Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నాగమణి గారి అనుభవములు ఆరవ మరియు చివరి భాగం
నేను రోజు నాలుగు హారతులు చేస్తూంటానుగా! మధ్యలో ఒక 15 రోజులపాటు వరుసగా మధ్యాహ్న హారతిలో బాబా నాకు దత్తాత్రేయుడిగా కనపడటం మొదలు పెట్టాడు.
ఉదయం కాకడ హారతికి, సాయంత్రం సంధ్యా హారతికి, రాత్రి శేజ్ హారతికి, మామూలుగా ఉండేవాడు. నాకేమి అర్ధం కాలేదు.
ఆ తరువాత అర్ధం అయింది. అలా ఎందుకు కనపడ్డాడంటే ఆ సమయంలో మా అబ్బాయి ఏ ఉద్యోగం లేకుండానే ఏ సంపాదన లేకుండానే ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటూ కూర్చున్నాడు. మేము ఒప్పుకోలేదు,
ఇప్పటికే గడవటం కష్టంగా ఉంది, నువ్వు సంపాదించారా బాబూ! అంటే తానూ సంపాదించక పోగా, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకు వస్తే, వీళ్లిద్దరిని, మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళని పోషించేంత గొప్ప వాళ్ళం కాదు అందుకే వద్దు అన్నాం.
“ఉద్యోగం రానీయరా ఆ తరువాత నీ ఇష్టం” అన్నా కూడా వినకుండా కాదన్నామని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు.
వాడి మనసు మారాలని, వాడు తిరిగి రావాలని నేను గురు చరిత్ర పారాయణం 5 రోజులపాటు ఏమి తినకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే తాగి పారాయణం చేస్తాను, అని అనుకుని ఉదయం గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు, ఒక గ్లాస్ జ్యూస్ తాగి మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని.
సాయంత్రం ఇంకేం లేదు. మళ్ళీ మర్నాడు ఉదయం మరలా గుడికి వెళ్ళి పారాయణం చేసి తిరిగి వచ్చేటప్పుడు జ్యూస్ తాగి ఇంటికి వచ్చేదాన్ని. అలాగే 5 రోజులు గడచిపోయింది.
మా వారప్పుడు మరో రెండు రోజులు ఇలాగే చెయ్యి సప్తాహ పారాయణం అవుతుంది అన్నారు.
సరే చెప్తున్నారు కదా! విందామనుకొని సరే అన్నాను. మర్నాడు గుడికి వెళ్ళే నాటికే నీరసంగా ఉంది.
గుడికి వెళ్ళే ముందే జ్యూస్ తాగాను. పారాయణం అయిన తరువాత మళ్ళీ మరో గ్లాస్ జ్యూస్ తాగాను ఇంటికి వచ్చాను.
నాకు చాలా నీరసంగా అనిపిస్తోంది. మధాహ్నం మళ్ళీ చెంబుడు మజ్జిగ తాగాను. నాకు ఆకలి బాగా వేయడం మొదలు పెట్టింది.
సాయంత్రం మళ్ళీ ఆకలి వేస్తుంది. నాకింకా చేత కావటం లేదు. రాత్రి 11 గంటలకి ఉండలేక అప్పుడు లేచి ఉప్మా చేసుకుని తిన్నాను.
నేను బాబాని 5 రోజులు మాత్రమే పర్మిషన్ అడిగాను. అందుకే నాకు ఆకలి వేయడం అప్పుడు మొదలయ్యింది. ఎందుకంటే మిగిలిన రెండు రోజులకి బాబా పర్మిషన్ లేదు. ఆ సమయంలోనే నాకు బాబా దత్తావతారంలో కనిపించడం మొదలు పెట్టాడు.
మా అబ్బాయి అలాగే 8 నెలల పాటు బయటనే ఉన్నాడు. మేము ఎక్కడైనా బయట కనపడినా మాట్లాడే వాడు కాదు.
నేను బాబాతో నీ ఇష్టం బాబా, వాడికి ఆ అమ్మాయిని చేసుకోవద్దు అంటే కోపం వచ్చింది.
వాడి జీవితం ఆ అమ్మాయితోనే బాగుంటుంది అనుకుంటే వాడికి ఏదో ఒక దారి చూపించి వాడికి ఆ అమ్మాయితోనే ముడి వెయ్యి అనుకున్నాము.
నాకారోజు మా అబ్బాయిని రామిరెడ్డి తాత (అవధూత) తీసుకువచ్చి మా ఇంట్లో పడేసినట్లుగా కనపడింది (కలలో).
మా వారితో నేను విషయం చెప్పి, ఆయనే తీసుకువస్తాడు మనం అనవసరంగా కంగారు పడవద్దు అన్నాను.
మా వారు ఒక్క కొడుకు అలా దూరం అయిపోయాడని బాధ పడేవారు. మా చుట్టాలందరూ మన వాళ్ళ అమ్మాయే కదా చేసేయవచ్చు కదా! అనేవారు.
ఒక రోజు నేను బయటకు వెళితే నాకు రోడ్ పైన మా వాడు కనపడ్డాడు. అప్పటివరకు ఏ రోజు కనపడినా మాట్లాడని వాడు, ఆ రోజు మా మనవాడి పేరు చెప్పి వాడు ఎట్లా ఉన్నాడు అని అడిగాడు.
అలా అడిగే బదులు ఇంటికి వచ్చి చూడవచ్చు కదరా! అన్నాను. పదమ్మా! అంటూ ఇంటికి వచ్చాడు, నాకు కలలో కనపడిన బట్టలతోనే ఉన్నాడు వాడు ఆ రోజు. ఆ వచ్చిన వాడు ఇంకా బయటకు పోలేదు. అప్పటినుండి బాబా నాకు దత్తావతారం లాగా కనపడలేదు కూడా.
సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు.
శుభం భవతు.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
Latest Miracles:
- బాబా ముస్లిం అని అయిష్టత చూపిన వ్యక్తికీ తన ఇష్టదైవం సమక్షంలో దర్శనమిచ్చిన బాబా వారు
- గురుపౌర్ణమి రోజు భక్తురాలి ఇంటికి వెళ్లిన బాబా వారు.
- మా బాబుకు ప్రాణ బిక్ష పెట్టిన బాబా వారు
- కోయవానిరూపమున దర్శనమిచ్చిన బాబా–Audio
- బాబా గుడిలో బాబాకి దండ వేయలేకపోయాననే బాధలో ఉన్న నాకు, తమ్ముడి ఇంటిలో అవకాశము ఇచ్చిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments