సాయిబాబావారి సమాధి మందిరములో, గురూజీ బాబా ఒడిలో ధ్యానం చేసుకుంటూ కనిపించారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

 తేదీ :15-01-2011

పూజ్యులు గురుదేవులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ,శిరిడీలో వారు ప్రసాదించిన దివ్యసాక్షాత్కారాన్ని మీ అందరితో  పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందoగా ఉంది.

గురుదేవుల ప్రథమ ఆరాధనోత్సవాలు ఎంతో బ్రహ్మాండముగా కనీవినీ ఎరుగని రీతిలో శిరిడీలో జరుగుచుండగా తేదీ 15-01-2011 సాయంత్రం ధూప్ఆరతి (సంధ్యా ఆరతి)కి సాయిబాబావారి సమాధి మందిరములోకి పోయి ఎంతో ఆనందముగా సంధ్యాఆరతి మేము డయాస్ ముందు నుండి పాడుకున్నాము.

ఆరతి అయిపోయిన తరువాత మాముందర ఉండే భక్తులను వరుసగా బాబా దర్శనానికి సెక్యురిటీ వాళ్ళు పంపుతున్నారు.

గురువుగారు బాబా వడిలో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొంటూ కనిపించారు.నేను కళ్ళునులుముకొని,నన్ను నేను గిచ్చుకొని మరలా చూశాను.గురూజీ బాబా వడిలో ధ్యానం చేసుకుంటూ కనిపించారు.

నేను ఎంతో ఆనందంతో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై  సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై అని జై కొట్టాను.

నా ఆనందాన్ని శిరిడీలో సద్గురు లీల సంపాదకుడు ఈమని మల్లిబాబుతో పంచుకున్నాను.వారు ఎంతో ఆనందించారు.

నాకు సమాధి మందిరంలో “సాక్షాత్కారము” ప్రసాదించిన గురుదేవులకు మరొక్కమారు సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ జీవితాంతము మమ్ములను ఇలానే కనిపెట్టుచూ కాపాడవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

వారు ఎక్కడికీ పోలేదు బాబా వద్ద కూర్చుని మన సమస్యలను,కోరికలను బాబాకు నివేదిస్తున్నారని నాకు అనుభవమైంది.

కండ్రిగ సురేష్,విద్యానగర్,నెల్లూరు జిల్లా.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles