Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-201-2712-కోయవానిరూపము 3:29
ఇది అద్భుతమైన లీల. రంగాచారిగారు స్వయముగా రచయితకు చెప్పిన లీల. శ్రీ మహాభాష్యం రంగాచారిగారి మాటలనుండే తెలుసుకుందాము.
“1992 అక్టోబరులో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో బాబా విగ్రహము ప్రతిష్టించుటకు నన్ను (రంగాచారిగారిని) రమ్మనమని అచ్చటివారు ఆహ్వానించిరి.
అప్పటి వాతావరణ పరిస్థితులలో ఆ ప్రదేశమునకు ప్రయాణము చేయుట చాలా కష్టము.కనుక మా ఇంట్లో ఎవరు నేను ధర్మశాలకు వెళ్ళుటకు ఒప్పుకొనలేదు.
ప్రయాణమునకు ఒకరోజు ముందుగా, ఉదయమున ఒక కోయవాకు మాఇంటికి వచ్చినాడు. ఇంట్లో ముందుయున్న ఆఫీసులో కూర్చొని యున్న మా అబ్భాయి వద్దకు ఆ కోయవాడువచ్చి “మీతో ఒక విషయము చెప్పాలి వినండి” అని అన్నాడు.
అతను ఏదైనా భయపెట్టేది చెపుతాడేమోనని మా అబ్బాయి, మేము ఏమి వినుము అనుచూ రూ.5/-లు తీసి ఆకోయవానికి ఇవ్వబోయినాడు.
“నేను అడవిలో యుండేవాడిని. అంత దూరమునుండి మీకు చెప్పటానికి ఇక్కడకు వచ్చాను. శ్రీ సాయిబాబా అనే ఆయన మీకు చెప్పమని మీ చిరునామ ఇచ్చి నన్ను చిరునామ యిచ్చి నాన్ను ఇచ్చటకు పంపాడు.
నేను చెప్పేది వినండి. అని అన్నాడు కోయవాడు.
అప్పుడు నేను అతనిని గదిలోని వచ్చి కూర్చుండమని చెప్పి మీరు చెప్పునదేదో చెప్పుమన్నాను.
మా వాళ్ళు మాత్రము ఏమి వినవలసి వస్తుందోనని భయపడుతూనే యున్నారు.
ఆకోయవాడు నన్ను చూపిస్తూ “మీకు 110 సం:ల ఆయుష్షు ఉన్నది. అప్పటిదాకా శ్రీసాయిబాబా సేవ మీరు చేస్తారు. రేపు మీరు ప్రయాణం సుఖముగా జరుగుతుంది.
భయపడవలసిన పనిలేదు. అక్కడకు వెళ్ళిరండి” అని కోయవాడు అనుచూ త్వరత్వరగా బయటకు వెళ్ళాడు.
అది అంతా విని మేము ఆశ్చర్యముతో నుండి తేరుకొని చుచు నప్పటికీ అతడు కనిపించలేదు.
అప్పుడు మాయింటిలోని వారందరు నేను ధర్మశాలకు ప్రయాణము చేయుటకు అంగీకరించారు. 80 సం:ల వయస్సులో పంజాబు గుండా మారుమూల ధర్మశాలకు 20 డిగ్రీల సెంట్రిగ్రేడ్ వాతావరణములో సుఖముగా నా ప్రయాణమును చేయించి, నా చేత స్వామి విగ్రహమును నిర్విఘ్నముగా ప్రతిష్ట జరిపించుట నిజముగా సాయి కృపయే” అని రంగాచారిగారు రచయితనైన రచయితనైనా నాకు చెప్పిరి.
ఈ చరిత్రలో ఏ లీల చూచినా బాబా ఏదో రూపమున ప్రకటన అగుట చూడవచ్చు.
ఈ లీలలో బాబాను ఎవరైనా సమస్య తీర్చమని ప్రార్ధించారా? లేదే. మారేందుకు వచ్చారు? తన విగ్రహ ప్రతిష్ట సక్రమముగా జరగాలి. విగ్రహమునకు తనకు బేధములేదు.
రంగాచారిగారి ఇంట్లో వాళ్ళకు నమ్మకం కలిగించి తన అంకితభక్తునిచే ఈ కార్యక్రమము జయప్రదంగా బాబా చేయించుకున్నారు.
ఇట్టిలీలలు ఎన్నో జరుచుచున్నవి. మనకు తెలిసేవి బహుకొద్ది. అవి అయినా శ్రద్దగా చదివి ఆచరించాలి. అర్ధం చేసుకోవాలి.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( సెప్టెంబర్ – 2014)
Latest Miracles:
- బాబా ముస్లిం అని అయిష్టత చూపిన వ్యక్తికీ తన ఇష్టదైవం సమక్షంలో దర్శనమిచ్చిన బాబా వారు
- దత్తాత్రేయునిగా దర్శనమిచ్చిన బాబా వారు
- శ్రీ కాశీనాథ్ లతికి పడిపోయిన మాటను మళ్ళీ బాబా ప్రసాదించిన లీల
- నా కోరికను తీర్చిన బాబా.
- కారు గుద్దగానె నేను బాబా బాబా బాబా …అంటూ బాబా నామం చెబుతూ సృహ కోల్పోయాను.–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “కోయవానిరూపమున దర్శనమిచ్చిన బాబా–Audio”
Sai Baba
December 27, 2018 at 12:08 pmGreat ..Great Voice ..Thank you mam..
Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba.