Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 15.10.1918 బాబా మహా సమాధి చెందిన తరువాత కూడా బాబా తన లీలలను ఎందరో భక్తులకు కలుగ చేస్తూనే ఉన్నారు.
అటువంటి లీలలతో “ఆంబ్రోసియ ఇన్ షిరిడీ’అని పుస్తక రూపంలో శ్రీ శివనేశన్ స్వామీజీ గారి ప్రేరణతో శ్రీ రామలింగస్వామి గారు రచించారు.
అందులోని 84వ.లీల ఇప్పుడు మీరు చదవబోయేది.
ఇది శ్రీసాయి లీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబరు, 2005 సంచికలొ ప్రచురింపబడిది.
ఆ సంచికనుండి గ్రహింపబడింది.బాబా పక్షవాతం తగ్గించుట (శ్రీ వి.నాగార్జున రావు, హైదరాబాదు వారి ప్రాణస్నేహితుని కుమార్తెకు వచ్చిన పక్షవాతాన్ని బాబా నయం చేయుట)1975వ.సంవత్సరంలో నా స్వంత పని మీద నేను బొంబాయి వెళ్ళాను.
బొంబాయిలో చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలన్నిటినీ చాలా చూశాను.హటాత్తుగా నాకు షిరిడీ కూడా వెళ్ళాలనిపించింది.
ఇందులో భక్తికన్నా చూడాలనె కుతూహలం తప్ప మరేమీ కాదు.
కాని అమెరికానించి నా బావమరిది వస్తున్నందువల్ల షిరిడి వెళ్ళే ప్రయత్నానికి ఆటంకం కలిగి మానుకోవలసిన పరిస్థితి ఎదురయింది.
నాకు చాలా నిరుత్సాహం కలిగింది. నువ్వే కనక దేవుడివయితే నాకు షిరిడీ దర్శించే భాగ్యం కలుగ చేయమని బాబాని ప్రార్ధించాను.
ఇంతలో ఒక ఆసక్తికరయమయిన సంఘటన జరిగింది.
తను ప్రయాణం చేసేటప్పుడు మార్గం మధ్యలో మరొక విమానం ఎక్కడానికి ఎక్కువ సమయం వుండాల్సి వస్తుందనీ అందుచేత తను రావడం వాయిదా వేసుకున్నానని టెలిగ్రాం ఇచ్చాడు.
అలా అనుకోని విధంగా నాకోరిక నెరవేరడంతో నాహృదయంలో నమ్మకమనే బీజాలు నాటబడ్డాయి.
నాకు షిరిడీ గురించి ఎవరన్నా సమాచారం ఇస్తే బాగుండుననుకొన్నాను.అంధేరీ నుండి దాదర్ కు వెళ్ళే లోకల్ రైలులో ప్రయాణం చేస్తున్నాను.
అప్పుడే నాకు ఒక సాయి భక్తునితో పరిచయం కలిగింది. నాకతను షిరిడీ గురించి అన్ని వివరాలు చెప్పాడు.
మొట్టమొదటిసారిగా నాకు షిరిడీ ప్రయాణం కల్పించి బాబా నన్ను తన వద్దకు రప్పించుకుంటున్నారని, ఇది అంతా ముందే నిర్ణయింపబడిందనీ ఋజువయింది.
షిరిడీ చేరుకున్నాక స్నానం చేసి బాబా దర్శనానికి వెళ్ళాను.మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఒక్క క్షణం, ప్రతి చోట బాబా తప్ప నాకేమీ కనిపించలేదు.
నాజీవితమంతా ఆయన అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని, ఆయన ఓదార్పు నాకెప్పుడూ కావాలని ప్రార్ధించాను.
షిరిడీలో దొరికిన పుస్తకాలన్నిటినీ చదివాను.
బాబా మానవాతీతుడని, సర్వత్రా నిండి ఉన్న భగవంతుడనే భావన నాలో కలిగింది. అప్పటినుండీ నాలో బాబా మీద నమ్మకం స్థిరంగా వృధ్ధిపొందింది.నాప్రాణ స్నేహితునికి ఒక అమ్మాయి.
ఆమెకు పక్షవాతం వచ్చి చెయ్యి కదపలేకపోయేది.వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో నాస్నేహితుడు చాలా బాధపడుతూ ఉండేవాడు.
ఇంక ఆమెకు నయం కాదనే విచారంతో కృగిపోయాడు. నేనతనికి షిరిడీ నుండి తెచ్చిన ఊదీనిచ్చి బాబా మీద పూర్తి విశ్వాసంతో ఆయన దయ చూపమని ప్రార్ధిస్తూ పక్షవాతం వచ్చిన చేతికి రాయమని చెప్పాను.
తనకి బాబా మీద నమ్మకం లేకపోయినా, నేను పట్టుపట్టడంతో ఆవిధంగా చేయడానికి ఒప్పుకున్నాడు.
ఊదీతోనే కనక అమ్మాయికి పక్షవాతం తగ్గిపోతే తను బాబాని భగవంతునిగా పూజిస్తానని అన్నాడు.
ఊదీ రాసిన తరువాత బ్రహ్మాండమయిన ఫలితం కనపడింది. తొందరలోనే అమ్మాయి కోలుకొంది. వైద్యం కూడా బాగా పనిచేసింది. వైద్యం చేస్తున్న డాక్టర్ కి కూడా తన వైద్యం వల్లే అమ్మాయికి బాగయిందనే పూర్తి నమ్మకం కలగలేదు.
డాక్టర్ కి కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
నా స్నేహితుడు సాయిబాబాకి గొప్ప భక్తుడయిపోయాడు.ఎవరయిన ఆయనమీద దృష్టి పెట్టి ప్రార్ధిస్తే చాలు, మన ప్రార్ధనలని ఆయన వింటారు. మనలని అనుగ్రహిస్తారు.
అదే ఆయన మనయందు చూపించే దయ.సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు, 2005 సంచికనుండి గ్రహింపబడినది.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !
- తన్ను భగవంతునిగా తలచుటకు భక్తుని ఆస్తమా వ్యాధిని తగ్గించుట–Audio
- భక్తురాలి ఆర్తిని అర్ధం చేసుకొని ఎండవేడిని వర్షం రూపంలో తగ్గించుట
- బాబా పంపిన ఊదీ
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – మొదటి భాగం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments