Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా చూపించిన వాత్స్యల్యం, కరుణ, అనురాగం, ఆప్యాయత మరువలేనివి. బాబా ఎటువంటి అద్భుతాన్నయినా చేయగలరని ఈ లీల చదివితే తెలుస్తుంది.
శ్రీమతి ప్రియాంకా గారు అనుభవం
సాయి భక్త పాఠకులారా, ప్రతి నెల నేను అన్నదానానికి షిరిడీకి కొంత డబ్బు పంపిస్తూ ఉంటాను. నేను పంపించే డబ్బు ప్రతీ నెలా మారుతూ ఉంటుంది. ఒక్కొక్క సారి 1000 రూపాయలు పంపుతూ ఉంటాను. బీదలకు నేను ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు 101 రూపాయలు షిరిడీకి పంపుతూ ఉంటాను.
అక్టోబరు నెల 1 వ తారీకున నేను షిరిడీకి 101 రూపాయలు మనీ ఆర్డరు చేసాను. గత కొద్ది నెలలుగా నావద్ద ఊదీ పాకెట్లు తక్కువగా ఉన్నాయనీ, ప్రపంచ వ్యాప్తంగా నేను అందరికీ ఊదీ పాకెట్లు పంచుతున్నానని అందుకని నాకు కొన్ని ఊదీ ప్యాకెట్లు పంపమనీ సంస్థాన్ వారిని కోరాను.
నేను పంపిన మనీ ఆర్డరుకు సంస్థాన్ నించి నాకు రెండు వారాల క్రితం చిన్న ఊదీ ప్యాకెట్, ప్రసాదం వచ్చాయి. నేను దానితో సంతృప్తి చెందాను. కాని బాబా నిన్న నా అంతర్గత కోరికను తీర్చారు. షిరిడీ సాయి సంస్థాన్ నించి నాకు మరలా కొరియర్ లో పెద్ద ఊదీ ప్యాకెట్ (250 గ్రా.) వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
షిరిడీలో అన్నదానానినికి నేను పంపిస్తున్న 101 రూపాయలకు అంతకు ముందెప్పుడు అంత ఊదీ ప్యాకెట్ వారు పంపించలేదు. అంత పెద్ద ఊదీ ప్యాకెట్ ను కూడా నేను అంతకు ముందెప్పుడూ చూడలేదు. నేను పంపిన 101 రూపాయలకి ఊదీ ప్యాకెట్ వచ్చింది. మరి మరలా ఇంత పెద్ద ఊదీ పాకెట్ చందా రసీదుతో రావడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
ఏమయినప్పటికీ ఒక సాయి భక్తురాలిగా నాకు అంత పెద్ద బహుమతీ రావడం చాలా సంతోషం వేసింది. క్రితం రోజు రాత్రి బాబా విగ్రహాము నుండి ఊదీ రాలుతున్నట్లుగా నాకు కల వచ్చింది. నాకు ఆ కలకి అర్థం తెలియలేదు. నాకు షిరిడీ నించి పెద్ద ఊదీ ప్యాకెట్ రావడం వల్ల ఆవిధగా కల వచ్చి ఉండవచ్చనుకున్నాను.
కాని ఈ రోజు అనగ బాబా రోజు ఉదయం మరొక పెద్ద ఊదీ పాకెట్ వచ్చింది. సాయి నా మీద కురిపించిన వాత్సల్యానికి నా కళ్ళు చెమర్చాయి. నావద్ద తగినంత ఊదీ లేదని బాబాకు తెలుసు. కాని నేను కావలసిన వారికందరికీ ఊదీ పంపుతూ ఉంటాను. అందుచేతనే బాబా నాకు బాబా తన అద్భుతమైన లీలను చూపించారు. ఇప్పుడు మాయింటిలో అర కేజీ ఊదీ ఉంది. అదీ షిరిడీ నించి వచ్చినది. బాబా చూపించిన ఈ లీలని మన సాయి భక్తులందరితోనూ పంచుకుంటున్నాను.
మీరు కూడా మీ మీ అనుభవాలను పంపండి.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మనసెరిగిన బాబా – పంపిన ఊధీ ప్రసాదం
- బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన అద్భుత లీల(ఇందిరా గారి అనుభవాలు)–Audio
- బాబా నైవేద్యంలో ఊదీ మహిమ.
- ఊదీ బాబా రక్షణకు, అనుగ్రహానికి చిహ్నం ………!
- సమయానికి అందిన బాబా ఊదీ–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబా పంపిన ఊదీ”
Maruthi.Velaga
February 22, 2017 at 3:04 amJai Saibaba☺.