భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) మూడవ బాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

ఈ రోజు హేమాజోషీ గారు వివరిస్తున్న మరికొంత సమాచారం

(ఆంగ్ల మూలం: సాయిలీలాస్.ఆర్గ్)

భావ తరంగాలు – హేమా జోషి – 3వ భాగమ్

జయమనీ జైసా భావ తయా తైసా అనుభవ

దావిసి దయాఘనా ఐసీ తుఝీహీమావ

(సాయిబాబా పై ప్రేమ, భక్తి ఎవరు ఏవిధంగా చూపిస్తారో వారి వారి భావాలకనుగుణంగానే వారికి సాయిబాబా వారి అనుభవాలు కలుగుతాయి)

భగవంతుని అనుగ్రహం లేనిదే ఒక సద్గురువుని కలుసుకోవడం అసాధ్యం.  కాని సాయిబాబా విషయంలో దీనికి పూర్తి విరుద్ధం. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆయన మీద నమ్మకం, ఓర్పు కలిగి ఉంటే ఆయన తన అనుగ్రహపు జల్లులను కురిపిస్తారు. 

తల్లి తాబేలు తన దృష్టి మాత్రం చేతనే తన పిల్లలను పోషిస్తుంది. అదే విధంగా సాయిబాబా తన భక్తులను రక్షిస్తూ ఉంటారు. ఆయన తన భక్తులకు ఏ విధమయిన గురు మంత్రాన్ని ఉపదేశించకుండానే తమ కృపాదృష్టితో వారికి ఆధ్యాత్మిక ఆనందానుభూతిని కలుగజేస్తారు.  

మా ముత్తాతగారయిన స్వర్గీయ శ్రీనానా సాహెబ్ అనబడే శంకరరావు రఘునాధ్ దేశ్ పాండే నిమోన్ కర్ గారు శ్రీసాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తులు.  నానా సాహెబ్ గారి లాగే మరికొంతమంది భక్తులలో మాధవరావు దేశ్ పాండే (శ్యామా), గోపాలరావు బూటీ, కీ.శే.తార్ఖడ్, శ్రీ దభోల్కర్ కోటే పాటిల్, వీరంతా కూడా తాము జీవించి ఉన్నంతవరకు బాబా ప్రేమను, అభిమానాన్ని చూరగొన్నారు.

వీరందరూ తమ తమ శక్త్యానుసారం బాబా యెడల ప్రేమ, భక్తి కనబరుస్తూ, ఆయన సేవ చేసుకొని గురు శిష్య సంబంధాన్ని కొనసాగించుకున్నారు.  ఆ బంధం మరుసటి జన్మలకు కూడా కొనసాగుతుంది.  సాయిబాబా జీవించివున్న రోజులలోనే రామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.  ద్వారకామాయిపై పవిత్రమయిన జెండాని ప్రతిష్ఠించమని సాయిబాబా శ్రీనానాసాహెబ్ నిమోన్ కర్ గారిని ఆదేశించారు. దామూ సేఠ్ కాసార్ ను మరొక జెండాను ప్రతిష్ఠించమని చెప్పారు.

పవిత్రమయిన ఈ రెండు జెండాలను వేద పఠనం జరుగుతూ ఉండగా సమాధి మీద పరచేవారు.  ఆ జెండాలపై గులాబీదండలను, తులసిదళాలను పరచి అందంగా అలంకరించేవారు. బాబా చిత్రపటానికి, సమాధికి మహాపూజ చేసేవారు.  ఆ తరువాత వందలాది మంది భక్తులు, రాజసం ఉట్టిపడుతున్న రథం ముందు, ఈ జెండాలను తమ భుజాలపై మోసుకుంటూ వెళ్ళేవారు.

రథం ముందు సాగే ఈ జెండాలు చూడముచ్చటగా కనువిందు చేస్తూ ఉండేవి.  బాజా భజంత్రీలు, మేళతాళాలతో ఈ ఉత్సవ కార్యక్రమం మనోహరంగా జరుగుతూ ఉండేది.  వేలాదిమంది ప్రజలు ఆనందంతో నాట్యం చేస్తూ “సాయినాథ్ మహరాజ్ కీ జై!” అంటూ నినాదాలు చేస్తూ ఉండేవారు. 

ఆ విధంగా సాగే ఆ ఉత్సవ కార్యక్రమం ఎంతో నయనానందకరంగా ఉండేది.  ఆ తరువాత రాత్రి 7 గంటలకు ఈ రెండు జెండాలను ద్వారకామాయి మీద ప్రతిష్టించేవారు.  తరువాత వచ్చే రామనవమి వరకు అనగా సంవత్సరంపాటు ఆ రెండు జెండాలు ద్వారకామాయి శిఖరంపై ఎంతో సొగసుగా ఎగురుతూ ఉండేవి.  శ్రీసాయిబాబావారి అనుజ్ఞ ప్రకారం ఈ సాంప్రదాయం షిరిడీలో గత 115 సంవత్సరాలుగా జరుగుతూ ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.

స్వర్గీయ నానాసాహెబ్ దేశ్ పాండే నిమోన్ పట్టణంలో పెద్ద భూస్వామి.  బ్రిటిష్ వారి కాలంలో అహ్మద్ నగర్ జిల్లా సంగమనేర్ కు గౌరవ మాజిస్ట్రేట్. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.  అందరూ ఆయనని ఒక నాయకునిగా గౌరవించేవారు.  ఆయన షిరిడీ వచ్చి సాయిబాబా దర్శనం చేసుకున్నపుడు సాయిబాబా ఆయనను కౌగలించుకొని “మన గురు శిష్య సంబంధం చాలా పురాతనమయినది.  72 జన్మలనుంచి ఇప్పటికీ ఆ సంబంధం కొనసాగుతూ వస్తోంది” అన్నారు.

(ఈ ఆనంద తరంగాలు ఇంకా ఉన్నాయి)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles