Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఖండోబామందిరంలో.’’ చెప్పారు బాబా. కాశీనాథ్‌ని అక్కడే నెలవు ఏర్పరచుకోమన్నారు. బాబా చెప్పిన మీదట కాదనలేదు కాశీనాథ్. ఖండోబామందిరంలోనే నెలవేర్పరుచుకున్నాడు.
మూడున్నర ఏళ్ళపాటు ఏకాగ్రతగా ధ్యానంలో నిమగ్నమయిపోయాడు. ఎందరు ఎన్ని ఒత్తిళ్ళకు గురి చేసినా మందిరాన్ని వీడలేదతను. ఇంకొద్ది రోజుల్లో తాను ఆశించిన స్థితికి కాశీనాథ్ చేరుకుంటాడని బాబా అనుకుంటున్న తరుణంలో, ఖండోబామందిరాన్ని విడిచి వెళ్ళిపోతానని పట్టుబట్టాడు కాశీనాథ్.‘‘వద్దు’’ అన్నారు బాబా. వినలేదతను.
మందిరాన్ని వదలి, షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు కాశీనాథ్.కొన్నేళ్ళు గడిచిపోయాయి.దేశాటన చేసి చేసి అలసిపోయాడు కాశీనాథ్. తిరిగొచ్చాడు. వచ్చి, షిరిడీ సమీపంలోని సాకోరి గ్రామంలో ‘ఉపాసిని బాబా’గా స్థిరపడ్డాడు.
దగ్గరకు చేరుకున్నాడని సంతోషించారు బాబా. సాకోరి గ్రామంలో ఉంటూ తరుచూ షిరిడీని సందర్శించేవాడు కాశీనాథ్. బాబాని దర్శించుకునేవాడు.
‘నమామీశ్వరం సద్గురు సాయినాథం’ మకుటంతో ‘శ్రీ సాయినాథ మహిమ్నాస్తోత్రం’ రచించాడు.
కాశీనాథ్ జీవించే ఉన్నాడని, షిరిడీకి సమీపంలోనే ఉన్నాడని తెలియని అతని అన్నగారు బాలకృష్ణ, తమ్ముడి కోసం వెదుకుతూ అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించసాగాడు.
గయ చేరుకున్నాడు. అక్కడ నివసిస్తున్న సాధువుల్ని తమ్ముని జాడ తెలియజేయాల్సిందిగా వేడుకున్నాడు. తన తమ్ముడు ఎలా ఉండేదీ రూపు రేఖలు కూడా తెలిపాడు.
అంతా విన్న ఓ సాధువు ఇలా అన్నాడు.‘‘మీరు ముందు షిరిడీకి వెళ్ళి బాబాని దర్శించండి. ఆయన సిద్ధ పురుషులు. యోగులు. వారు మీ తమ్ముడి జాడ తప్పక చెబుతారు.’’బాబా గురించి విన్నాడు బాలకృష్ణ.
అతను ముస్లిం అని, మసీదులో ఉంటాడని తెలుసు. అలాంటి వ్యక్తిని సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తను, తమ్ముడి జాడ గురించి అడగాలా? ఛఛ అనుకున్నాడు బాలకృష్ణ.
షిరిడీకి వెళ్ళే ఆలోచనే మానుకున్నాడు. గయలోనే గడపసాగాడు. అతను గయలో ఉంటూండగానే మరణించిన తండ్రికి తద్దినం పెట్టాల్సి వచ్చింది.
త్రివేణి సంగమం దగ్గర తద్దినం పెట్టి, పిండాలను కలిపేందుకు నదిలోకి దిగాడతను. పితృదేవతల్ని ప్రార్ధించి, నది నీళ్ళలోకి పిండాలను వదిలాడు. అతనిలా పిండాల్ని నీళ్ళలోకి వదిలాడో లేదో…నీళ్ళ అడుగు నుంచి రెండు చేతులు పొడుచుకుని వచ్చాయి. వదిలిన పిండాల్ని అందుకున్నాయి. వెంటనే అదృశ్యమయ్యాయి.
జరిగింది చూసి భయపడ్డాడు బాలకృష్ణ. ఆందోళన చెందాడు. పరుగు పరుగున గట్టు మీదికి చేరుకున్నాడు.కొన్నాళ్ళు గడిచాయి.బాలకృష్ణ వెను తిరిగాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘ఈ చేతుల్ని చూసిన గుర్తుందా నీకు?’’
- నీ బాధలు తీరాలంటే ఒకరే దిక్కు. ఆయనే షిరిడీ సాయిబాబా
- ఊధీ మహిమ – ఊపిరితిత్తుల వ్యాది మటుమాయం–Audio
- శుభ దినాన శుభ సంకల్పం – మహనీయులు – 2020 – జనవరి 1
- సాయి రసాన్ని చూపించిన రసాయన శాస్త్రజ్ఞుడు…..సాయి@366 జనవరి 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments