Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా తన సేవకుని తానే ఎన్నుకొనుట
ఈ రోజు మనము ద్వారకామాయిలొ బాబా గారి చిత్రపటమునకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ, బాబా లీలను తెలుసుకుందాము. ఈ విషయమంతా కూడా శ్రీ యిమ్మిడిసెట్టి ప్రభాకరారవు గారిచే రచించిన “షిరిడీలో సిరులు” పుస్తకము నుండి గ్రహింపబడినది.
1990 లో హైదరాబాద్ కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు జ్యోతిరాజా గారు కొందరు మిత్రులతో కలిసి షిరిడీ వెళ్లారు. అదే ఆయన షిరిడీ మొదటి దర్శనం. వారు ద్వారకామాయి సమీపంలో నున్న పూజ్యశ్రీ శివనేశన్ స్వామిని దర్శించారు. అప్పుడాయన కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్లి, కొంచెంసేపాగి జ్యోతిరాజా గారి వంక చూస్తూ “బాబావారు తమ చిత్రం మిమ్ములను గీయమంటున్నారు. ఆయన సంకల్పం ఏమిటో మరి . మీకు ఇష్టమైతే గీసి వెళ్ళండి.” అన్నారు.
ఈ స్వామికి తను చిత్రకారుడినని ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయారాయన. ఇంతలో టెంపుల్ ఆఫీసర్ గారు అటుగా వచ్చారు. శివనేశన్ స్వామి గారన్న విషయం తెలుసుకుని, “ఇదివరలో సంస్థాన్ వారు శ్రీ జయకర్ గారు చిత్రించిన చిత్రం రంగులు వెలవెలబోయినందువల్ల, మరల చిత్రం గీయించాలని చిత్రకారులకు ఆహ్వానాలు పంపారు. బొంబాయి నుండి, జైపూర్ నుండి ఇద్దరు చిత్రకారులొచ్చారు. లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ అడిగారు. సంస్థాన్ వారు అంగీకరించారు కూడా. కానీ ఎందుచేతనో వారిద్దరూ చిత్రం గీయకుండానే వెళ్లి పోయారు. కారణం తెలియదు” అన్నారు.
“నాకే రెమ్యూనరేషనూ వద్దు. ఆ చిత్రం గీసే భగ్యం సాయి నాకెందుకిచ్చారో! ఈ సేవ చేయడమే నా అదృష్టం. మరల పది రోజులలో వస్తాను” అంటూ తిరిగి వచ్చేశారు జ్యోతిరాజా.
జ్యొతిరాజా గారి చెల్లెలు 7,8 సంవత్సరాల నుండి కంటి రెటీనా జబ్బుతో బాధ పడుతుంది. ప్రఖ్యాత వైద్యుల వద్ద చికిత్స చేయించారు. చివరిగా డా.సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో చూపించారు. రెటీనా స్పెషలిస్టు డా.సత్పతి గారు “ఈ వ్యాధికి మందు లేదు. అయినా వ్యాధి ముదరకుండా మాత్రం చూడవచ్చు. మీరు మద్రాసులోని శంకర్ నేత్రాలయంలో పరీక్ష చేయించండి.” అని సలహా ఇచ్చారు.
తాను షిరిడీ వెళ్ళేలోపలే చూపించాలనే ఆలోచనతో వెంటనే ఆయన తన సోదరిని తీసుకొని మద్రాస్ వెళ్ళారు. ఆక్కడ హొటలులో రూము తీసుకొని హాస్పటల్ కు వెళ్తూ “బాబా! నీ చిత్రం గీస్తానని మాట యిచ్చాను. నా మాట నిలబెట్టుకుని నీ సేవ చేయాలంటే నాకు మనఃస్థిమితం కావాలి. ఏం చేస్తావో నీదయ” అని ప్రార్థించాడు.
హాస్పటలులో మొదటి కౌంటరులో పేరు నమోదు చేయించి, రెండవ కౌంటరులో ఎమర్జెన్సీ కేసుగా కూడా నమోదు చేయించి వెళ్ళి హాలులో కూర్చున్నారు. ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి తిన్నగా జ్యోతిరాజా గారి దగ్గరకొచ్చి, ఏమిటి ప్రాబ్లం అని అడిగి వివరాలు తెలుసుకొని, తిన్నగా డాక్టరు వద్దకు తీసుకువెళ్ళి అవసరమయిన సహాయమంతా చేశాడు. మూడవరోజున ఆసుపత్రి సూపరింటెండెంట్ మేరీ అబ్రహాం వద్ద అప్పాయిట్మెంట్ తీసుకుని ఆమె వద్దకు తీసుకెళ్ళాడు.
ఆమె రిపోర్టులన్నీ చూసి, “ప్రఖ్యాత వైద్యనిపుణులైన డా.శివారెడ్డి గారు, డా.సత్పతి గారు కూడా మీకు రెటీనా ప్రాబ్లం ఉందని డయాఫ్రం వేసి ధృవపరిచారు. ఆ జబ్బుకు ప్రపంచంలో ఎక్కడా నివారణ లేదు.కానీ, మా రిపోర్టుల ప్రకారం ప్రస్తుతం మీ కంటికి ఏ జబ్బూ లేదు. మీకు మెడిసిన్ కూడా పనిలేదు. మీరు అనందంగా యింటికి వెళ్ళండి. ఇది చాలా అరుదైన అద్భుత విషయం. ఏదో మహాద్భుత దైవశక్తి ఈమె వ్యాధిని నివారించింది. ఎంత అదృష్టవంతురాలవమ్మా!” అన్నారు.
ఆశ్చర్యం, ఆనందం పెల్లుబికి రాగా జ్యోతిరాజా గారు అంతవరకు గత 3 రోజులుగా వారికి సాయపడిన హాస్పటల్ స్టాఫ్ కరవయ్య గారికి నమస్కరించి కృతజ్ణతలు తెలిపారు. అతను చాలా ఆశ్చర్యపోతూ, “నేనెందుకు మీకిలా సహకరించానో నాకర్థం కావడం లేదు. అసలలా చెయ్యడానికి మాహాస్పటల్ నిబంధనలనుమతించవు. ఏ శక్తి నన్నావహించి యిలా చేయించిందో!” అన్నాడు.
వారం రోజుల తర్వాత జ్యోతిరాజా గారు షిరిడీ వెళ్ళి భక్తి పారవశ్యంతో అసలు చిత్రానికి దీటైన అద్భుతమైన నకలు గీశారు. ఈనాడు మనం ద్వారకామాయిలో చూచే చిత్రమదే! సాయీ ప్రభువు ఎవరిని ఏ సేవకు నియోగిస్తారో, ఎవరిని ఏ రకంగా ఉద్ధరిస్తారో ఎవరికెరుక?
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా గారు తన దుస్తులు తానే ఎన్నుకొనుట
- బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన అద్భుత లీల(ఇందిరా గారి అనుభవాలు)–Audio
- తన ఒడి లోనికి తానే రప్పించుకున్న సర్వాంతర్యామి(లవ్ సాయి లివ్ ఇన్ సాయి)–Audio
- షిరిడీ నుండి హర్దాకు …..సాయి@366 జూన్ 7….Audio
- తాళాల గుత్తి మాయం చేసి తానే(బాబా వారు) నా ఇంటికి కాపలా ఉన్నాడు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబా తన సేవకుని తానే ఎన్నుకొనుట”
సాయినాథుని ప్రణతి
February 19, 2017 at 2:12 pmSo nice .మనస్సుకు ఆనందాని కలిగిస్తుంది ఈ లీల .సాయినాథ్ మహరాజ్ కీ జై.
kishore Babu
February 19, 2017 at 2:18 pmThank you Pranathi garu…mee comments chala bagunnayi..thanks andi..
Maruthi.Velaga
February 20, 2017 at 8:16 amSaibaba saibaba saibaba saibaba..sai baba sai baba Sai baba sai baba sai baba.
kishore Babu
February 20, 2017 at 5:31 pmSai Baba… Sai Baba…Sai Baba