్చే వేల్పు కాదు.అడగకుండానే మన బాధలు తొలగించే వేల్పు మన పూజ్య గురుదేవులు.”
నేను 2000 సంవత్సరం ఆగష్టు 31న,నెల్లూరు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో,ఉపాధ్యాయ వృత్తి నుండి రిటైర్ అయ్యాను.
ఆ సంవత్సరమే నా భార్య సువర్చలకు తుంటివద్ద నొప్పి ప్రారంభమై చివరకు కాలుకూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది.
అప్పుడు మేము హైదరాబాద్ లో మా కుమారుని వద్ద ఉన్నాము.డాక్టర్లు పరీక్షించి,శస్త్రచికిత్స అవసరం అని ఆమె నడక విషయంలో ఏమీ చెప్పలేము అని చెప్పడం జరిగింది.
డాక్టర్లకే డాక్టర్లయిన బాబా,గురువుగార్లుండగా మనం ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదని,నా భార్యకు ధైర్యం చెప్పి ,ఎలాగో చేతికర్ర సాయంతో శిరిడీ తీసుకెళ్ళి గురువుగారి వద్ద మొరపెట్టుకున్నాము.
గురువుగారు “ఏం భయపడవలసిన అవసరం లేదు.మీరు శిరిడీలో ఉన్నన్ని రోజులు,ప్రతోరోజూ బాబా మందిరంకి వెళ్లి,ద్వారకామాయిలో సాయిసచ్చరిత్ర పారాయణ చెయ్యమన్నారు.వారు మాకు ఇచ్చిన మందు అదే.
వారి పలుకులే,వారి ఆశీస్సులే మాకు మందు.వారి ఆదేశానుసారమే చేసాము.ఆ సాయీశుని కృప,గురుదేవుల ఆశీస్సుల వల్ల ఆపరేషన్ అవసరం లేకుండానే కేవలము మూడు మాసముల లోగానే ఆమె పూర్తిగా స్వస్థత పొంది,ఈరోజు హాయిగా నడుచుకుంటూ,ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించుకుంటూ,సాయిమందిరానికి వెళ్తూ ఆ భగవానుని దర్శించుకోగల స్థితిలో ఉంది.
ఆనాటి నుండి మా జీవితా పంధాయే మారిపోయింది.మాకు సర్వం శ్రీ సాయియే…శ్రీ గురువుగారే…ఎంతటి కష్టాన్నైనా బాబా,గురుదేవులను చూచుకుంటూ వారి స్మరణయే ధ్యేయంగా జీవిస్తున్నాము.
ప్రతి విజయదశమికి తప్పనిసరిగా శిరిడివెళ్లి,శ్రీ సాయినాథుని,పూజ్య గురుదేవులను తనివితీరా దర్శించుకొంటూ,వారి కృపాకటాక్షములతో ఈనాడు ఏ చీకూ,చింతా లేకుండా జీవితం ఆనందంగా గడుపుతున్నాము.
మాకు సర్వం శ్రీ సాయియే,గురువుగారే…ఏ బాధ కలిగినా “నేనుండగా మీకెల భయం” అని అభయమిస్తూ,మమ్ములను కాపాడుకొంటున్నారు పూజ్య గురుదేవులు.
మీ వళ్లిగారి శివప్రసాద్,నెల్లూరు-2.
సెల్:9247486079
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ నాంపల్లి బాబా, శ్రీ రామిరెడ్డి తాత)
- బాబా నిన్ను గొడుగు పట్టి ఇక్కడకు తీసుకు వచ్చారు. ఎవరినీ ఏమి అడగకు….శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)
- బాబా పాదపద్మముల ఛాయాచిత్రాన్ని పంచుట.
- శ్రీ సాయిబాబా అనుగ్రహమునకు శ్రీ భరద్వాజ గారు పాత్రులగుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments