Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సాయి భక్తులకు నమస్కారములు.
నేను చెప్పే కథ నా జీవితం లో జరిగిన, నా కథ.
మాదొక సాధారణ మధ్య తరగతి కుటుంబం. మా నాన్న పరమ భక్తుడు (ప్రతి ఒక్క దెవునికి, అందులో సాయి ఒకరు).
మా నాన్న కు పూజ అనేది ఒక అలవాటు నుండి ఒక వ్యసనం లాగా మారినంత భక్తి.
నాకు ఊహ వచ్చినప్పటి నుండి అంతే. నాన్న తో ఎప్పుడు గుడికి వెల్లేవాడిని. నాకు దేవుడు అంటే చిన్నప్పుడు మనం పూజ తర్వాత ఏమి కోరుకున్నా ఇస్తాడు అనుకునే వాడిని.
ఒకవేళ నేను అనుకున్నది జరగక పోతె అంతే ఆ రోజు ఇంక దేవునికి నాకు మాటలు ఉండవు.
నాకు మొదట నుండి ఎవరు ఇష్టదైవం లేరు. అందరిని పూజించే వాడిని. మాకు ఎప్పుడు అప్పులు ఉంటూనే ఉండేవి.
మా అక్క కి పెళ్ళి చేసాక నేను మా అన్న ఉన్నాము. మా అన్న మా నాన్న పరిస్థితి అర్థం చేసుకునే వ్యక్తి కాదు.
మా అమ్మ కి మా నాన్న కి, నా మీదనే చాలా నమ్మకం. అయినా కూడ ఇద్దరినీ సమానంగా చూసేవారు.
నాకు కూడా జీవితంలో ఏది, ఎప్పుడూ కలిసి రాలేదు. మా అక్క వాళ్ళ అత్త గారి ఇంట్లో అంతా పరమ బాబా భక్తులు.
అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతి సారి బాబా గురించి విని, నాకు తెలియకుండానే బాబా ని పూజించడం మొదలు పెట్టాను. కాని నా బి.టెక్ అయ్యాక ఎన్ని రోజులకు కూడ ఉద్యోగం రాలేదు,
చాలా నిరాశ చెందాను(నేను బాగా చదివేవాడిని అ౦దుకే మా నాన్న కు నా మీద నమ్మకం). చాలా రోజుల తర్వాత నాకు డిల్లీ లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళాను.
చాలా కష్టంగా ఉన్నా కూడా ఎప్పుడూ నాన్న గుర్తు వచ్చి ఒర్చుకునే వాడిని. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. నాకు మరీ అసహ్యంగా అయిదు వందలు సంవత్సరానికి జీతం పెంచారు,
బాగా కోపం వచ్చి బాబా ఎదుట చీటి రాశాను. ఉద్యోగం మానుకోవద్దు అని వచ్చింది. కాని నేను కోపంలో బాబా మాటలు లెక్క చేయకుండ ఉద్యోగం మానేశాను.
అప్పుడు మనసంతా చాలా చీదర గా ఉంది. అనవసరంగా ఉద్యోగం మానేసా అనుకుని మళ్ళీ అదే కంపనీ లో జాయిన్ అయ్యా.
అలా కొన్ని రోజులకి వేరే ఉద్యోగం వచ్చింది మధ్యప్రదేశ్ లో.
జాయిన్ అయితే అయ్యా గాని అది ఏ మాత్రం ఒక ఇంజనీర్ చేసే ఉద్యోగం లాగ లేకపోవడం తో మా నాన్న కి కాల్ చేసి నా వల్ల కావట్లేదు అని చెప్పాను.
మా నాన్న ఉద్యోగం మానేసి ఎమి చేస్తావు అంటే, అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేస్తా అని చెప్పా (మా నాన్న కి ఎప్పటి నుండో కోరిక నన్ను అమెరికా పంపాలి అని. చాలా మంది జ్యోతిష్కులు కూడా చెప్పారంట నాది అమెరికా వెళ్ళే జాతకం అని).
మా నాన్న సరే అనడం తో వెంటనే జాబ్ మానేసి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చా హైదరాబాద్ లో.
నేనేదో జాబ్ మానేయడం కోసం అమెరికా వెళ్తా అని చెప్పా, కాని మా అక్క, బావ, మా నాన్న, బావ వాళ్ళ అమ్మ(బాబా కి పెద్ద భక్తురాలు, నన్ను కూడా బాబా వైపు చూసేలా చేసింది)
ప్రొసీజర్ మొదలు పెట్టమని గొడవ మొదలు పెట్టారు. నాకేమో ఎమి చెయ్యాలో తెలియని పరిస్థితి. అప్పుడు మా బావ అన్నారు జి.ర్.ఇ రాయి,
మంచి మార్కులు వస్తే అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. నేనేమో అది రాస్తే పక్కా గా వస్తది అని చెప్పాను. అప్పుడు మా అక్క వాళ్ళ అత్త బాబా ముందు చీటి రాసి ఏది వస్తే అది చేయమంది.
నాకు చీటిలో అమెరికా వెళ్ళమని వచ్చింది. ఈసారి బాబా మాట కాదనే ధైర్యం చేయలేదు.
చాలా పట్టుదల తో ఒక వారం రోజుల్లో జి.ర్.యి రాసి మంచి మార్క్స్ తెచ్చుకున్నాను.
నా అమెరికా ప్రయాణం అంత సజావుగా ఏమి అవ్వలేదు. తక్కువ టైమ్ లో తీసుకున్న నిర్ణయం కావడం వల్ల లోన్ రాలేదు. మార్కులన్ని బాగా ఉన్నా కూడా లేట్ గా అప్లై చేశా అని స్కాలర్షిప్ రాలేదు.
అయినా బాబా మీద బారం వేసి ప్రయాణం కొనసాగించా.
అంతా అయ్యి అమెరికా లో అడుగు పెట్టాను. కాని నాతో వచ్చిన ఫ్రెండ్ వాడికి తెల్సిన వారు వస్తారు అని చెప్పాడు, కాని వీడికి వారు ఏ విధమైన కన్ఫర్మేషన్ ఇవ్వలేదు వచ్చి పిక్ చేసుకుంటాం అని.
అది నాకు అమెరికా లో దిగిన తర్వాత చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఇంతలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవడో అదే ఎయిర్పోర్ట్ లో చూసి మా పరిస్థితి గమనించి సహాయం చేశాడు.
చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి యీ అమెరికా ప్రయత్నం లో.
ఇక్కడ చదువు అయ్యాక చాలా రోజులు ఉద్యోగం రాలేదు. ఇంట్లో వాళ్ళకి ఏమి చెప్పాలో తెలియక, నాకు నేను ధైర్యం చెప్పుకోలేక చాలా సార్లు ఏడ్చాను.
ఆ బాధ లో ఉన్నప్పుడు నా స్నేహితుడు ఎవరో నన్ను ఒక బాబా గ్రూప్ లో యాడ్ చేయడం జరిగింది.
దాని ముఖ్య ఉద్దేశం మహా పారాయణ 2017 నవంబర్ నుండి 2018 దసరా వరకు. బాబా సమాధి చెంది వంద సంవత్సరాలు కావడం తో మహా పారాయణ మొదలు పెట్టారు.
ఇది ఒక సంవత్సరం పాటు ప్రతి గురువారం చెయ్యాలి. నా మొదటి నెల పారాయణ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది.
జీతం చాలా అంటే చాలా తక్కువ. కాని మనో ధైర్యం కోసం, ఇంట్లో పరిస్థితి వల్ల జాయిన్ అయ్యాను.
మెల్లగా ఉన్నంత లో తిని, దాదాపు మనీ అంతా ఇంటికి పంపేవాడిని. నాకు అనాథ పిల్లలకి సాయం చేయడం అంటే చాలా ఇష్తం. ఉన్న దాన్లో అపుడప్పుడు మనీ ఇచ్చేవాడిని.
జీతం పెంచమని మా ఉన్నత అధికారిని అడిగితే, హెచ్.వన్.బి వేసి అప్రూవ్ అయితే పెంచుతా అన్నాడు.
నా పారాయణ పూర్తి అయ్యింది సరిగ్గా దసరా రోజు. మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఆ రోజు, ఏదో తెలియని ఆనందం. ఏదో మంచి జరుగుతుంది అని మనసు లో అనిపిస్తుంది.
కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడని అదే దసరా రోజు ఆఫీసు కి రాగానే అందరి అప్రూవ్ అయింది నాకు తప్ప అని తెలిసింది.
నా కన్న తక్కువ పని చెసేవారికి కూడా నా కన్నా మూడింతల అయింది జీతం.(నా కన్నా తక్కువ అనడం లో ఏ దురుద్దేశం లేదు. )
చాలా చిన్నతనంగా ఉండేది. ఫ్రెండ్స్ కి సరదాలు పెరిగాయి. ఖర్చులు పెరిగాయి.
రూమ్ లో ఎంత మంది ఉన్నా నేను మాత్రమే వంట చేసేవాడిని. ఎవరి నుండి సహాయం రాదు. ఇక భరించలేక వాళ్ళు ఎక్కడకి పిలిచినా వెల్లడం మానేశాను.
దానితో నా వెనకాల మాట్లాడటం మొదలు పెట్టారు. నేను నా జీతం పెరిగితే రూమ్ మారాలి అనుకున్నా. కాని రాలేదు కాబాట్టి ఆ బాధ వర్ణంచలేనిది.
మనసుకి, మెదడుకి ఒకేసారి సర్ది చెప్పడం మనలాంటి వాళ్ళకు సాధ్యామా??
ఈ బాధ లో నేను 2017 నవంబర్ నుండి 2018 దసరా వరకు జరిగే పారాయణ లో నుండి తప్పుకుందాం అనుకున్నా.
కానీ అది మొదలు అయ్యేటప్పటికి మనసులో ఎందుకో పర్లేదు లే మళ్ళీ జాయిన్ అవుదాం అనిపించింది.
మళ్ళీ మహపారాయణ మొదలు పెట్టాను. మధ్యలో చాలా బాధలె అనుభవించాను. అటు ఇంట్లో జరిగేవి, ఆఫీస్ లో జరిగేవి, నా చుట్టూ జరిగేవి అన్ని కలసి నన్ను ఉక్కిరి బిక్కిరి చెశాయి.
ఎప్పుడూ ఏదొక ఆలోచన. ఆరోగ్యం దెబ్బ తిన్నది. బాబా విబూతి వల్ల అయినా మంచి జరుగుతుంది అనుకున్నా, అమ్మ పంపినవి అన్ని వచ్చాయి కాని అందులో బాబా విబూతి లేదు.
ఆ ఒక్కటి ఎలా మిస్ అయింది అనేది అర్ధం కాలేదు. బాబా విబూతి కి కూడ నోచుకోలేనంత పాపం నేనేమి చెశాను అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి మనసు కి చాలా కష్తంగా ఉంటుంది.
నాకు బాబా ఏదొక రూపంలో కనిపిస్తాడు. నేను ఏదోక సినిమా చూస్తుంటే మధ్యలో కనిపించేవాడు. నాకు అలా కనపడగానే చాలా ఆనందం వేసేది.
కొన్ని సార్లు నాది పిచ్చి అనుకునేంత లా బాబా తో మనసు లో మాట్లాడుకునేవాడిని. తాను ఎప్పుడూ నాతోనే ఉన్నాడు అనిపిస్తుంది.
ఇక నాకు ఇదే చివరి అవకాశం హెచ్.వన్.బి వేయాడానికి,.
ఈ నా కథ చదివిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు.
నేను నమ్ముతున్నా కాబాట్టి బాబా మనకి ఏదొకటి చేసితీరాల్సిందే అనే ధోరణి అయితే కాదు నాది. నా నమ్మకమే బాబా. నాకు ఉన్న దిక్కు కూడా తనే.
ఈ నిస్సహాయ తమ్మునికి సహాయం చేయమని బాబాకి మీ వంతు ప్రార్థన రూపంలో చెప్తారని, ఇన్ని రోజులు వెన్నంటి ఉండి కాపాడిన బాబా ఏదో ఒక రోజు నా కష్టాలు తీరుస్తాడని ఆశ తో….
రవి…. USA
Latest Miracles:
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- సాయి అంకిత భక్తులైన తండ్రి కొడుకులకు బాబా వారు చేసిన సాయం–Audio
- 5 నిమిషాలకు నా జ్వరము తగ్గిపోయి స్వస్థత చేకూరింది.
- ఆ సాయిబాబాకు నా మీద ఇంత కృప ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments