బాబా ఊదీ మహిమతో ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు మాయమగుట.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సాయినాథాయ నమః

జమీలా బేగం గారి అనుభవములు మూడవ మరియు ఆఖరి భాగం

ఇంకా, ఇంకా బాబా అంటే మాకు ప్రేమ పెరిగింది. పూజ కూడా చేస్తుంటాము, బాబా గుడికి కూడా వెళుతూంటాం.

మా మతంలో సాయంత్రం 6 గంటలకి ‘రోజు’ మొదలవుతుంది, హిందువులకి ఉదయం ‘రోజు’ మొదలవుతుంది.

మా మతంలో మేము అందరమూ ఖురాన్‌ చదువుతాము, చదివి ఆ పుణ్యం మా పెద్దలకి చెందాలని, అల్లా కి ప్రార్దన చేస్తాం.

ఫకీర్లు అని ఒక తెగవారున్నారు, వారు ముఖ్యమైన రోజులలో అవసరమైనప్పుడు అందరిని “సై-ఈ” అని నిద్ర లేపుతారు.

‘భక్త మహాల్సాపతి’కి ఈ సంగతి తెలిసి వుంటుంది, బాబాని “సై-ఈ”అని అనివుంటాడు. అది కాలాంతరంలో ‘సాయి’గా రూపాతరం చెందింది అని నా కనిపిస్తుంది. అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు.

మావారు కొద్దిరోజులలో చనిపోతారనంగా, ఒక రోజు మావారు ఇంట్లోనే ఉన్నారు, నేను కరివేపాకు కావలసివచ్చి అలా వీదిలోనికి వెళ్లాను, నేను తిరిగివచ్చేటప్పుడు మా సందు మొదట్లో ఒకాయన నిలబడి ఉన్నాడు.

ఆయన పాత బట్టలతో, మాసిపోయిన గడ్డంతో, భుజాన ఒక జొలితో వున్నాడు. నాకు ఆయన ‘బాబా’ అని అర్ధం అవుతోంది. కాని నేను ఏమి చేయలేక పోతున్నాను. నాకు అడుగులు పడడం ఆగిపోయాయి.

నేనాయన్ని చూస్తున్నాను. ఆయన నన్ను చూస్తున్నాడు. నన్ను చూస్తూనే చెయ్యి పై కెత్తి వేలు పైకి పెట్టి అక్కడే గుండ్రంగా తిప్పుతున్నాడు. “నువ్వు బాగా దాన ధర్మాలు చెయ్యాలి అమ్మా” అన్నాడు.

నేను మూగదానిలా సరే అని తల వూపాను. నా వెనకాల ఆయన ఇంటి దాకా వచ్చాడు, మా ఇంటి అరుగు చూపించి “ఇక్కడ కుర్చోనా” అని అడిగాడు. నేను పర్వాలేదు లోపలికి రమ్మనమన్నాను, ఆయన లోపలికివచ్చి “నువ్వు అమృతసర్‌ పోలేదా?” అని అడిగాడు,

నేను పోలేదు అన్నాను, అతను ఎందుకు వెళ్ళలేదు అన్నాడు, నేను కుదరలేదు అన్నాను,

జీవితంలో ఒక్కసారన్నా వెళ్ళాలి అన్నాడు. నేను సరే నన్నాను. నాకు ఒక కప్పు టీ ఇస్తావా అన్నాడు. నేను సరే అన్నాను.

నేను టీ పెట్టడానికి లోపలికి వెళ్ళాను, ఈ లోపల మా కోడలితో ఎదో మాట్లాడాడు. మావారు మాత్రం ఆయన వచ్చి వెళ్ళేంతవరకూ కూడా బాత్రూమ్‌ లోంచి బయటకు రాలేదు.

నేను టీ తెచ్చి ఇచ్చాను, అయన టీ తాగి తన జోలె లోంచి ‘ఊధీ’ తీసిచ్చి అందర్నీ నుదుటన పెట్టుకోమని, కొంచెం నీటిలో కలుపుకొని తాగమని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆయన కనక మావారిని చూసి వుంటే ఆ పుండు తగ్గి బ్రతికే వుండేవారేమో అనిపిస్తూంటుంది.

మా ఇంట్లో ఎవరో ఏదో మందు పెట్టారని ఎవరో చెప్పారు, దాని పర్యవసానంగా మా ఇంట్లో అక్కడక్కడ రక్తపు మడుగులు, రక్తపు చుక్కలు కనిపించేవి.

నాకు చాలా భయంగా వుంటుండేది. ఇల్లు మారిపోదాం అని మా వారితో అన్నాను, ఆయన కూడా అదే మంచిదని అంటే వేరే ఇల్లు చూసుకొని అక్కడికి మారిపోయాం.

అక్కడా ఇదే తంతు, దానికి తోడు మా అత్తగారు కూడా పిచ్చి పట్టినట్లు పెద్దగా అరుస్తూ వుండేది. నాకింకా భయం పెరిగిపాయింది.

అప్పుడు ‘బాబా’కి మొక్కుకున్నాను, “బాబా ఏమిటీ పరిస్థితి నాకేమో భయంగా ఉంటోంది, నువ్వ ఏదొ ఒకటి చేయి అని రోజూ ‘“ఊధి” పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను.

కొద్ది రోజులలో పరిస్థితి అంతా చక్కబడింది. రక్తం కనబడడం ఆగిపోయి,మా అత్తగారుకూడా బాగానే వుంటూ వచ్చారు.

అల్లా మాలిక్‌, అల్లా అచ్చా  కరేగా.

సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles