Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sri Ram
- Mir-228-బాబా ఊదీ 3:18
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఈ రోజు విక్రం గారి ఊదీ మహిమ గురించి వారి మాటలలోనే తెలుసుకుందాము.
నా పేరు విక్రం. నాకు బాబాగారంటే అనన్యమైన భక్తి.
బాబాగారు ఎప్పుడూ కూడా నా క్షేమం పూర్వము, ఇప్పుడూ కూడా చూస్తూ ఉన్నారు. నేను నా కుటుంబానికి దూరంగా అమెరికాలో ఉంటున్నాను.
ముఖ్యంగా మా అమ్మగారితో కూడా. అందుచేత బాబాగారే నా తల్లి. భారతదేశంలో మా అమ్మగారు నాన్ను ఎలా చూసేవారో అలా బాబాగారే నాకు అన్నీ చూస్తున్నారు.
నేను ప్రతి విషయంలోనూ బాబాగారిని సాయిమా అనే పిలుస్తుంటాను.
బాబాగారి యొక్క ప్రేమానుభూతిని ఇప్పుడు మీకు చెపుతాను. క్రితం సంవత్సరం మేము కొంతమందిమి కలిసి 8 గంటల రోడ్డు మీద ప్రయాణం పెట్టుకున్నాము.
కాని నాకు ఈదేశంలో కారు ప్రయాణమంటే భయం యెందుకంటే ఇక్కడ డ్రైవర్లు చాలా వేగంగా నడుపుతూ ఉంటారు.
మా ప్రయాణానికి కొన్నిగంటలు ఉందనగా నేను కూర్చుని సాయి సచ్చరిత్ర పుస్తకంలోని మొదటి అథ్యాయంలోని కొన్ని పేజీలు యాదృచ్చికంగా తిరగేసాను.
దానిలో బాబాగారు తన భక్తులకి ఇచ్చే ఊదీ, ఊదీ మహిమలగురించీ సంబంధించిన ప్రస్తావన ఉంది. పుస్తకం మూసేసి, ప్రయాణానికి ముందు నా నుదిటి మీద ఊదీ పెట్టుకుందామని అనుకున్నాను.
ప్రయాణానికి అన్నీ సద్దుకుంటూ, బీరువాలోనించి ఒక చొక్కా తీసుకున్నాను.
ఆ చొక్కా మీద నాకు అంత పెద్దగా ఇష్టము లేదు, చాలా అరుదుగా వేసుకుంటూ ఉంటాను.
ఈ ప్రయాణంలో ఈచొక్కా వేసుకుందామనుకున్నాను.
ఈ చొక్కా ఈ ప్రయాణానికి యెందుకు తీసానో ఇప్పటి వరకు నాకే తెలియదు.
చొక్కా జేబూలలో యేమన్నా ఉన్నయేమో చూద్దామని అన్ని చెక్ చేయడం మొదలుపెట్టాను.
ఒక జేబులో చెయ్యి పెట్టేసరికి చేతికి యేదొ పొడిలాగ తగిలింది.
ఆ పొడి యేమిటొచూద్దామని చేతిని బయటకు తీశాను.
అది బూడిద రంగులో ఉన్న పొడి. జేబులో ఇంకా లోతుగా చెయ్యిపెట్టి తీసేసరికి ఆశ్చర్యంగా, అదీ ఒక చిన్నపాకెట్.
దాని మీద “శ్రీ షిరిడి సాయి సంస్థాన్” అని పేరు ఉంది. అది ఒక ఊదీ పాకెట్.
ఆ పాకెట్ కొంచెం చిరిగిఉంది, అందుచేట కొంచెం ఊదీ జేబులో అంతా ఒలికిపోయి ఉంది.
నేను నమ్మలేకపోయాను,. చరిత్రలో ఊదీ గురించి చదివి ఊదీ కావాలనుకున్న 15 – 20 నిమిషములలోనే ఇది జరిగింది.
నేను ఆఖరిసారిగా ఇండియా వచ్చినప్పుడు నా సోదరుడు ఈ చొక్కా నాకు బహూకరించాడు.
నేను ఇండియా ఎప్పుడు వచ్చినా కూడా షిరిడీ వెడుతూంటాను.
నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ చొక్కా వేసుకుని వుంటాను.
అప్పుడు ఈ ఊదీ పాకెట్ జేబులో వేసుకుని మర్చిపోయాను. ఈ ఊదీ లభించడం నా అదృష్టం. బాబాగారు ప్రతీదీ కూడా మనకు యెప్పుడు యేదికావాలో అది లభించేటట్లు యేర్పాటు చేస్తూ ఉంటారు.
ఈ ఊదీ కూడా ఆయన ఇలా యేర్పాటు చేసినదే. ఇక నేను యెటువంటి చింతా పెట్టుకోకుండా ఊదీని నుదిటి మీద పెట్టుకుని ప్రయాణానికి సిథ్థమయ్యాను.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- “నేను వున్నాను, సమయానికి వస్తాను..” అని నిరూపించుకున్న బాబా వారు
- యాక్సిడెంట్ జరిగే సమయానికి మా పాప నాతో ఉండకుండ చూశారు బాబా–Audio
- బాబా పంపిన ఊదీ
- బాబా పై భక్తి , ఊదీ మహత్యం …..!
- బాబా ఊదీ మహిమతో ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు మాయమగుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments