బాబా గారు తన దుస్తులు తానే ఎన్నుకొనుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా గారు తన దుస్తులు తానే ఎన్నుకొనుట

ఈ రోజు శ్రీమతి ప్రియాంకా గారి పోస్ట్ కి తెలుగు అనువాదము మీకు అందచేస్తున్నాను

ఈ లీల ని పోస్ట్ చేస్తున్నప్పుడు నేను నా మొదటి షిరిడి యాత్ర గుర్తుకు తెచ్చుకుంటున్నాను. బాబా గారు నేను తెచ్చిన దుస్తులు స్వీకరించారు, తరువాత ఎన్నో లీలలను చూపించారు, తలుచుకుంటే నాకు మాటలు రావడంలేదు.

బాబా గారు చెప్పిన మాటలెప్పుడు అసత్యాలు కావు అన్నది సత్యం. బాబా గారు మనకి అన్నివిషయాలు కూడా సూచనల ద్వారా తెలియపరుస్తారు, వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి వాటిని మనం మిస్ అవుతూ ఉంటాము.

కొన్ని రోజుల క్రితం నాకు విద్యా వద్ద నుంచి మెయిల్ వచ్చింది. అందులో ఆమె తను బాబా గారికి బట్టలు ఇద్దామనుకొంటున్నట్లు, వాటిని ఎక్కడ ఇవ్వాలో తెలియచేయమని అడిగింది. నేను బాబా గారికి బట్టలు ఎక్కడ ఇచ్చానో, మరియు బాబా గారికి వాటిని ఆరోజే ధరింపచేసిన వైనం గురించి చెప్పాను.

తరువాత ఆమె షిరిడి వెళ్ళిపోయింది, ఒక వారం తరువాత ఆమెనుంచి, షిరిడీలో తనకు బాబా గారు చూపిన చమత్కారం గురించి మెయిల్ చేసింది. ఆమె యిచ్చిన మెయిల్ ని యిక్కడ ఇస్తున్నాను. బాబా గారు తన పిల్లలపై కురిపించే ప్రేమ ఎలా ఉంటుందో ఈ లీల చదివితే అర్థం అవుతుంది.

“సాయిరాం, ప్రియాంకా అక్కా, నేను షిరిడి వెళ్ళే ముందు బాబా గారికి బట్టలు ఎక్కడ ఇవ్వాలి, ఎలా సమర్పించాలి చెప్పమని నీకు మెయిల్ ఇచ్చాను, గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నాకు కలిగిన అనుభవం గురించి నీకు చెపుతున్నాను.

నేను షిరిడి వెళ్ళేటప్పటికి రాత్రి 9.30 అయింది. వెంటనే భక్త నివాస్ కి ఎప్పుడూ వెళ్ళేలాగే వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 390 మంది గదుల కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. నా నంబరు 359. మాకు క్రితంసారి దొరికినట్టే ఈసారి కూడా గది దొరుకుతుందనుకున్నాను, కాని ఈసారి అంత అదృష్టం లేదనిపించింది.

మొదటగా మేము శేజ్ ఆరతి కి వెళ్ళాము. నేను వరుసలో నుంచున్నప్పుడు, అందరూ నన్ను తోసేస్తుంటే బాబా గారిని చూడలేకపొయాను. నేను చాలా పొడవుగా ఉన్నానని, తాము బాబాని చూడలేకపోతున్నామని నా వెనక ఉన్న ఆడవాళ్ళు నన్ను వెనుకకు వెళ్ళమన్నారు. నేను వెనకకు రాగా యింకా కొంతమంది ఏదో అనగా, మరలా వెనక్కి వెనక్కి వచ్చాను.

నాకు కోపం వచ్చి, ఏడుపు వచ్చింది. ఇప్పుడు నేను నుంచున్న చోటు నుంచి, నేను బాబా గారిని చాలా చక్కగా పూర్తిగా చూడగలిగాను. బాబా గారిని అంత చక్కగా చూసేలా ఉన్న చోటులో ఉన్నందుకు నేను చాలా సంతోషించాను.

నేను భక్తనివాస్ కి వచ్చేటప్పటికి, ఒక వ్యక్తి వచ్చి “మీరు ఎక్కడినుంచి వస్తున్నారు? మీ టొకెన్ నంబర్ చూపించండి” అని అడిగాడు. అతను వెళ్ళిపోగానే మరొక వ్యక్తి వచ్చి, నాకు గది ఇచ్చాడు. నేనెప్పుడు షిరిడి వచ్చినా బాబాగారే ఒక తండ్రిలాగా నాకు అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తారనిపించింది.

మరునాడు ప్రొద్దున్న 7 గంటలకి నేను బాబా గారికి తయారు చేసిన దుస్తులు తీసుకుని సమాధి మందిరానికి వెళ్ళాను. డొనేషన్ కౌంటర్ లో దుస్తులిచ్చి, అక్కడ కౌంటర్లో కూర్చున్న వ్యక్తిని బాబా గారికి ఈ దుస్తులు ఎప్పుడు వేస్తారు అని అడిగాను. 4 రోజులు వెయిట్ లిస్ట్ లో ఉన్నానని చెప్పాడు. అంటే నాలుగు రోజుల తరువాత గాని నేనిచ్చిన దుస్తులు బాబా గారికి వేయడం కుదరదన్న మాట.

నేను అతనితో, “బాబా గారికి నేను తెచ్చిన దుస్తులు ఈ రోజే వేయండి, బాబాగార్ని నేనిచ్చిన దుస్తులలో చూసి వెడదామని ఉంది” అని అర్థించాను. అతను, ప్రొద్దున్న 10.30 కి నమ్మకంగా చెపుతానన్నాడు. ఆ సమయానికి నేను సమాధి మందిరానికి వెళ్ళి బాబా గారిని దర్శించుకుని, అక్కడున్న పూజారి గారితో నేను బాబా గారికి ఇచ్చిన దుస్తుల గురించి చెప్పాను.

అప్పుడా పూజారి గారు, బాబా గారు కనుక నేను తెచ్చిన దుస్తులు స్వీకరించేటట్లయితే, స్వయంగా ఆయనే పిలిచి, దుస్తులు ధరిస్తారని చెప్పారు. 10.30 కి నేను మరల డొనషన్ కౌంటర్ వద్దకు వెళ్ళి అడగ్గా, కౌంటరులో ఉన్న వ్యక్తి, “మేడం, ఇంకా 2 రోజుల నిరీక్షణ జాబితా ఉంది, ఈ రోజుకు కుదరదు” అని చెప్పాడు. నేను “సరే” అని మెల్లగా నడుచుకుంటూ గురుస్థానానికి వెళ్ళాను. నా కళ్ళంట కన్నీరు వస్తోంది, నాకు చాలా విచారంగా ఉంది.

(నిజానికి కొన్ని రోజుల ముందు నేను వెబ్ సైట్లో బాబాగారి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను. అందులో చాలా మంది బాబా గారికి దుస్తులు ఇవ్వడం, అక్కడి పూజారి దుస్తులను బాబా గారికి తాకించి తిరిగి భక్తులకి యిచ్చి వేయడం చూశాను. నేను మా అమ్మగారితో మనం కూడా బాబా గారికి దుస్తులు ఇద్దామని చెప్పాను. అప్పుడు మా అమ్మగారు “బాబా గారికి తాకించి మరలా మనకి ఇచ్చేస్తారు” అని చెప్పారు. అప్పుడు నేను బాబాగారికి నేనంటే ఇష్టమయితే ఈ దుస్తులను బాబా గారు ఉంచుకుంటారు అని చెప్పాను.

సాయంత్రము హఠాత్తుగా నేను భక్తుల అనుభవాలు పుస్తకము తెరిచినప్పుడు ఒక పేజీలో ఒక భక్తుని అనుభవం నా కంటబడింది. అందులో, ఒక భక్తుడు రేగే బాబా గారికి యివ్వడానికి దుస్తులు తీసుకెళతాడు. అవి బాబా గారికి తాకించి మరలా తిరిగి ఇచ్చివేస్తారని తెలుసు.

అందుచేత అతను బాబా గద్దె వద్దకు వెళ్ళి, అతని పాదాలని ముట్టుకుని మెల్లగా ఈ దుస్తులని బాబా ఆసనం కింది పెట్టేసారు. కొంతసేపయిన తరువాత బాబా లేచి తమ ఆసనం దులిపివేయమని చెప్తారు. అప్పుడు కనిపించిన ముస్లిన్ క్లాత్ చేతిలోకి తీసుకుని బాబా తన శరీరం మీద వేసుకుని, అతని వైపు చూస్తూ ఇది నాది దీనిని తిరిగి యివ్వను అని రేగే వైపు చూసి నవ్వుతారు. అంతటితో రేగే చాలా ఆనందం కలుగుతుంది)

ఈ పేజీ చదువుతున్నప్పుడు బాబా గారు నేనిచ్చే దుస్తులు తీసుకుంటానని సూచన చేస్తున్నట్లుగా నాకనిపించింది. గురుస్థాన్ వద్ద దుఃఖిస్తూ ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ, “బాబా నువ్వే కనుక నన్ను నిజంగా ప్రేమిస్తుంటే, నువ్వు నేనిచ్చిన దుస్తులు వేసుకోవాలి. నీమాటలెప్పుడూ అసత్యాలు కావు” అని మనసులో అనుకున్నాను. నేను మా అమ్మగారి వైపు చూస్తూ ఏడుస్తున్నాను. మా అమ్మగారు “నాలుగు రోజుల తరువాత వేస్తారు కదా, యేమయింది?” అని అన్నారు.

నేనింకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. హఠాత్తుగా ఒక గంట తరువాత వాచ్ మన్ నన్నుచూసి పిలిచారు. అతను ఎవరినో పిలుస్తున్నాడనుకున్నాను, కాని అతను నన్నే చూసి పిలిచారు. అతను నన్ను ఆఫీస్ లోకి తీసుకెళ్ళారు. అంతకుముందు, కౌంటరులో రెండు రోజులదాక ఆగమన్న వ్యక్తి ఇప్పుడు ఇలా చెప్పాడు,

“ఇప్పుడే నేను మందిరంలో మీరిచ్చిన దుస్తులు ఇచ్చి వస్తున్నాను. ఇవాళ 12 గంటలకి మధ్యాహ్న హారతికి బాబాగారికి దుస్తులు వేస్తారు, లేకపోతే సాయంత్రము ధూప్ హారతికి వేస్తారు” అని చెప్పాడు. నాకు ఇది వినగానే చాలా సంతోషం వేసింది, ఆనందాశ్రువులు రాలాయి. సాయంత్రము ధూప్ హారతికి బాబాగారికి నేనిచ్చిన దుస్తులు వేశారు. బాబా గారు ఆ దుస్తులలో చాలా అందంగా కనిపించారు. నేను మాఅమ్మగారు ఒకళ్ళ కొకళ్ళం కౌగలించుకుని ఏడ్చేశాము.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles