బాబాకు, అక్బర్ కు సంబంధించి, మహదీ బువా వివరించిన చిన్న కధ.–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi Prasanna


పేరు తెలియని ఒక సాయి భక్తుడు చెప్పిన లీల.

ఒకరోజు కొంతమంది బాలురు, మహదీ బువా, బాబాతో ఉన్నప్పుడు, బాలురు, అక్బర్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నారు.  బాబా “మీరు అక్బర్ గురించి మాట్లాడుకుంటున్నారా, అతను నా పాదాలవద్ద ఉన్నాడు” అన్నారు. మీరప్పుడు ఏమి చేస్తున్నారు బాబా” అన్నారు ఆబాలురు. 

నేనప్పుడు అమర్ కోట వద్ద ఫకీరును”  అన్నారు బాబా.  అప్పుడది షేర్షా ఢిల్లీకి చక్రవర్తిగా ఉన్న కాలం. హుమయూన్ రాజ్య భ్రష్టుడై సిం హాసనాన్ని కోల్పోయి దేశ బహిష్కృతుడై ఒక ప్రదేశాన్నించి నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతూ ఉన్నారు.

ఆ చక్రవర్తి నావద్దకు వచ్చినపుడు కూడా అతని భార్య ఉన్నది. ఆమె నాపాదాల వద్ద పడి నా ఆశీర్వాదములు కోరింది. ఆమె అప్పుడు గర్భిణీ. నేనామెతో “ప్రక్కనున్న అమర్ కోట గ్రామంలో నీకు మగపిల్లవాడు జన్మిస్తాడు. నేనా బాలునికి నామకరణం చేస్తాను” అని చెప్పాను.

కొంతకాలం తరువాత ఆమె ఒక మగ పిల్లవానికి జన్మనిచ్చింది. నామకరణ సమయానికి నేనక్కడకు వెళ్ళాను. నేనా బాలునికి అక్బర్ అని నామకరణం చేశాను. ఆబాలుడు నాపాదాల వద్ద ఆడుకొన్నాడు.

బొంబాయిలో నేను మహదీబువాను కలుసుకొని ఆయనవద్ద నుంచి చాలా సమాచారాన్ని సేకరించాను. ఆయన బొంబాయిలో చివర ఎక్కడో , గౌరవనీయుడైన ఒక మహమ్మదీయుని యింటిలో ఉంటున్నారు.

హిందువులు, ముసల్మానులు, పార్శీలు మొదలైన వారంతా ఆయనంటే ఎంతో గౌరవంగా ఉండేవారు. యింటి యజమాని కూడా అద్దె గురించి ఎప్పుడు రొక్కించి అడగలేదు.

పుట్టుకతో ఆయన హిందువు.  కాని, ఆయన కుల మత భేదాలకు అతీతంగా అందరూ సమానమే అనే విధంగా అందరితోను కలిసి జీవించారు.

బాబా మహాసమాధికి ముందు తాను బాబాతో కొన్ని సంవత్సరాలు గడిపినట్లు చెప్పారు.

శ్రీ బీ.వీ.నరసిం హస్వామీజీ గారి వివరణ:

బొంబాయిలో నివసిస్తున్న ఈ నిజమైన భక్తుడిని నేను చూశాను. ఆయన చెప్పినది విన్నాను. ఆయన చెప్పినదంతా నిజమని నమ్ముతున్నాను.

సాయిసుధ
మార్చ్, 1950

ఈ  సమాచారం ఈ లింక్http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles