భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) మొదటి బాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీసాయి అంకిత భక్తుడయిన శ్రీనానాసాహెబ్ అనబడే శంకరరావు రఘునాధ్ దేశ్ పాండే నిమోన్ కర్ గారి మునిమనుమరాలయిన శ్రీమతి హేమాజోషీ గారు వివరిస్తున్న ఆమె అనుభూతులను ప్రచురిస్తున్నాను.  ఆమె చెప్పిన వివరణ శ్రీసాయిలీలా.ఆర్గ్ నుండి గ్రహింపబడింది.

భావ తరంగాలు

నా సద్గురు సాయినాధ్ మహరాజ్ వారి దివ్య చరణముల వద్ద – హేమాజోషి

జోడునియా కర చరణి ఠేవిలా మాథా 

పరిసావీ వినంతీ మాఝీ సద్గురునాథా

అసోనసో భావ ఆలో తుఝియా ఠాయా

కృపాదృష్టి పాహే మజకడే సద్గురు రాయా

అఖండీత సావే ఐసే వాటతే పాయీ

సాండూనీ సంకోచ్ ఠావ్ థోడాసా దేయీ

తుకాహ్మణే దేవా మాఝీ వేడీవాకుడీ

నామేభవ పాశ్ హాతి ఆపుల్యాతోడీ

(కరములు జోడించి నీ చరణములపై నా శిరస్సునుంచాను.  ఓ సాయినాథా! నా వినతి విను.  నాకు భక్తి ఉన్నదో లేదో! నీ దరి చేరాను.  సద్గురు రాజా, నన్ను కృపాదృష్టితో చూడుము. నీ అఖండ పాదసేవ కోరాను. సంకోచించక నీ హృదయంలో నాకు స్థానమిమ్ము.  తుకారాము వేడినట్లు నా నామస్మరణలోని లోపాలు మన్నించి నా భవపాశము (కర్మబంధము)ను తొలగించుము.)

షిరిడీలో రామనవమి ఉత్సవం జరుగబోతున్న రోజు.  ఆ రోజున అరుణోదయ కాలం ఎంతో మనోహరంగా ఉంది.  షిరిడీ గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి ఆ తరంగాలు భక్తుల మదిలో ఒక విధమయిన ఆహ్లాదాన్ని నింపుతున్నాయి.  తెలతెలవారుతుండగా చెట్లమీద నివసించే పక్షులు ముందరే నిద్రలేచి కుహు కుహు మని కూస్తూ ఉన్నాయి.  ఆపక్షులు చేసే కిలకిలా రావాలు ఉదయించే సూర్యునికి తీయని పాటలు పాడుతూ ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది వాతావరణం.

షిరిడీ అంతా భూపాల రాగంతో నిండి ఆధ్యాత్మిక పవనాలు వీస్తూ భక్తుల మదిని ఆనందంతో ముంచెత్తుతున్నాయి.  సద్గురు సాయినాథుని మందిరంలో ఉదయాన్నే కాకడ ఆరతి ప్రారంభమయింది.  ఆ మధురగాన తరంగాలు షిరిడీ అంతటా వ్యాపిస్తూ అక్కడ ఉన్న భక్తులందరి హృదయాంతరాళాలలో ప్రవేశించి తమ ప్రియమయిన సద్గురు సాయినాథునిపై  ప్రేమను, భక్తిని మరింతగా పెంపొందింపచేస్తున్నాయి. 

ఆ సమయంలో షిరిడీలోని వాతావరణం ఎంతో పవిత్రంగాను, మనోజ్ఞంగాను ఉంది.  ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులందరి హృదయాలు సాయినాథునిపై భక్తితోను ప్రేమతోను నిండిపోయాయి.  వారందరి హృదయాలలో సాయినాథునిపై ప్రేమ తప్ప మరేమీ లేదు.  ప్రేమ – ప్రేమ – ప్రేమ – భక్తి.

నా సాయి! నా ప్రియమైన సద్గురు సాయిబాబా! నా హృదయమంతా నా సాయినాథుని మీదనే భక్తితో నిండిపోయి, ఆ ఆనంద తరంగాల ప్రభావంతో నా కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ధారగా కారుతున్నాయి. నా ఆధ్యాత్మిక గురువయిన సాయినాథునిపై భక్తి ప్రపత్తులతో కూడిన ప్రేమ నా శరీరాన్నంతా ప్రకంపనాలను కలిగిస్తోంది.

వీనులవిందుగా వినిపిస్తున్న మధురమయిన సంగీత తరంగాలకు అనుగుణంగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాను.  నాతోపాటుగా నా సోదరులు చంద్రశేఖర్, అనంత్, నా సోదరీమణులు నిమ, ఉమ, మంగళ్ ఉన్నారు.  మేమంతా సద్గురు సాయినాథునికి అత్యంత ప్రియతమ భక్తుడయిన స్వర్గీయ నానాసాహెబ్ నిమోన్ కర్ దేశ్ పాండేగారి మునిమనుమళ్ళం, ముని మనుమరాళ్ళం.

మేమంతా తెల్లవారు ఝామునే లేచి స్నానాలు కానిచ్చి తొందర తొందరగా ద్వారకామాయిలోకి ప్రవేశించాము.  నా మనసంతా సంతోషంతో నిండిపోయింది.  నా మదినిండా మధురానుభూతులు, ఏదో తెలియని ఆనందం. 

ఈరోజు షిరిడీలో రామనవమి ఉత్సవం.  నా ప్రియమైన సద్గురు సాయినాథుని పవిత్రమయిన సమాధి మీద మంగళకరమయిన జండాలకు మేము మహాపూజ నిర్వహించాల్సి ఉంది. ఆసమయంలో మందిరంలో భజనలు, కీర్తనలు జరుగుతాయి.

మేము సమాధిపై చందనం పూయాలి. సమాధిమీద జండాలను పరచి, వాటి మీద సుగంధ పరిమళాలు చల్లి, గులాబీ దండలను, మధుర పదార్ధాలను సమర్పించాలి.  ఆ తరువాత జరిగే బ్రహ్మాండమయిన ఉత్సవంలో ఆ జండాలను మా భుజాలపై మోసుకుంటూ సాగాలి.  ఈ ఉత్సవంలో జరిగే ప్రతి పని ఎంతో సంతోషంగా ఆనందంగా జరుగుతుంది.  ఈ రామనవమి ఉత్సవం బాబాపై స్వచ్ఛమయిన భక్తి ప్రేమలతో నిర్వహించబడుతూ ఉంటుంది.

(ఈ ఆనంద తరంగాలు ఇంకా ఉన్నాయి)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) మొదటి బాగం

సాయినాథుని ప్రణతి

ఎంతో ఆనందంగా వుంది ఈ మదురానుభుతి . ఈ వర్ణన చదివితే ఎంతొ ఆనందాని పొందుతునాం. నాకు ఎదన కామెంట్ చెపడానికి కూడ మాటలు రావడం లేదు. ఆనాటి జ్ఞపకాలు ఎంతో మదురంగా వునాయి. అవి మాకు ఆందించినందుకు ఎంతో ఆనందంగా వుంది .ఆ మదురానుభుతిలో నేను చాలా ఆనందానుభుతిని పొందుతునాను

kishore Babu

Sai Baba… Sai Baba…Sai Baba

prathibha sainathuni

chala బాగుంది..చదువుతున్నంతసేపు స్వయంగా nenu కూడా ఆ ప్లేస్ లో ఉన్న అనుభూతి kaligindi .ఈ భావ తరంగాలు అనుభూతి తరంగాలుగా ప్రసరిస్తున్నాయి .ఈ భావం,అనుభూతి nundi అనుభవంగా రూపుదిద్దుకుంటే_____________________”

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles