Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
తలుపులు తీసుకుని బయటకు వచ్చాను. శ్రీదేవి తండ్రి బయటకు వచ్చి ఏమ్మా ఈ రోజు పారాయణం అయిపోయినట్లుంది , ఆ వెలిగిపోతున్న మొహమే చెబుతుంది అన్నారాయన నవ్వుతూ.
ఎన్ని పారాయణలు చదవాలనుకున్నావమ్మా అని అన్నారాయన . 3 పారాయణలు అనుకున్నానండీ అన్నాను . శుభం అన్నారాయన.
నాలుగు రోజులల్లో ఆయన గుంటూరు వెళ్లిపోయారు. మూడు పారాయణలు నిర్విఘ్నంగా సాగాయి. రేపటితో మూడవ పారాయణం పూర్తి అవుతుంది. భోజనాలు పెట్టాలి.
తెల్లవారు జామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు అమ్మమ్మ కనపడింది. అప్పటికి మా అమ్మమ్మ ఉంది. ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. నేను ఆవిడ దగ్గర పెరిగాను. ఏమి చేస్తున్నావు అంది.
నేను సమాధానం చెప్పేలోపే ఏంటో ఏదో కొత్తపూజ చేస్తున్నావు? అంది. నేను దేవుడు గూట్లోకి చూసి, అవునమ్మమ్మ బాబా పారాయణం చేస్తున్నాను ఇవాళ తో ముగుస్తుంది భోజనాలు పెట్టాలి అన్నాను.
విస్తళ్ళు వేసాను. అన్నీ వడ్డించాను. పరమాన్నం లేకుండా పూజాలేంటి? భోజనాలేంటి? పరమాన్నం చెయ్యి అంది. సరే అన్నాను.
నీవు నీ ఇంటి దేవుడికి పూజ చేయటం లేదు, బట్టలు కూడా పెట్టలేదు, ఏం ఎందుకలాగా? ఏం మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడుగా బట్టలు పెట్టు అంది, సరేనమ్మమ్మా అన్నాను.
భోజనానికి రా అన్నాను. నేను వెళ్ళిపోతున్నాను నాకు వేరే పనులున్నాయి అని వెళ్ళిపోతూ పండు తాంబూలం మర్చిపోయావే అమ్మాయి దక్షిణ కూడా పెట్టు అంటూ వెళ్ళిపోయింది”. ఇది కల.
ముందు రోజే భోజనాలకి పూజకి కావాల్సిన సామానంతా నేను శ్రీదేవి కలిసి తెచుకున్నాము.
పారాయణ సంగతి నువ్వు చూసుకో వంట సంగతి నేను చూసుకుంటాను అంది శ్రీదేవి, సరేనన్నాను.
ఎందుకంటే మాకు అలా అలవాటే. అక్కడ ఉన్న ఇళ్ల వాళ్ళం అందరం ఎవరింట ఏమైనా అందరం కలిసి మెలిసి చేసుకుంటూ ఉంటాం. అందుకే ఆ పనంతా తను చూసుకుంటాను అంది.
తెల్లవారింది, పారాయణ పూర్తి అయింది. శ్రీదేవి మరిది గారు హనుమంతు భోజనానికి ముగ్గురిని మాట్లాడి పెట్టాడు. వంటంతా అయింది భోజనానికి వచ్చారు.
ఆ ముగ్గురు సన్యాసులు దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. పారాయణం చేసి భోజనాలు పెట్టుకోవడం చాలా సంతోషం గా ఉంది.
భోజనాలు వాళ్ళు తింటున్నప్పుడే ఒక టెలిగ్రామ్ వచ్చింది అందులో ఏముంది అంటే మా అమ్మమ్మ గారు చనిపోయారని ఉంది.
వాళ్ళ భోజనాలు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయాక నన్ను తొందరగా అన్నం తినేయమన్నారు.
అదేమిటి నేను మిమ్మల్ని అందర్నీ వదిలిపెట్టి మొదటగా నేను భోజనం చెయ్యటం ఏమిటి? అని అంటే రాజ్యం ఇప్పుడు నువ్వు రామచంద్ర పురం వెళ్ళాలి. అందుకే తొందరగా భోజనం చెయ్యి అన్నారు.
నాకు సంతోషం అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు రామచంద్రాపురం వెళ్లడం ఏమిటి, నేను పారాయణం ఆ సంతోషం అందరితోనూ పంచుకోవాలి అనుకుంటుంటే ఇప్పుడు నన్ను రామచంద్రాపురం వెళ్ళమంటారేమిటి ? అన్నాను.
అప్పుడు చెప్పారు మీ అమ్మమ్మ చనిపోయారు అని. నేను ఏవో రెండు ముద్దలు తిని రామచంద్రాపురం బయల్దేరి వెళ్ళాను.
ఆవిడ కార్యక్రమాలన్నీ అయ్యాక తిరిగి వచ్చాను. ఆవిడకి నేనంటే ఇష్టం కాబట్టి నన్ను ఆఖరి సారి చూసుకోవడానికి వచ్చి ఉంటుంది (కలలో)అనిపిస్తుంది .
విజయనగరం మా స్వస్థలం అయినా, హైదరాబాద్ ట్రాన్సఫర్ ఆర్డర్ రావాలని, వస్తే బాబా కి మూడు సార్లు పారాయణం చేస్తాను అని అనుకున్నాక, మొదటిసారి ఏడు రోజుల పారాయణం అవ్వగానే ట్రాన్సఫర్ ఆర్డర్ వచ్చింది.
అక్కడే మిగిలిన రెండు సార్లు కూడా పూర్తి చేసుకొని, హైదరాబాద్ చేరుకున్నాము. బాబాకు నేను నిత్యము పూజ చేస్తాను.
పిలిచిన పలికే దైవమని నమ్మాను, నాకు అన్ని విధముల సాయి ఒక్కడే దేవుడు.
ఓ సారి మా మరిది కూతురు పుట్టాక ఆ అమ్మాయి నక్షత్రం ప్రకారం శాంతి చేయించాలని మా ఇంట్లో వాళ్ళు అంటే మా అత్తగారు, మా మరదలు, తోడికోడళ్లు అందరం కలిసి రాజమండ్రి దగ్గర రాజారాం వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నాము.
బయలుదేరే రోజు రానే వచ్చింది. సామానంతా సర్దుకున్నాము. ఇంటికి తాళం వేయడానికి తాళం గుత్తి కనపడలేదు, డూప్లికేట్ కూడా కనపడలేదు, ఇంక వెతకటం నా వాళ్ళ కాలేదు.
మా వాళ్లేమో రైలు టైం అయిపోతుంది, ఇంకా రావేంటి అని అరుస్తున్నారు.
మా అత్తగారితో నేను రాను ఎందుకంటే తాళాలు కనపడటం లేదు తాళం వేయకుండా ఎలా వెళ్లడం మీరు వెళ్ళండి అన్నాను. అందరూ నువ్వు రాకపోతే ఎలా వచ్చి తీరాలి అంటూ పట్టుబట్టారు.
ఇంక బాబా ఫోటో ముందు నిలబడి బాబా మూడు రోజులపాటు ఇంట్లో ఎవరూ ఉండటం లేదు, వేయడానికి తాళాలు కనపడటం లేదు, బీరువా తాళాలు కూడ ఆ గుత్తిలోనే ఉన్నాయి.
అంతా నీదే భారం చూసుకో నాయనా అని దండం పెట్టి తలుపులు దగ్గరికి వేసి ఊరికి వెళ్లి మూడు రోజుల పాటు నిశ్చింతగా గడిపి ఇంటికి వచ్చాము.
ఎక్కడ సామాను అక్కడే ఉంది. ఎలా వొదిలి వెళ్లానో అలానే ఉంది. వచ్చాక నన్ను నా ఇంటిని రక్షించినావయ్యా తండ్రీ అని దండం పెట్టాను.
ఆ తర్వాత ఆ తాళం చేతుల గుత్తి మా ఇంట్లో సోఫా కింద దొరికింది. అప్పటికి సోఫా కింద ఎన్ని వందల సార్లు ఊడ్చానో, వెతికానో, నాకే తెలియదు.
తాళాల గుత్తి మాయం చేసి తానే నా ఇంటికి కాపలా ఉన్నాడు. ఆయనెంత దయామయుడు. తర్వాత నేను మరలా బాబా పారాయణం చేశాను .
The above miracle has been typed by: Mrs. Rajarajeswari. Sainathuni
Latest Miracles:
- దత్తాత్రేయునిగా దర్శనమిచ్చిన బాబా వారు
- పారాయణ సమయంలో మా ఇంటికి వచ్చి నా పెళ్లి జరుగుతుందని ఆశీర్వదించిన బాబా వారు …..!
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- నన్ను ఆరోగ్యవంతున్ని చేసి, నా కుమార్తె వివాహం జరిపించిన బాబా వారు…రవి కుమార్
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments