భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) రెండవ బాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

మేము ద్వారకామాయిలోకి ప్రవేశించగానే ఎఱ్ఱటి రంగు ముఖమల్ వస్త్రంపై ఉంచిన సాయిబాబా వారి పెద్ద చిత్రపటం మా దృష్టిని ఆకర్షించింది.  బాబా తనదైన ప్రత్యేకమయిన భంగిమలో కూర్చుని ఉన్నారు.  ఆయన నుదుటిపై త్రిపుండ్రం, (విభూతి యొక్క మూడు రేఖలు) తెల్లటి కఫనీ, తలకు చుట్టబడిన తెల్లటి వస్త్రంతో ఆయన రూపం ఎంతో మనోహరంగా ఉంది.  ఆయన నేత్రాలు ఎంతో ప్రకాశవంతంగా మావైపు కరుణాదృక్కులతో చూస్తున్నట్లుగా ఉన్నాయి. 

ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంటే, ఆ కళ్ళు ప్రేమ, కరుణ, అనుగ్రహంతో నిండి, “నేను మీరాకకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను.  మీరు నాబిడ్డలు.  ఎంతో సేపటినుండి మీ కోసమే వేచివున్నాను.” అని మాతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయి.

నా ప్రియమయిన సద్గురు సాయిపై ఆయనే నా మాతృ మూర్తి అనే భావన నాలో కలిగింది. ఆ ప్రేమ తరంగాలు నా హృదయంలో ఉవ్వెత్తున లేచాయి.  వెంటనే ముందుకు పరుగున వెళ్ళి ఆయన పాదాల వద్ద వినమ్రతతో నా శిరసునుంచాను.  నా కళ్ళ నుండి ధారగా కన్నీళ్ళు కారుతున్నాయి. 

ఆ భావోద్వేగంతో నా గొంతు నుండి వెక్కిళ్ళతో ఏడుపు వస్తోంది.  ఆయన నాపై చూపుతున్న అనుగ్రహానికి నా శరీరంలో ప్రకంపనలు రావడంతో వణుకు కూడా ప్రారంభమయింది.  నా కన్నీరు ఆయన పవిత్రమయిన పాదాలను అభిషేకం చేస్తోంది.  ఏమి జరుగుతోందో నాకేమీ తెలియడంలేదు.

“నా సాయి! నా సద్గురు సాయి! నాకోసం నువ్వు నిజంగా అంతలా ఎదురు చూస్తున్నావా? నేనెంత అదృష్టవంతురాలిని.  నువ్వు మా  సద్గురువే కాదు. తల్లి, తండ్రి, అన్నీ నువ్వే.  ఈ ప్రపంచంలో అత్యంత విలువయినది ఏదయితే ఉన్నదో అదే నీవు.  నీకు సాటి మరేదీ లేదు.  మా సర్వస్వం నువ్వే.  నువ్వే మా గురువు, మాతృమూర్తి.  మా పూజలను ప్రేమతో అనురాగంతో స్వీకరించు సాయీ!”

ఆ సమయంలో అనిర్వచనీయమయిన భావతరంగాలు నా మదిలో ప్రవహించసాగాయి. ప్రతీ రామనవమి రోజున ఉదయాన్నే మేము ద్వారకామాయిలో ఆయన పటం ముందు కూర్చుని సాయి సచ్చరిత్రను పారాయణ చేస్తూ ఉంటాము.  ఈ విధంగా మేము ఎప్పటి నుండో ప్రతిసంవత్సరం ఈ పవిత్ర గ్రంథాన్ని పారాయణ చేస్తూ ఉన్నాము.

ఇప్పటికీ అదేవిధంగా కొనసాగిస్తూ వస్తున్నాము.  ఆయన ప్రశాంతమయిన వదనాన్ని చూస్తున్నప్పుడల్లా నామనసులో ఆయనపై  ప్రేమ, భక్తి ఎంతో బలీయంగా ఉత్పన్నమవుతూ ఉంటాయి.  ఈ రోజు జరిగినట్లుగానే ఎప్పుడూ నా ఆనందాశ్రువులు ఆయన పాదాలను అభిషేకిస్తూ ఉంటాయి. నా జీవితంలో సాయిబాబాపై ఇటువంటి పవిత్రమయిన ప్రేమానుభూతి చాలా మహత్తరమయినది. 

ఆయన నా మాతృమూర్తి అనే భావన. నేను ఆయనను అత్యధికంగా ప్రేమించే కుమార్తెను.  ఏమీ తెలియని వట్టి అమాయకురాలను.  నాకు ఆయన యొక్క మాతృప్రేమ కావాలి.  ఆయనని ప్రేమించడం, ఆరాధించడం అంతే నాకు తెలుసు. తరతరాలుగా మా వంశంలో ఒక సద్గురువుకు, శిష్యునికి మధ్య ఉన్న శాశ్వతమయిన అనుబంధం ఉన్నదని చెప్పడానికి ఇదే తార్కాణం.

ఇటువంటి అనుభూతి, అనుభవాలు ప్రతి సాయి భక్తునికి గతంలోను జరిగాయి, ఇప్పటికీ ఇంకా జరుగుతూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే సాయిబాబా వారందరికీ ప్రత్యక్ష కులదైవం. మనస్ఫూర్తిగా ఆయనని ప్రార్ధిస్తే మీరు చేసే ప్రార్ధనలు ఆయనకు తప్పక చేరతాయి. సాయిబాబాతో ఆధ్యాత్మికంగా బంధం ఏర్పరచుకోవడానికి మీరు చేసే పవిత్రమైన కార్యానికి  మధ్యవర్తులెవరూ అవసరం లేదు.

(ఈ ఆనంద తరంగాలు ఇంకా ఉన్నాయి)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) రెండవ బాగం

సాయినాథుని ప్రణతి

నిన్నటి ఈ లీల చదివేటపుడు ఆనందాని పొందాను మలి గుర్తుతెచుకుంటు పడుకునాను .నాకు బాబా , గురువుగారు ప్రసాదించిన అనుభవాలను గుర్తు తెచుకుంటుంటె ఎంతో ఆనందంగా అనిపించింది. కొది రొజులుగా నేను పడుతున బాదనంత గురువుగారు తన చేతులతో తిసేసినట్లుగా అమితానందానే పొందాను. తరువాత శేజారతి చుసాను బలే గౌప అద్భుతంలా అనిపించింది .బాబా నేనున్నాను అని బరొసా ఇచ్చినట్లు అనిపించింది. వెంటనే బాబా , గురువుగారి పోటో వంకచూసి Thanks చెపుకునాను.చాలా ఆనందించాను.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles