Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక గురుపౌర్ణమి నాడు మా వరంగల్ గుడిలో బాగా వేడుకగా ఉత్సవాలు చెయ్యాలని అనుకున్నాము, పల్లకీ సేవకి షిరిడీలో లాగా దుస్తులు కూడా ధరిస్తే బాగుంటుంది, అనిపించింది.
అలానే గొడుగు కూడా కావాలని అనిపించింది. ఆ దుస్తులు కావాలంటే, అలాంటివి ఎక్కడా దొరకవు. అవి మామూలు దుస్తులు కావు, కేవలం షిరిడీ లోనే ఉంటాయి,
అలాంటి డ్రెస్ ఇక్కడి టైలర్ కి చూపిస్తే కొంత వరకు కుట్టగలడు అనుకున్నాను, అలాంటివి చూపించడానికి అయినా ఉండాలి కదా! అని ఆరా తీస్తే ఒకాయన దగ్గర అచ్ఛంగా అలాంటి దుస్తులే ఉన్నాయని తెలిసింది,
ఆయనను మేము వెళ్లి అడిగాము, ఆయన రెండు సార్లు తిప్పించుకుని మేము కొలతలు తీసుకుని తిరిగి ఇచ్చేస్తాము, అని అన్నా ఇవ్వలేదు.
ఈ ఉత్సవాలు డ్రెస్సులు వేసుకుని, గొడుగులతోటి చేయాలనుకుంటున్నాము ,
బాబా ఏమి చేస్తావో మరి నీ ఇష్టం అని అనుకోంగానే, ఎవరో ఒకాయన పరిచయం అయ్యి విషయం తెలుసుకుని, షిరిడీ నుండి దుస్తులు, కోయంబత్తూరు నుండి గొడుగు తెప్పించి ఇచ్చారు.
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లుగా బాబాయే తలచుకుంటే, కాని కార్యం అంటూ ఉంటుందా? అంగరంగ వైభవంగా గురుపౌర్ణమి ఉత్సవాలు జరిగాయి .
షిరిడీలో శివకేశన్ స్వామి అన్న ఆయన శ్రీ సాయికి ”ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి” అని రాసి బాబాకి చూపితే ఆయన తన ఆమోదం తెలిపారట.
ఈ నామం ప్రపంచ వ్యాప్తంగా ఉండాలి అన్నారట. కొంతమంది “సాయిబాబా సాయిబాబా” అన్న నామం పలుకుతుంటారు, బాబా ఒక్కడే మరి నామాలు ఇలా వేరు వేరుగా ఎందుకు అంటున్నారు అని సందేహం కలిగి, సాయిబాబా సాయిబాబా అని నామం చెప్పే వారిని ప్రశ్నించడం జరిగింది.
వాళ్ళు ”శ్రీ సాయి సచరిత్రలో స్వయంగా బాబానే నా పేరు సాయి బాబా అని చెప్పారు కదా! అందుకే మేము అలా నామస్మరణ చేస్తున్నాము” అని అన్నారు, ఇది బాగుంది.
మరి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అన్న నామంలో ఏముందని నేను కలతపడి బాబానే అడిగాను.
”ఓం సాయి అన్నది గురుస్థానం, నిశ్శబ్దంగా ఉండి వేప చెట్టు కింద ధ్యానం చేసేవాడు ”శ్రీ సాయి ద్వారకామాయిలో అందరికీ సిరిసంపదలు అందిస్తూ, కోరికలు తీరుస్తూ ఉండటం”, ‘‘జయ జయ సాయి సమాధి మందిరంలో భక్తుల చేత కోరికలన్నీ తీరాక జయ జయ ధ్వానాలు అందుకుంటూంటాను” అని బాబా వివరించారు.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా గారు తన దుస్తులు తానే ఎన్నుకొనుట
- బాబా ఆపరేషన్ తన మీద వేసుకొని,తన భక్తుడిని రక్షించారు.
- నా నమ్మకమే బాబా. నాకు ఉన్న దిక్కు కూడా తనే.
- బాబాకు, అక్బర్ కు సంబంధించి, మహదీ బువా వివరించిన చిన్న కధ.–Audio
- శ్రీ షిరిడీసాయి వైభవమ్ తన భక్తుని బాధను బాబా అనుభవించుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments